లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ – సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!

[ad_1]

Upcoming Maruti Suzuki Cars: మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ వచ్చే ఏడాది రానున్న అతిపెద్ద లాంచ్‌లలో ఒకటి. దాని స్టైల్‌లో మార్పుతో పాటు, సమర్థత పరంగా కూడా అడ్వాన్స్‌డ్‌గా ఉండాలని భావిస్తున్నారు. దీనికి కారణం కొత్త జెడ్ సిరీస్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్. ఇది ప్రస్తుత స్విఫ్ట్ కంటే మెరుగైన మైలేజీతో వస్తుంది. అంతకంటే పవర్ ఫుల్ కూడా. పెట్రోల్ ఇంజన్‌తో దాదాపు 100 బీహెచ్‌పీ శక్తిని ఇవ్వగలదు.  దీని మైలేజ్ లీటరుకు 24 నుంచి 25 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది మీకు అత్యంత మైలేజీ ఫ్రెండ్లీ అనుకోవచ్చు.

రెండో మార్పు ఇంటీరియర్‌లో ఉంది. దీని ఇంటీరియర్‌కు భారీ మార్పులు చేశారు. ఓవర్సీస్‌లో కొత్త స్విఫ్ట్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కొత్త 9 అంగుళాల టచ్‌స్క్రీన్ కూడా ఉన్నాయి. అయితే రాబోయే భారతీయ మోడల్‌లో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ గురించి ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ఇందులో 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కాకుండా కొత్త స్విచ్‌గేర్‌తో పాటు ఇందులో అందించిన మెటీరియల్ నాణ్యత మరింత ప్రీమియంగా ఉంటుంది. అలాగే లుక్ కూడా లేయర్డ్‌గా ఉంటుంది. ఈ కొత్త ఇంజన్‌ను పొందిన మొదటి మారుతి కారు ఈ స్విఫ్ట్‌నే. అయితే తర్వాత దీన్ని ఇతర కార్లలో కూడా చూడవచ్చు.

కంఫర్ట్ గురించి మాట్లాడినట్లయితే కొత్త మారుతి స్విఫ్ట్‌లో మెరుగైన సౌకర్యం కోసం కొత్త సీట్లు అమర్చారు. ధర ప్రభావం కారణంగా హైబ్రిడ్ స్విఫ్ట్‌కు బదులుగా, ప్యూర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన మోడల్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టనున్నారు. కానీ దాని పెరిగిన సామర్థ్యం కొత్త స్విఫ్ట్ వైపు కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రానుంది. కొత్త స్విఫ్ట్ ప్రస్తుత స్విఫ్ట్ కంటే కొంచెం ఎక్కువ ధరతో రానుందని అంచనా. ఇది మార్పులకు అనుగుణంగా ఉంటుంది.

మరోవైపు భారతదేశంలో 2023 ఏప్రిల్‌లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు అమ్మకాల్లో దూసుకుపోతుంది కేవలం ఏడు నెలల్లోనే ఈ కొత్త ఎస్‌యూవీ మోడల్‌కు సంబంధించిన 75,000 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఐదు వేరియంట్లలో (సిగ్మా, డెల్టా, డెల్టా + జీటా, ఆల్ఫా) అందుబాటులో ఉన్న ఈ కారు ప్రారంభ ధరను రూ. 7.5 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) నిర్ణయించారు. కొత్త హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న కొనుగోలుదారులను ఆకర్షించడంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ విజయవంతం అయింది. ఎందుకంటే ఈ కారు దాని విభాగంలో అత్యంత చవకైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. మారుతి ఫ్రాంక్స్‌ కారును బలెనో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించారు. అమ్మకాల పరంగా ఇది ఎంతో జనాదరణ పొందిన బలెనోను కూడా దాటేసింది.

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? – 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *