PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మెంతికూర తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

[ad_1]

Fenugreek Leaves Health Benefits: ఆకు కూరలు మన డైట్‌లో ఎక్కువగా తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మనకు తెలుసు. ముఖ్యంగా మెంతి కూరలోని పోషకాలు.. మనల్ని చాలా అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం మన డైట్‌లో మెంతి కూరను ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో మన శరీరంలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. మన వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి.. మెంతికూర సహాయపడుతుంది. మెంతికూరలో డైటరీ ఫైబర్‌, ప్రొటీన్‌, విటమిన్‌ ఏ, సీ, బీ, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి.

బరువు కంట్రోల్‌లో ఉంటారు..

శీతాకాలంలో మనం బరువు పెరిగే.. ఛాన్సెస్‌ ఎక్కువగా ఉంటాయి. చలి కారణంగా.. వర్కవుట్స్‌ చేయడం కుదరదు. ఈ కాలంలో బరువును కంట్రోల్‌లో ఉంచుకోవడానికి మెంతి కూర సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఫైబర్‌… ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయడంలో సహకరిస్తుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. దీని వల్ల కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. అతిగా తినే అలవాటునీ తగ్గిస్తుంది. ఈ రెండూ బరువు పెరగకుండా చేస్తాయి.

క్యాన్సర్‌కు చెక్‌..

మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సి, విటమిన్ ఎ, బీటా కెరోటిన్ మెండుగా ఉంటాయి. శరీర జీవక్రియ సరిగ్గా లేకపోతే.. ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. దీని కారణంగా మన శరీరంలో కణాలు, అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మెంతికూరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా ఇన్‌ఫ్లమేటరీ పరిస్థితులు, ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. మెంతి కూరలో యాంటీకార్సినోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. మెంతికూరలోని సపోనిన్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్‌లో ఇది ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.

కడుపులో సమస్యలు మాయం..

మెంతికూరలోని పీచు సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అవి ప్రేగుల నుంచి టిని పీల్చుకుంటాయి, పేగులను మృదువుగా చేస్తాయి. మెంతికూర తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే.. బౌల్‌ మూవ్‌మెంట్‌ మంచిగా జరుగుతుంది. మెంతి కూర అజీర్తి, మలబద్ధకం, ఇన్ఫ్లమేషన్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

షుగర్‌ పేషెంట్స్‌కు మంచిది..

మెంతి కూర రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మెంతికూరలో ఉండే అమైనో యాసిడ్‌కు యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇది ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దింతో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. టైప్‌ 2 డయాబెటిస్‌ను నివారించడానికీ ఇది ఎఫెక్టివ్‌గా ఉంటుంది.

ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి..

ఇందులో ఎక్కువ మోతాదులో క్యాల్షియం, మెగ్నీషియం, కొద్దిమోతాదులో డి లభిస్తాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెంతికూరలో డయోస్జెనిన్ ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది ఆస్టియోపోరసిస్‌‌‌‌ ముప్పును తగ్గిస్తుంది.

గుండెకు మేలు చేస్తుంది..

మెంతికూరలో గెలాక్టోమన్నన్ ఉంటుంది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌తో ఇబ్బందిపడే వారు క్రమం తప్పక మెంతి కూరను తీసుకోవడం మంచిదంటున్నాయి పలు అధ్యయనాలు. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *