PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

హల్దీరమ్స్‌లో వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తున్న టాటా గ్రూప్‌ ?

[ad_1]

<p>ప్రముఖ స్నాక్స్&zwnj; మేకర్&zwnj; సంస్థ హల్దీరమ్స్&zwnj; లో వాటా కొనుగోలు చేసేందుకు దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్&zwnj; ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్&zwnj;లో హల్దీరమ్స్&zwnj;కు మంచి పేరున్న సంగతి తెలిసిందే. దేశీయ స్నాక్స్&zwnj; అంటే మొదట గుర్తొచ్చేది ఇవే. ఎన్నో రకాల పదార్థాలతో మంచి బిజినెస్&zwnj; చేస్తోంది. అయితే హల్దీరమ్స్&zwnj;లో మెజార్టీ వాటాను టాటా కొనుగోలు చేయాలని టాటా సంస్థ భావిస్తుండగా హల్దీరమ్స్&zwnj; ఎక్కువ వాల్యుయేషన్&zwnj; చెప్తున్నట్లు సమాచారం. హల్దీరమ్స్&zwnj; 51 శాతం వాటాకు ఆ కంపెనీ 10 బిలియన్&zwnj; డాలర్ల వాల్యుయేషన్&zwnj; చెప్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. అది చాలా ఎక్కువ అని టాటా కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ డీల్&zwnj; వాస్తవమైతే, విజయవంతంగా డీల్&zwnj; జరిగితే పెప్సీ కంపెనీ, ముకేశ్&zwnj; అంబానీ రిలయన్స్&zwnj; రిటైల్&zwnj;కు గట్టి పోటీ కానుంది. హల్దీరమ్స్&zwnj; 10 శాతం వాటా విక్రయానికి బైన్&zwnj; క్యాపిటల్&zwnj; సహా మరికొన్ని ప్రైవేట్&zwnj; ఈక్విటీ సంస్థలతో మాట్లాడుతున్నట్లు సమాచారం.</p>
<p>యూకేలో టీ కంపెనీ టెట్లీ, భారత్&zwnj;లో స్టార్&zwnj;బక్స్&zwnj;లో వాటా కలిగిన టాటా కన్స్యూమర్&zwnj; ప్రొడక్ట్స్&zwnj; కంపెనీ హల్దీరమ్స్&zwnj;తో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు రాయిటర్స్&zwnj; అనే వార్తాసంస్థ వెల్లడించింది. టాటా కంపెనీ హల్దీరమ్స్&zwnj;లో 51శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయాలనుకుంటుంది, కానీ హల్దీరమ్స్&zwnj; చాలా ఎక్కువ వాల్యుయేషన్&zwnj; చెప్తోందని చర్చల గురించి అవగాహన ఉన్న ఓ వ్యక్తి వెల్లడించినట్లు తెలిపింది. టాటా (కన్స్యూమర్&zwnj;) కంపెనీని టీ కంపెనీగా పరిగణిస్తున్నారని, హల్దీరమ్స్&zwnj;తో కలిస్తే మార్కెట్&zwnj; పెంచుకోవడానికి చాలా బాగుటుందని, టాటాకు ఇది మంచి అవకాశమని, మార్కెట్&zwnj; షేర్&zwnj; కూడా ఎక్కువగా ఉంటుందని వెల్లడించినట్లు పేర్కొంది.&nbsp;</p>
<p>అయితే ఈ వార్తలపై హల్దీరమ్స్&zwnj; చీఫ్&zwnj; ఎగ్జిక్యూటివ్&zwnj; క్రిషన్&zwnj; కుమార్&zwnj;ను దీనిపై ప్రశ్నించగా ఆయన స్పందించడానికి నిరాకరించారు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్&zwnj; అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. అవి మార్కెట్&zwnj; ఊహాగానాలని, వాటిపై స్పందించనని కొట్టిపడేశారు.&nbsp;</p>
<p>హల్దీరమ్స్&zwnj; కంపెనీని 1937లో స్థాపించారు. మొదట ఒక చిన్న షాప్&zwnj;గా ఇది ప్రారభమైంది. కరకరలాడే భుజియా స్నాక్&zwnj;కు ఇది ఫేమస్&zwnj;గా ఉండేది. రూ.10కి దానిని విక్రయించేవారు. నెమ్మది నెమ్మదిగా హల్దీరమ్స్&zwnj; ఎదుగుతూ వచ్చింది. ఎన్నో రకాల స్నాక్స్&zwnj;తో భారత మార్కెట్&zwnj;లో మంచి స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు భారత్&zwnj; 6.2 బిలియన్&zwnj; డాలర్&zwnj; స్నాక్&zwnj; మార్కెట్&zwnj;లో దాదాపు 13 శాతం వాటా సంపాదించుకుంది. లేస్&zwnj; చిప్స్&zwnj;కు ఫేమస్&zwnj; అయిన పెప్సీ కంపెనీ కూడా దాదాపు 13శాతం వాటా కలిగి ఉంది. విదేశాలలో కూడా హల్దీరమ్స్&zwnj;కు మంచి పేరుంది. అక్కడ కూడా అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా సింగపూర్&zwnj;, అమెరికాలో హల్దీరమ్స్&zwnj; అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కంపెనీకి దాదాపు 150 రెస్టారెంట్స్&zwnj; ఉన్నాయి. వీటిలో స్థానిక వంటకాలు, స్వీట్స్&zwnj;, విదేశీ వంటకాలను కూడా విక్రయిస్తారు.</p>

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *