Upcoming Tata Nexon Facelift: టాటా మోటార్స్ తన కొత్త నెక్సాన్‌ను త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడానికి అతిపెద్ద కారణం దాని డిజైన్. ఇందులో చాలా మార్పులు చేశారు. కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ సరిగ్గా కొత్త తరం లాగానే ఉంది. ఇందులో డిజైన్ పరంగా చాలా మార్పులు చేశారు.

కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 డిజైన్
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కర్వ్ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త లుక్‌తో ఇది కనిపిస్తుంది. కర్వ్ కాన్సెప్ట్ లాగా కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో పాటు సన్నని డీఆర్ఎల్స్, ప్రస్తుత నెక్సాన్ కంటే చిన్న గ్రిల్‌ను పొందుతుంది. ఇది అనేక ఇతర ఎస్‌యూవీల్లో కూడా చూడవచ్చు. ఫలితంగా కొత్త నెక్సాన్ మిగిలిన వాటి నుంచి ప్రత్యేకంగా నిలుస్తుంది.

ప్రీమియం ఫీచర్ అయిన సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లను కూడా ఇందులో చూడవచ్చు. ఇదే ఫీచర్ కొత్త కియా సెల్టోస్‌లో కూడా ఉంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ప్రజాదరణను చూపుతుంది. దీని అర్థం కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ధర చాలా ప్రీమియం స్థాయిలో ఉండవచ్చు. డోర్లు లేదా సైడ్ వ్యూ కూడా ఇలాగే ఉంటుందని అంచనా. అయితే అల్లాయ్ వీల్స్ కూడా కొత్తవిగా ఉన్నాయి. వెనుక భాగంలో ఫుల్ విడ్త్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, సరికొత్త బంపర్ లభిస్తాయి.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 ఇంజిన్ ఎలా ఉంది?
కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఆటో ఎక్స్‌పోలో చూసినట్లుగా కొత్త 1.2 లీటర్ టర్బో పెట్రోల్, కర్వ్ పెట్రోల్ కాన్సెప్ట్ ఆధారంగా కొత్త ఇంజన్‌ను పొందుతుంది. దీంతో ప్రస్తుత నెక్సాన్ కంటే మరింత శక్తివంతమైన, మెరుగైన మైలేజీని ఆశించవచ్చు. లోపలి భాగంలో కొత్త నెక్సాన్ చాలా ఆధునికంగా ఉంటుంది. ఇందులో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది అత్యంత ఎక్కువ పోటీ ఉన్న విభాగంలో కంపెనీని మెరుగైన స్థితిలో ఉంచడానికి పని చేస్తుంది.

టాటా మోటార్స్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కావడంతో, కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ రిలీజ్ అతిపెద్ద లాంచ్‌లలో ఒకటిగా ఉండనుంది. త్వరలోనే దీనికి సంబంధించి మరింత సమాచారం రావచ్చని భావిస్తున్నారు. దీని లాంచ్ ఈవెంట్ వచ్చే పండుగ సీజన్‌లో జరిగే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్ ఈవీ తక్కువ సమయంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారింది. కొత్త కస్టమర్లకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. కేవలం మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే టాటా నెక్సాన్ ఈవీ 50,000 యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. మొత్తమ్మీద నెక్సాన్, దాని వేరియంట్‌లు అన్నీ కలిపి దేశీయ మార్కెట్‌లో 15 శాతం అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *