PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

సిమెంట్ కంపెనీని సొంతం చేసుకున్న దాల్మియా.. వేల కోట్ల భారీ డీల్.. లాభపడిన రెండు స్టాక్స్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

దేశంలోని సిమెంట్ వ్యాపారంలో చాలా పెద్ద పోటీ నెలకొంది. దీంతో అదానీ ఈ రంగంలో చరిత్రలోనే ఎన్నడూ చూడని భారీ డీల్స్ చేశారు. సిమెంట్ తయారీలో రెండవ అతిపెద్ద సంస్థగా అదానీ గ్రూప్ ఎదగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తాజాగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన జేపీ గ్రూప్ కు చెందిన సిమెంట్ కంపెనీని దక్కించుకునేందుకు అదానీ, దాల్మియా గ్రూప్స్ పోటీపడ్డట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇందులో చివరగా దాల్మియా సిమెంట్(ఇండియా) లిమిటెడ్ కంపెనీ వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.5,666 కోట్లుగా ఉంది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

 సిమెంట్ కంపెనీని సొంతం చేసుకున్న దాల్మియా.. వేల కోట్ల భారీ

డీల్ ఖరారైన వార్త వెలువడటంతో జైప్రకాష్ అసోసియేట్స్ అండ్ జైప్రకాష్ పవర్ వెంచర్స్ రెండింటి షేర్లు 10% వరకు పెరిగాయి. జైప్రకాష్ అసోసియేట్స్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. తాజా డీల్ ద్వారా మొత్తం 9.4 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ ప్లాంట్లు, 6.7 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో క్లింకర్‌ ఆస్తులు, 280 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ డిజిన్వెస్ట్‌మెంట్‌లో ఉన్నాయని జేపీ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఏడాది ముందు నుంచే అదానీ గ్రూప్ సిమెంట్ రంగంపై చాలా దూకుడుగా ఉంది. ఇందులో భాగంగా సింగపూర్‌కు చెందిన హోల్సిమ్ గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్, ACC సిమెంట్ భారతీయ వ్యాపారాన్ని అదానీ గ్రూప్ 6.50 బిలియన్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే జేపీ గ్రూప్‌కు చెందిన సిమెంట్ వ్యాపారాన్నిగౌతమ్ అదానీ కొనుగోలు చేయవచ్చని గత కొద్ది రోజులుగా మీడియా కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది.

English summary

Dalmia india group bought JP Group Cement business knoe deal details

Dalmia india group bought JP Group Cement business knoe deal details

Story first published: Monday, December 12, 2022, 17:38 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *