PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో – ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

[ad_1]

Toyota Camry: టయోటా ఉత్తర అమెరికా మార్కెట్ కోసం కామ్రీ సెడాన్ 9వ తరం మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ కారుకు చాలా సంవత్సరాలుగా ఎంతో మార్కెట్‌ ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధికంగా అమ్ముడైన సెడాన్ ఇప్పుడు హైబ్రిడ్ ఇంజిన్‌తో ప్రత్యేకంగా లాంచ్ కానుంది.

డిజైన్ ఇలా…
కొత్త తరం కామ్రీలో కొత్త గ్రిల్ డిజైన్‌ను పొందింది. ఇది టయోటా లగ్జరీ కార్ బ్రాండ్ లెక్సస్ నుంచి ఇన్‌స్పైర్ అయి చేసిన డిజైన్. హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ముందు భాగంలో టయోటా లోగో ఇప్పుడు బంపర్ పైభాగంలో ఉంది. అలాగే 19 అంగుళాల కొత్త అల్లాయ్ వీల్స్ కూడా అందించారు.

2025 కామ్రీ 2.5 లీటర్, 4 సిలిండర్ ఇంజిన్, ఐదో తరం టయోటా హైబ్రిడ్ సిస్టమ్ (THS5) కలయికతో అందించిన మొదటి టయోటా సెడాన్. ఇంజిన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోడల్‌లో 225 హెచ్‌పీ ప్రామాణిక పవర్ అవుట్‌పుట్‌ అందించనుంది. హెచ్ఈవీలోని రెండు ఎలక్ట్రిక్ మోటార్‌ల ద్వారా శక్తిని పొందుతుంది. 232 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌తో వచ్చే ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ మోడల్ అన్ని ట్రిమ్ వెర్షన్లలోనూ అందుబాటులో ఉంటుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయి?
కొత్త టయోటా కామ్రీలో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఓటీఏ అప్‌డేట్‌లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 12.3 అంగుళాల పూర్తి డిజిటల్ గేజ్ క్లస్టర్, 10 అంగుళాల హెడ్ అప్ డిస్‌ప్లేతో కూడిన 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. ఇందులో తొమ్మిది స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, డిజిటల్ కీ, పవర్ రిట్రాక్టబుల్ సన్‌షేడ్‌ ఉన్న పనోరమిక్ సన్‌రూఫ్, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ మెమరీ సీట్లు, మెమరీ సైడ్ వ్యూ మిర్రర్స్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ విండ్‌షీల్డ్ వైపర్‌లు కూడా ఉన్నాయి.

సెక్యూరిటీ ఫీచర్లలో బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫ్రంట్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్, పనోరమిక్ వ్యూ మానిటర్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ అసిస్ట్‌తో ఆటోమేటిక్ బ్రేకింగ్, ప్రీ-కొలిజన్ సిస్టమ్, ఏడీఏఎస్‌లను అందించారు. ఈ ఫీచర్లలో పాదచారులను గుర్తించడం, ఫుల్-స్పీడ్ రేంజ్ డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ అసిస్ట్‌తో లేన్ డిపార్చర్ అలర్ట్, రోడ్ సైన్ అసిస్ట్, ప్రోయాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్ ఉన్నాయి.

ఎప్పుడు లాంచ్ చేస్తారు?
2025 టయోటా కామ్రీ వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ మధ్య) అమెరికాలో లాంచ్ కానుందని భావిస్తున్నారు. అప్‌డేట్ అయిన హైబ్రిడ్ సెడాన్ కూడా 2024 చివరి నాటికి భారతీయ మార్కెట్లోకి తీసుకురావచ్చు. అయితే టయోటా నుంచి ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? – 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *