Feature
oi-Garikapati Rajesh
జ్యోతిష్యంలో
సూర్యుడిని
గ్రహాల
రాజుగా
పరిగణిస్తారు.
ఆదిత్యుడు
ఇప్పుడు
మేషరాశిలో
సంచరిస్తున్నాడు.
మరో
5
రోజుల్లో
అంటే
మే
15న
వృషభరాశిలోకి
ప్రవేశించడాన్ని
వృషభ
సంక్రాంతి
అంటారు.
ఈ
రాశికి
శుక్రుడు
అధిపతి.
శుక్రుడి
రాశిలో
సూర్యుడి
సంచారం
వల్ల
మూడు
రాశులవారు
చాలా
జాగ్రత్తగా
ఉండాల్సి
ఉంది.
కొన్ని
సమస్యలను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
ఆ
రాశుల
వివరాలను
తెలుసుకుందాం.
మిథునరాశి
:
ఈ
రాశి
12వ
ఇంట్లో
ఆదిత్యుడి
గోచారం
సంభవించబోతోంది.
దీనివల్ల
అనారోగ్యానికి
గురవుతారు.
ఉద్యోగం
మారడానికి
కూడా
అనుకూలమైన
సమయం
కాదు.
డబ్బులు
వృథా
అవుతాయి.
ఖర్చులు
విపరీతంగా
పెరగడంతోపాటు
కాలం
అసలు
కలిసిరాదు.
అనుకున్న
పనులేవీ
సమయానికి
పూర్తికావు.
వైవాహిక
జీవితంలో
సమస్యలు
వస్తాయి.
జీవిత
భాగస్వామితో
అనుబంధం
దెబ్బతింటుంది.
మాట
విషయంలో
ఎంతో
జాగ్రత్తగా
ఉండాలి.

తుల
రాశి
:
ఈ
రాశి
8వ
ఇంట్లో
సూర్యుడు
సంచరించనున్నాడు.
దీనివల్ల
కుటుంబంలో
వివాదాలు
తలెత్తుతాయి.
దాంపత్య
జీవితంలో
విభేదాలు
చోటుచేసుకుంటాయి.
పెట్టుబడి
పెట్టడానికి
ఇది
ఏమాత్రం
అనుకూలమైన
సమయం
కాదు.
వీరు
కూడా
ఎదుటివారితో
మాట్లాడేటప్పుడు
మాటను
ఆచితూచి
ఉపయోగించాల్సి
ఉంటుంది.
ఆరోగ్యం
దెబ్బతినే
అవకాశం
ఉంది
కాబట్టి
దీనిపై
శ్రద్ధ
పెట్టాలి.
కెరీర్
లో
ముందుకు
సాగడానికి
అనేక
అడ్డంకులు
కలుగుతాయి.
మేష
రాశి
:
ఈ
రాశి
2వ
ఇంట్లో
ఆదిత్యుడు
సంచరించనున్నాడు.
కుటుంబంలో
భూమికి
సంబంధించిన
గొడవలు
తలెత్తుతాయి.
ప్రేమ
జీవితంతోపాటు
వైవాహిక
జీవితంలోను
సమస్యలను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
ఈ
సమయంలో
మీరు
ఎవరికైనా
అప్పు
ఇస్తే
అది
తిరిగిరాదు.
ఖర్చులు
విపరీతంగా
పెరుగుతాయి.
చేపట్టే
ప్రతి
పనిలోను
ఆటంకాలు
ఏర్పడతాయి.
ఎదుటివారితో
మాట్లాడే
సమయంలో
ఎంతో
జాగ్రత్తగా
ఆలోచించి
మాట్లాడాల్సి
ఉంటుంది.
వ్యాపారంతోపాటు
ఉద్యోగంలో
కూడా
ఇబ్బందులను
ఎదుర్కోవాల్సి
ఉంటుంది.
English summary
Mars is transiting in Cancer.Due to this, for the next 53 days, Mars will stay in this sign and cause troubles.
Story first published: Wednesday, May 10, 2023, 17:08 [IST]