PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

లాభాల్లో ఈవీ బస్‌ల తయారీ సంస్థ ఒలెక్ట్రా, Q3 ఫలితాల ప్రకటన

[ad_1]

Olectra Greentech Limited: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OGL) ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ 31, 2023తో ముగిసిన మూడో త్రైమాసికానికి తొమ్మిది నెలల ఏకీకృత ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్ల బోర్డు అధికారికంగా ఫలితాలను ఆమోదించింది. గత ఏడాది ఇదే సమయంలో 142 బస్సులను సరఫరా చేయగా ఈ ఏడాది వాటి సంఖ్య 178 కి చేరింది. 

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో  ఓలెక్ట్రా ఆదాయం 33 శాతం పెరిగి 342.4 కోట్లకు చేరింది.  బస్సుల సరఫరా సంఖ్య పెరగటంతో  ఈ గణనీయమైన ఆదాయ అభివృద్ధి నమోదు అయిందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఇప్పటి వరకు 1,615 ఎలక్ట్రిక్ వాహనాలను డెలివరీ చేయగా 8,088 బస్సుల ఆర్డర్ సంస్థ వద్ద ఉంది. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 56.10 కోట్లుగా ఉంది. గత సంవత్సరం కంటే ఇది 52 శాతం పెరుగుదలను నమోదు చేసింది. పన్నుకు ముందు లాభం రూ. 33.84 కోట్లకు పెరిగింది, గత ఆర్థిక సంవత్సరం రూ. 20.46 కోట్లతో పోలిస్తే ఇది 65% పెరుగుదలగా నమోదు అయింది. పన్ను తర్వాత లాభం  రూ. 27.11 కోట్లుగా  నమోదు అయింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 15.30 కోట్లతో పోలిస్తే ఇది 77 శాతం పెరిగింది. డిసెంబరు 31, 2023తో ముగిసిన తొమ్మిది నెలలకు కంపెనీ ప్రతి షేరుకు రూ.7.69 ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే సమయానికి రూ.4.70గా ఉంది.

డిసెంబర్ 31 2023 నాటికి 9 నెలల పనితీరు హైలైట్‌లు

 2023-24 ఆర్ధిక సంవత్సరం 9 నెలల ఓలెక్ట్రా ఆదాయం రూ.865.33 కోట్లు, ఇది గత ఏడాది కంటే 21% పెరిగింది. కంపెనీ యొక్క EBITDA 9 నెలల్లో రూ.142.67 కోట్లకు చేరుకుంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన 40 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పన్నుల చెల్లింపునకు ముందు లాభం రూ.85.67 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం రూ.54.38 కోట్లతో పోలిస్తే ఇది 58 శాతం పెరుగుదల నమోదైందని కంపెనీ తెలిపింది. పన్నుల చెల్లింపు తరువాత లాభం గత ఆర్థిక సంవత్సరం రూ. 39.40 కోట్లతో పోలిస్తే 62% పెరిగి రూ. 63.76 కోట్లుగా ఉంది.

ఫలితాలపై  ఓ జి ఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె వీ. ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి 9 నెలల మా ఏకీకృత ఆదాయంలో బలమైన వృద్ధిని నివేదించడం మాకు సంతోషంగా ఉంది. మా బస్సుల ఉత్పత్తి సామర్థ్యాన్ని, మా సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారిస్తాం. మాకు బలమైన ఆర్డర్ బుక్ కూడా ఉంది. 150 ఎకరాల విస్తీర్ణంలో సీతారాంపూర్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు   సాగుతున్నాయి. వచ్చే నెల నుంచి ఈ ప్రాంగణం నుంచి పాక్షిక ఉత్పత్తిని ప్రారంభిస్తున్నాము. ఈ ఫ్యాక్టరీతో మా ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుంద’’ని ఆయన తెలిపారు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *