కుంభ
రాశి
శనిదేవుడు
శక్తివంతంగా
ఉండటంవల్ల
ప్రజలకు
ఎంతో
ప్రయోజనం
ఉంటుంది.
ఎందుకంటే
శని
దేవుడు
మీ
సంచార
జాతకంలో
శష
మహాపురుష
రాజయోగాన్ని
సృష్టించాడు.
అందుకే
మీకు
గౌరవం
కలగబోతోంది.
అయితే
వైవాహిక
జీవితంలో
కొన్ని
సమస్యలు
ఉండవచ్చు.
మరోవైపు
మీరుకనుక
కమీషన్
ఏజంట్లు,
కన్సల్టెన్సీ
అయితే
మీరు
మంచి
లాభం
పొందుతారు.
అలాగే
మీ
వ్యాపారం
శని
గ్రహానికి
సంబంధించినదైతే
తప్పకుండా
ప్రయోజనం
పొందవచ్చు.
ఇప్పటివరకు
వివాహం
చేసుకోకుండా
ఉన్నవారికి
వివాహ
ప్రతిపాదనలు
వస్తాయి.

మకర
రాశి
శని
దేవుడు
శక్తివంతంగా
ఉండటంవల్ల
మకర
రాశివారికి
శుభప్రదంగా
ఉంటుంది.
ఎందుకంటే
ఈరాశివారి
ఇంట్లో
శని
దేవుడి
బలం
బాగా
ఉండటంవల్ల
ఆర్థికంగా
మంచి
సపోర్టు
వస్తుంది.
సహకరించడంతోపాటు
మానసిక
ఉద్రిక్తత
నుంచి
ఉపశమనం
పొందుతారు.
మీలో
ఆత్మవిశ్వాసం
పెరగడమేకాదు..
ఆ
సమయంలో
మీరు
మీ
కష్టానికి
తగిన
ఫలితాన్ని
కచ్చితంగా
పొందుతారు.
దీంతో
పాటు
పెట్టుబడి
నుంచి
లాభం
వస్తుంది.
చమురు,
పెట్రోలియం,
ఇనుము
ఇతర
ఉత్పత్తులకు
సంబంధించిన
వ్యాపారం
చేసేవారు
మంచి
లాభం
పొందుతారు.
ఈ
రాశివారికి
రాబోయే
3
నెలలు
అద్భుతంగా
ఉండబోతున్నాయి.
ఉద్యోగస్తులైతే
పదోన్నతితోపాటు
ఇంక్రిమెంట్
పొందుతారు.

తుల
రాశి
తులారాశివారికి
శని
దేవుడి
శక్తి
ప్రయోజనకరంగా
ఉంటుంది.
ఎందుకంటే
మీ
సంచార
జాతకంలో
శని
దేవుడు
కేంద్ర
త్రికోణ
రాజయోగాన్ని
సృష్టించడంవల్ల
కెరీర్,
ఆధ్యాత్మికత,
ఆలోచనాపరులు,
పరిశోధకులు,
వైద్యులు,
శాస్త్రవేత్తలకు
ఈ
సమయం
బాగుంటుంది.
స్టాక్
మార్కెట్,
లాటరీలో
డబ్బు
పెట్టుబడి
పెట్టాలనుకునే
వారికి
ఆ
సమయం
అనుకూలంగా
ఉంటుంది.
అలాగే,
ఈ
సమయంలో
ప్రేమ
వ్యవహారాల్లో
విజయం
పొందుతారు.
సంతానం
పొందాలనుకునే
వారు
సంతానం
పొందుతారు.

వృషభ
రాశి
శనిదేవుడు
శక్తివంతంగా
ఉండటం
వల్ల
వృషభ
రాశి
వారికి
ఆర్థికంగా
బాగుంటుంది.
శని
దేవుడు
వీరి
సంచార
జాతకంలో
శష
మరియు
కేంద్ర
త్రికోణ
రాజయోగాన్ని
సృష్టించాడు.
అందుకే
ఈ
సమయంలో
మీరు
తండ్రిగా
సంతోషాన్ని
పొందడంతోపాటు
జీవనోపాధికి
సంబంధించిన
వనరులు
పెరుగుతాయి.
ఈ
సమయంలో
మీరు
గౌరవం
మరియు
ప్రతిష్ట
పొందుతారు.
ఉద్యోగస్తులకు
పదోన్నతులుంటాయి.
మరోవైపు
ఈ
రాశివారు
వ్యాపారం
చేస్తే
లాభం
కలగడంతోపాటు
విదేశాలకు
వెళ్లే
అవకాశాలున్నాయి.
ఈ
సమయంలో
వీరు
ప్రభుత్వం
నుంచి
ప్రయోజనం
పొందే
అవకాశం
బాగావుంది.