Feature
oi-Garikapati Rajesh
వృషభ
రాశి:
ఈ
వారం
మిశ్రమంగా
ఉంటుంది.
ఆకస్మిక
సవాళ్లను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
ఉద్యోగస్తులకు
పనిభారం
ఎక్కువగా
ఉంటుంది.
అయితే
వారం
చివరికి
పరిస్థితి
అదుపులోకి
వస్తుంది.
వ్యాపారంలో
ఒడిదుడుకులున్నాయి.
పోటీదారులతో
మార్కెట్
లో
గట్టి
పోటీ
ఉంటుంది.
ప్రేమ
వ్యవహారాల్లో
ఆలోచించి
ముందడుగు
వేయాలి.
కీలక
సమయంలో
మీ
జీవిత
భాగస్వామి
మీకు
మద్దతుగా
ఉంటారు.
ప్రతిరోజు
శివుణ్ని
ఆరాధించాలి.
మిథున
రాశి:
తెలివితేటలు,
మాటను
సరిగ్గా
వినియోగించుకోవాలి.
పనిచేసేచోట
అక్కడ
పనిచేస్తున్నవారితో
మమేకమవడానికి
ప్రయత్నించాలి.
చిన్న
చిన్న
విషయాలను
పట్టించుకోకుండా
ఉంటేనే
మంచిది.
పనిభారం,
బాధ్యతలవల్ల
శారీరకంగానే
కాకుండా
మానసికంగా
కూడా
అలసటకు
గురవుతారు.
ప్రేమ
వ్యవహారాలు
కలిసిరావు.
మూడో
వ్యక్తి
జోక్యం
ఇక్కట్లను
తెస్తాయి.
ఆదాయం
కూడా
ఈ
వారం
పెరగదు.
దుర్గాదేవిని
పూజించాలి.

తులా
రాశి:
ఈ
వారం
మిశ్రమ
ఫలితాలున్నాయి.
సన్నిహితులు,
శ్రేయోభిలాషులతో
చర్చించకుండా
ఎటువంటి
నిర్ణయాలు
తీసుకోకూడదు.
వేరే
ప్రాంతానికి
బదిలీ
అవడంవల్ల
విచారానికి
గురవుతారు.
వారం
ప్రారంభంలో
ఆర్థిక
మాంద్యం
ఉంటుంది.
ద్వితీయార్థంలో
లాభం
ఉంటుంది.
ప్రేమ
భాగస్వామితో
వివాదం
ఏర్పడుతుంది.
జీవిత
భాగస్వామి
ఆరోగ్యం
గురించి
మనసు
కాస్త
ఆందోళన
చెందుతుంది.
ప్రతిరోజూ
శివుడిని
పూజించాలి.
వృశ్చిక
రాశి:
వీరికి
కొన్ని
సవాళ్లు
ఎదురవుతాయి.
వారం
ప్రారంభంలో
కొన్ని
సమస్యలు
ఆందోళన
కలిగిస్తాయి.
ఒక
పనిలో
జాప్యం
మీలో
కోపాన్ని
పెంచుతుంది.
ఆరోగ్యం
గురించి
జాగ్రత్త
వహించాలి.
అత్యంత
క్లిష్ట
సమయంలో
మీ
జీవిత
భాగస్వామి
మీకు
అండగా
ఉంటారు.
ప్రతిరోజు
హనుమంతుణ్ని
పూజించాలి.
మకర
రాశి:
ఏ
పనిచేసినా
తెలివిగా
చేయాలి.
లేదంటే
ఆర్థికంగా
నష్టం
ఉంటుంది.
ప్రత్యర్థులతో
అప్రమత్తంగా
ఉండాలి.
కోర్టులో
ఏదైనా
కేసు
నడుస్తుంటే
తప్పుడు
మార్గంలో
పరిష్కరించుకోవడానికి
ప్రయత్నించకూడదు.
ఉద్యోగం
చేసే
మహిళలు
కొన్ని
ఇక్కట్లను
ఎదుర్కొంటారు.
పెద్ద
ఖర్చు
మీ
బడ్జెట్
ను
గందరగోళం
చేస్తుంది.
ప్రేమ
భాగస్వామితో
అభిప్రాయభేదాలు
ఉంటాయి.
మాట్లాడి
సమస్యను
పరిష్కరించుకోవడం
ఉత్తమం.
ప్రతిరోజు
హనుమంతుణ్ని
పూజించాలి.
మీన
రాశి:
జాగ్రత్తగా
అడుగు
వేయాల్సి
ఉంటుంది.
తొందరపడి
ఏ
నిర్ణయం
తీసుకోకూడదు.
పూర్వీకుల
ఆస్తుల
కొనుగోలులో
ఆటంకాలు
ఎదురవుతాయి.
ఆరోగ్య
సమస్యవల్ల
వారం
మధ్యలో
మనసు
కలతకు
గురవుతుంది.
వారం
ద్వితీయార్థంలో
మెరుగుదల
ఉంటుంది.
వాహనాన్ని
జాగ్రత్తగా
నడపాల్సి
ఉంటుంది.
జీవిత
భాగస్వామితో
మాట్లాడే
విధానాన్ని
మార్చుకోవాలి.
ప్రతి
రోజు
విష్ణువును
ఆరాధించడంతోపాటు
అరిచెట్టుకు
నీళ్లు
పోయండి.
English summary
Think ahead in love affairs.Your spouse will support you at crucial times.Shiva should be worshiped every day.
Story first published: Monday, May 8, 2023, 18:53 [IST]