PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రూ.2,000 నోట్లు ఇప్పటికీ చెల్లుతాయి, కీలక అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ

[ad_1]

Rs 2000 notes returned to the system: రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు (withdrawal of Rs 2000 bank notes) రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) ప్రకటించిన తర్వాత చాలా వరకు పింక్ నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు చేరాయి. ఈ నోట్ల విషయంలో కేంద్ర బ్యాంక్‌ తాజా అప్‌డేట్‌ ఇచ్చింది.

“మే 19, 2023న, ₹2000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన రోజు బిజినెస్‌ ముగిసే నాటికి ₹3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్నాయి. నవంబర్ 30, 2023న బిజినెస్‌ ముగిసే నాటికి ఆ మొత్తం విలువ రూ.9,760 కోట్లకు తగ్గింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న ₹2000 నోట్లలో 97.26% తిరిగి వచ్చాయి” అని ఆర్‌బీఐ ప్రకటించింది. 

తిరిగి రాని మొత్తం రూ.9,760 కోట్లు
ఈ లెక్కన, రూ.9,760 కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు ఇంకా తిరిగి రాలేదు, అవన్నీ ఇప్పటికీ ప్రజల దగ్గరే ఉన్నాయి. ఈ విలువను నోట్ల సంఖ్యలోకి మారిస్తే… మొత్తం 4,88,00,000 నోట్లు (విలువ కాదు, సంఖ్య) ఇంకా దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నాయి.

ఇప్పటికీ రూ.2 వేల నోట్ల చెల్లుబాటు ‍‌(Rs 2,000 notes are still legal tender)
సెంట్రల్ బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీలో భాగంగా, రూ.2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి విత్‌డ్రా చేస్తున్నట్లు మే 19, 2023న ఆర్బీఐ ప్రకటించింది. నోట్లను వెనక్కు తీసుకుంది గానీ రద్దు చేయలేదు కాబట్టి అవి ఇప్పటికీ చెల్లుతాయి. 2000 రూపాయల నోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని ఆర్‌బీఐ కూడా స్పష్టం చేసింది.

రూ. 2000 నోట్లను బ్యాంక్‌ అకౌంట్లలో డిపాజిట్ చేయడానికి లేదా చిన్న నోట్లు రూపంలోకి మార్చుకోవడానికి దేశంలోని అన్ని బ్యాంక్ బ్రాంచ్‌ల్లో అనుమతించారు. మొదట సెప్టెంబర్ 30, 2023 వరకు గడువిచ్చారు, ఆ తర్వాత ఆ డెడ్‌లైన్‌ను అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించారు.

ప్రస్తుతం, బ్యాంక్‌ బ్రాంచ్‌ల్లో పింక్‌ నోట్ల డిపాజిట్‌/ఎక్సేంజ్‌ ఫెసిలిటీ లేదు. మీ దగ్గర ఇప్పటికీ రూ.2 వేల నోట్లు ఉంటే వాటిని రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో (RBI Issue Offices) మార్చుకోవచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్‌బీఐకి 19 ఇష్యూ ఆఫీస్‌లు ఉన్నాయి. ఆ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు లేదా మీ బ్యాంక్‌ అకౌంట్‌లో డిపాజిట్‌ చేసుకోవచ్చు. వ్యక్తుల వద్దే కాకుండా సంస్థల వద్ద పెద్ద నోట్లు ఉన్నా ఇదే పద్ధతి ఫాలో కావచ్చు.

రూ.2 వేల నోట్లను డిపాజిట్‌ చేసే లేటెస్ట్‌ ఆప్షన్లు ‍‌(How to deposit/exchange Rs 2,000 notes)
ఒకవేళ ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం మీకు దూరంలో ఉన్నా, మీరు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నా.. మీ దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్లను ఇండియా పోస్ట్‌ ద్వారా కూడా పంపవచ్చు. మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి, “ఇన్సూర్డ్‌ పోస్టల్‌ సర్వీస్‌” ద్వారా డబ్బును ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీస్‌కు పంపవచ్చు. బీమా చేసిన పోస్ట్‌ (insured postal service) ద్వారా పంపే కవర్‌లో రూ.2 వేల నోట్లతో పాటు, మీ బ్యాంక్‌ ఖాతా వివరాలు ఉన్న ఫారాన్ని కూడా ఉంచాలి. ఈ ఫారాన్ని ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల, ఆర్‌బీఐ ఆఫీస్‌కు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుంది, సమయం మిగులుతుంది.

దీంతోపాటు.. బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 నోట్లను జమ చేసేందుకు TLR (Triple Lock Receptacle) ఫామ్‌ను కూడా RBI అందుబాటులోకి తెచ్చింది. మీరు RBI రీజనల్‌ ఆఫీస్‌కు వెళ్లినా, అక్కడ క్యూలో నిలబడాల్సిన పనిని TLR ఫామ్‌ తప్పిస్తుంది. టీఎల్‌ఆర్‌ ఫామ్‌ను ఆర్‌బీఐ ఆఫీస్‌లో ఇస్తారు. మీరు డిపాజిట్‌ చేయాలనుకున్న రూ.2 వేల నోట్ల సంఖ్యను, బ్యాంకు ఖాతా వివరాలను టీఎల్‌ఆర్‌ ఫామ్‌లో నింపి, దానిని అక్కడే ఉన్న డిపాజిట్‌ బాక్సులో వేయాలి. RBI సిబ్బంది ఆ నోట్లను సంబంధిత వ్యక్తుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తారు. 

ఇన్సూర్డ్‌ పోస్టల్‌ సర్వీస్‌, TLR ఆప్షన్లు రెండూ రెండూ అత్యంత సురక్షితమైనవని, ఎలాంటి అనుమానం లేకుండా వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్లే కాకుండా, మీరు నేరుగా RBI రీజనల్‌ ఆఫీస్‌కు వెళ్లి, అక్కడ క్యూలో నిలబడి, రూ.20,000 వరకు విలువైన రూ.2000 నోట్లను స్వయంగా మార్చుకునే ఫెసిలిటీ కూడా ఉంది.

మరో ఆసక్తికర కథనం: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? – ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *