PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ముడి చమురు ధరల పెరుగుదలను కామ్‌గా క్యాష్‌ చేసుకోగల 5 స్టాక్స్‌

[ad_1]

Stock Market Update: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు మళ్లీ మండుతున్నాయి, బ్రెంట్‌ (Brent) క్రూడ్‌ ఆయిల్‌ ధర వారం రోజుల్లోనే దాదాపు 6.5% పెరిగింది. జూన్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ $75 వరకు ఉండగా, ఇప్పుడు $90 మార్క్‌ దాటింది. ముడి చమురును ఉత్పత్తి చేసే మేజర్‌ కంట్రీస్‌ సౌదీ అరేబియా, రష్యాతో పాటు మరికొన్ని ఒపెక్‌ దేశాలు తమ ఉత్పత్తిలో కోతను కొనసాగిస్తామని ఇటీవలే ప్రకటించాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లోకి సప్లైని కూడా తగ్గిస్తామంటూ బాంబ్‌ పేల్చాయి. దీంతో.. బ్రెంట్‌ క్రూడ్‌, యూఎస్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియేట్‌ (US West Texas Intermediate- WTI) క్రూడ్ ఫ్యూచర్స్‌ వరుసగా $90, $87 పైన ట్రేడ్‌ అవుతున్నాయి.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరల నుంచి మన దేశంలోని కొన్ని కంపెనీలు లాభపడతాయి. వాటి పెట్టుబడులు/వ్యయాలు పెరక్కుండానే లాభాలు పెరుగుతాయి.

అధిక ముడి చమురు రేట్ల నుంచి లబ్ధి పొందే స్టాక్స్‌:

ఆయిల్‌ & నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ONGC)
ONGC విదేశ్ (కంపెనీ మొత్తం ఉత్పత్తిలో దీనిని పెద్ద వాటా) కారణంగా, కంపెనీ లాభాలకు – అంతర్జాతీయ క్రూడ్ ధరలకు పరస్పర సంబంధం కలిగి ఉంది. క్రూడ్ ధర పెరిగితే, కంపెనీ ఆదాయాల నుంచి అధిక రియలైజేషన్స్‌ వస్తాయి, లాభదాయకతపై సానుకూల ప్రభావం పడుతుంది.

పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ (Petronet LNG)
LNG రేట్లు క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా కదులుతాయి, అయితే కొద్దిగా టైమ్‌ పడుతుంది. రియలైజేషన్స్‌ పెంచడంలో ఇది కంపెనీకి సాయం చేస్తుంది, తద్వారా నిర్వహణ లాభాలు పెరుగుతాయి. ముడి చమురు రేట్లు పెరిగితే, LNG (liquefied natural gas) అమ్మకాలు పెరుగుతాయి.

ఇంద్రప్రస్థ గ్యాస్‌ (Indraprastha Gas)
ఇంద్రప్రస్థ గ్యాస్ (IGL) ఒక లీడింగ్‌ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్లేయర్. అధిక ముడి చమురు ధరలను తట్టుకోలేని కంపెనీలు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (CNG) వైపు మారతాయి. ఎందుకంటే, ఇది తక్కువ ధరకు లభించే, స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనం.

ఆయిల్ ఇండియా (Oil India)
ముడి చమురు & సహజ వాయువు అన్వేషణ, అభివృద్ధి & ఉత్పత్తి, ముడి చమురు రవాణా, LPG ఉత్పత్తి వ్యాపారాలను ఆయిల్ ఇండియా చేస్తోంది. అందువల్ల, క్రూడ్ ధరలు పెరిగినప్పుడు ఈ కంపెనీ ఆదాయాలు పెరుగుతాయి, మార్జిన్లు మెరుగుపడతాయి.

ఇంజినీర్స్ ఇండియా (Engineers India)
ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు (సింగిల్ & మల్టీ-ప్రొడక్ట్‌), రెండు దశల ఫ్లూయిడ్స్‌ రవాణా కోసం క్రాస్-కంట్రీ, అండర్‌వాటర్‌ పైప్‌లైన్స్‌ ప్లాన్ చేయడానికి, అమలు చేయడానికి ఈ కంపెనీకి కెపాసిటీస్‌ ఉన్నాయి. పంపింగ్ & కంప్రెసర్ స్టేషన్లు, మీటరింగ్ & రెగ్యులేటింగ్ స్టేషన్లను కూడా ఈ కంపెనీ నిర్మించగలదు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: అలియా భట్‌తో రిలయన్స్‌ డీల్‌, మూడేళ్ల కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *