Feature
oi-Garikapati Rajesh
జ్యోతిష్యం
ప్రకారం
గ్రహాలు
ఒక
రాశి
నుంచి
మరో
రాశికి
మారినప్పుడు
ఆ
ప్రభావం
కొన్ని
రాశులకు
కలిసివస్తే..
మరికొన్ని
రాశులకు
ప్రతికూలంగా
ఉంటుంది.
ఈనెల
10వ
తేదీన
అంగారకుడు
కర్కాటక
రాశిలోకి
ప్రవేశించడంవల్ల
ఏ
రాశులవారిపై
ఎటువంటి
ప్రభావం
ఉంటుందో
తెలుసుకుందాం.
ప్రధానంగా
5
రాశులవారికి
అదృష్టం
కలిసివస్తుంది.
జులై
1వ
తేదీ
వరకు
వీరికి
తిరుగుండదు.
మొత్తం
51
రోజులు
పట్టిందల్లా
బంగారమవుతుందని
చెప్పవచ్చు.
అంగారకుడు
సాహసం,
పరాక్రమం,
ధైర్యం,
సంపద,
భూమి,
పెళ్లికి
ప్రధాన
కారకుడు.
మేషం,
వృషభం,
సింహ,
కన్య,
తులా
రాశులకు
బాగుంటుంది.
అంతులేని
ధన
సంపదలు
వస్తాయి.
ఈనెల
30వ
తేదీన
శుక్రుడు
సైతం
కర్కాటక
రాశిలోకి
ప్రవేశించడంతో
యుతి
ఏర్పరుస్తాయి.
మంగళ,
శుక్ర
గ్రహాలు
వేర్వేరు
సమయాల్లో
పరివర్తనం
చెందబోతున్నాయి.

తులా
రాశి
:
ఈ
రాశివారికి
పనిచేసే
చోట
గుర్తింపు,
ప్రశంసలు
లభిస్తాయి.
కొత్తగా
పదవిని
చేపట్టడంవల్ల
బాధ్యతలు
పెరుగుతాయి.
సమాజంలో
గౌరవం
లభిస్తుంది.
ఆర్ధికంగా
పటిష్టమైన
స్థితిలో
ఉండటంతోపాటు
ఆదాయానికి
అదనపు
మార్గాలు
ఏర్పడతాయి.
కన్యారాశి
:
కన్యా
రాశివారికి
మహర్దశ
కలగుతుంది.
ఆర్థికంగా
ఎటువంటి
సమస్యలు
ఉండవు.
ధనవర్షం
వచ్చి
పడుతుంది.
ఆదాయం
పెరగడంతోపాటు
ఆరోగ్యం
కూడా
సహకరిస్తుంది.
కొత్తగా
వ్యాపారాలు
ప్రారంభించాలనుకునేవారికి
ఇది
అనువైన
సమయం.
వృషభ
రాశి
:
ఈ
రాశివారికి
పదవి,
డబ్బులు
వచ్చిపడతాయి.
దూర
ప్రయాణాలుంటాయి.
ఆరోగ్యం
విషయంలో
అప్రమత్తంగా
ఉండాలి.
సమాజంలో
గౌరవ
మర్యాలు
పుష్కలంగా
లభిస్తాయి.
ఆర్థికంగా
ఎటువంటి
ఇబ్బందిని
ఎదుర్కొనరు.
మేషరాశి
:
మేష
రాశివారికి
మంగళ
గ్రహ
గోచారం
అద్భుతంగా
ఉండబోతోంది.
కొత్తగా
ఇల్లు,
వాహనాలు
కొనుగోలు
చేస్తారు.
తల్లిదండ్రుల
ఆరోగ్యంపై
అప్రమత్తంగా
ఉండాలి.
వివాహమైనవారి
జీవితంలో
అంతా
బాగుంటుంది.
ఆర్థికంగా
ఎటువంటి
సమస్యలుండవు.
సింహ
రాశి
:
విదేశాలకు
వెళ్లాలనే
కోరిక
నెరవేరుతుంది.
ఆర్థికంగా
ఇబ్బంది
ఉండదు.
కోర్టు
వ్యవహారాల్లో
ఊహించనిరీతిలో
ఆర్థిక
లాభం
కలగనుంది.
కుంభ
రాశి
:
పనిచేసే
చోట
ప్రశంసలు
లభిస్తాయి.
కష్టానికి
తగిన
ఫలితం
ఉంటుంది.
అదనపు
ఆదాయ
మార్గాలు
కనిపిస్తాయి.
ఆరోగ్యం
బాగుంటుంది.
English summary
According to astrology, when the planets move from one sign to another, the effect is favorable for some signs, but negative for others.