వేలిముద్ర వేస్తేనే కొత్త సిమ్‌, పాత నంబర్లకు కూడా బయోమెట్రిక్‌ గుర్తింపు

[ad_1]

Biometric Authentication For New Mobile Number: మన దేశంలో కోట్ల కొద్దీ మొబైల్‌ నంబర్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో వ్యక్తి పేరిట ఒకటి కంటే ఎక్కువ సిమ్‌ కార్డ్‌లు (SIM Card) ఉన్నాయి. DoT (Department of Telecom) రూల్స్‌ ప్రకారం, ఒక ఆధార్‌ కార్డ్‌ ‍‌మీద గరిష్టంగా 9 మొబైల్‌ నంబర్లు ‍‌(nine SIM cards on one Aadhaar card) ఉండొచ్చు.

ప్రస్తుతం, ఒక వ్యక్తి కొత్త సిమ్‌ కార్డ్‌ తీసుకోవాలంటే అప్లికేషన్‌ పెట్టుకోవాలి. అప్లికేషన్‌ ఫారంతో పాటు ఆధార్‌ వివరాలు ఇవ్వాలి. ఆధార్‌ నంబర్‌ లేకపోతే కొత్త మొబైల్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదు. సిమ్‌ కార్డ్‌కు, ఆధార్‌ నంబర్‌కు లింక్‌ పెట్టినా… ఇప్పటికీ చాలా మంది సిమ్‌ సెల్లర్స్‌ అడ్డదార్లు తొక్కుతున్నారు. ఒకే ఆధార్‌ నంబర్‌ మీద చాలా సిమ్‌లు ఇస్తున్నారు. ఒక వ్యక్తికి తెలీకుండా, అతని ఆధార్‌తో ఇతరులకు మొబైల్‌ కనెక్షన్లు జారీ చేస్తున్నారు. ఆ మొబైల్‌ నంబర్లను అక్రమాలకు, అసాంఘిక కార్యక్రమాలకు, దేశ విద్రోహ చర్యలకు అవతలి వ్యక్తులు ఉపయోగిస్తున్నారు. 

ఈ అడ్డదార్లను మూసేయడానికి, టెలికమ్యూనికేషన్ బిల్లు – 2023ను ‍‌(Telecommunication Bill, 2023) పార్లమెంట్‌ ఆమోదించింది. 

వేలిముద్ర వేస్తేనే కొత్త సిమ్‌ జారీ
ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్‌ ప్రకారం, ఈ బిల్లు చట్ట రూపం దాల్చి అమల్లోకి వస్తే, ఇకపై బయోమెట్రిక్ ‍‌(biometric) ఆధారంగా మాత్రమే మొబైల్ సిమ్ కార్డ్‌లు జారీ చేస్తారు. అంటే, కొత్త సిమ్‌ కార్డ్‌ కొనాలంటే (buying mobile SIM) కచ్చితంగా వేలిముద్ర వేయాలి. గతంలో లాగా ఆధార్‌ వివరాలు ఇచ్చి, ఫొటో దిగి వస్తే సరిపోదు.  

కొత్త మొబైల్‌ కనెక్షన్‌ తీసుకోవడానికి అవసరమైన గుర్తింపు ‘బయోమెట్రిక్’ అని టెలికమ్యూనికేషన్ బిల్లు – 2023లో స్పష్టంగా ఉంది. వేలిముద్ర వేయకుండా కొత్త సిమ్‌ తీసుకోవడం ఇకపై సాధ్యం కాదు. దీనివల్ల, అక్రమాల కోసం వక్రమార్గంలో కొత్త సిమ్‌ కార్డులు తీసుకోవడం ఆగిపోతుంది. ఒక వ్యక్తికి తెలీకుండా అతని పేరిట పెద్ద సంఖ్యలో మొబైల్‌ కనెక్షన్లు తీసుకోవడం కూడా కుదరదు.

పాత నంబర్లకు కూడా బయోమెట్రిక్‌ అవసరం
కొత్త చట్టం ప్రకారం, ఇప్పటికే వాడుకలో ఉన్న మొబైల్ నంబర్ వినియోగదార్లకు బయోమెట్రిక్‌ ప్రమాణీకరణ ‍‌(biometric authentication) వర్తిస్తుంది. అంటే, ఇప్పటికే సిమ్‌ కార్డ్‌ తీసుకుని ఏళ్ల తరబడి దానిని వినియోగిస్తున్న వ్యక్తులు కూడా వేలిముద్రలు వేయాలి. తద్వారా, ఆ సిమ్‌ కార్డ్‌ను తామే ఉపయోగిస్తున్నామని/తామే తీసుకున్నామని క్లారిటీ ఇచ్చి, తమ గుర్తింపును నిరూపించుకోవాలి.

రూల్స్‌ ప్రకారం, టెలికమ్యూనికేషన్ సేవలు అందుకుంటున్న వ్యక్తిని, అతని బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు ద్వారా సదరు టెలికాం కంపెనీ గుర్తించాలి. ఈ నిబంధన ప్రకారమే పాత & కొత్త సిమ్‌ కార్డుల కోసం వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. 

జనవరి నుంచి డిజిటల్‌ KYC 
దీంతోపాటు, 2024 జనవరి 01 నుంచి, ఏ వ్యక్తయినా కొత్త సిమ్‌/మొబైల్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే తప్పనిసరిగా డిజిటల్‌ కేవైసీని ‍‌(Digital KYC) పూర్తి చేయాలి. ఒక వ్యక్తి ఒకేసారి ఎక్కువ సిమ్ కార్డులను కొనుగోలు చేయాలంటే, కమర్షియల్‌ కనెక్షన్ ద్వారా మాత్రమే తీసుకోవాలి. కొత్త సిమ్‌ కార్డ్ తీసుకునే సమయంలో, సిమ్‌ కార్డ్‌ కొనే వ్యక్తితో పాటు అమ్మే వ్యక్తి కూడా రిజిస్టర్‌ చేసుకోవాలి. 

మరో ఆసక్తికర కథనం: దుబాయ్‌లో గోల్డ్‌ రేటెంతో తెలుసా? – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *