PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

హెల్త్‌ పాలసీ క్లెయిమ్స్‌లో కామన్‌గా కనిపిస్తున్న తప్పులివి

[ad_1]

Common mistakes in Health Insurance Claim: మన దేశంలో ఇప్పుడు చాలా మంది ఆహార ద్రవ్యోల్బణం ‍‌(Food inflation) గురించి మాట్లాడుతున్నారు. కానీ, విద్య ద్రవ్యోల్బణం ‍‌(Education Inflation), వైద్య ద్రవ్యోల్బణంతో (Medical inflation) పోలిస్తే ఆహార ద్రవ్యోల్బణం పెద్ద విషయంగా కనిపించదు. 

ఖరీదైన వైద్య చికిత్సల కారణంగా, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇప్పుడు ప్రతి వ్యక్తికి, కుటుంబానికి అవసరం. హెల్త్‌ పాలసీలు తీసుకునే సమయంలో చాలామంది కొన్ని తప్పులు (Common mistakes in health insurance) చేస్తున్నారు. ఇప్పటికి అది చిన్న తప్పుగా కనిపించినా, భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. కష్ట సమయాల్లో మీ పాలసీ మీకు పూర్తిస్థాయిలో అండగా నిలబడలేకపోవచ్చు, బీమా కంపెనీ తిరస్కారానికి గురి కావచ్చు. 

హెల్త్‌ పాలసీ క్లెయిమ్స్‌లో కామన్‌గా కనిపిస్తున్న తప్పులివి:

పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవండి
మీరు చేసిన క్లెయిమ్‌ను ఆరోగ్య బీమా కంపెనీ తిరస్కరించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటాయి. పాలసీ తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన నిబంధనలు & షరతులను (Terms & Conditions) మీరు పూర్తిగా, జాగ్రత్తగా చదవకపోవడమే మొదటి అతి పెద్ద కారణం. ముందు నుంచి ఉన్న అనారోగ్యాన్ని దాచడం కూడా మరొక ప్రధాన కారణం. మీరు మీ అనారోగ్యం గురించి ముందుగానే బీమా కంపెనీకి చెబితే, మీరు మెరుగైన పాలసీని పొందడమే కాకుండా, క్లెయిమ్ సమయంలో ఎలాంటి సమస్య ఉండదు. అనారోగ్యాన్ని దాచి పెట్టడం వల్ల బీమా కంపెనీ మీ పాలసీని తిరస్కరించవచ్చు, దీనిపై లీగల్‌గానూ ఫైట్‌ చేయలేరు.

కవర్‌ అయ్యే, కాని వ్యాధుల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి
మీరు ఒక పాలసీ కొన్న తక్షణం ఆ పాలసీ అమల్లోకి రాకపోవచ్చు. చాలా వ్యాధులు వెంటనే మెడిక్లెయిమ్ పరిధిలోకి రావు. వాటి కోసం ఒక సంవత్సరం నుంచి 4 సంవత్సరాల వరకు వేచి ఉండాలి. దీనినే వెయిటింగ్‌ పిరియడ్‌ (waiting period) అంటారు. వెయిటింగ్‌ పిరియడ్‌ సమయంలో, ఆయా అనారోగ్యాలకు చికిత్స కోసం మీరు క్లెయిమ్‌ చేసుకోలేరు. కిడ్నీ, పార్కిన్సన్స్, అల్జీమర్స్, HIV వంటి వాటిని మెడిక్లెయిమ్‌లో చేర్చలేదు. ఇలాంటి వాటి గురించి తెలుసుకుని పాలసీ తీసుకోండి.

బిల్లులను జాగ్రత్త చేయండి 
నగదు రహిత చికిత్స (Cashless treatment) సౌకర్యం మీ పాలసీలో ఉండేలా చూసుకుంటే బెటర్‌. పాలసీ తీసుకునే సమయంలో అన్ని డాక్యుమెంట్లు సమర్పించకుంటే, క్లెయిమ్ సమయంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. చికిత్స సమయంలో అన్ని బిల్లుల ఒరిజినల్ కాపీలను జాగ్రత్త చేయండి. వాటిని బీమా కంపెనీ ఎప్పుడైనా అడగొచ్చు. క్లెయిమ్ సమయంలో హాస్పిటల్ బిల్లులు, డిశ్చార్జ్ పేపర్లు, పేషెంట్ రికార్డ్‌లను సక్రమంగా జత చేస్తే మీ క్లెయిమ్‌ను ఎవరూ తిరస్కరించలేరు.

మోసం చేయాలని చూడొద్దు
క్లెయిమ్‌ విషయంలో మోసపూరితంగా ఆలోచించొద్దు. తప్పుడు క్లెయిమ్‌ చేస్తే, ఈ డిజిటల్ యుగంలో సులభంగా పట్టుబడతారు. ఆసుపత్రి సహకారంతో నకిలీ బిల్లులు పెట్టినా, దొరికిపోతే ఆ ఆసుపత్రిని కూడా బ్లాక్ లిస్ట్ పెడతారు లేదా ప్యానెల్ నుంచి తొలగిస్తారు. 

కస్టమర్ కేర్‌తో మాట్లాడండి
క్లెయిమ్‌ను తిరస్కరించినప్పుడు, మీ బీమా కంపెనీ రాతపూర్వకంగా కారణాలు తెలియజేస్తుంది. అరే, ఈ చిన్న పనిని నేను ముందే చేసుంటే బాగుండేది కదా అని అప్పుడు బాధపడ్డా ఉపయోగం ఉండదు. బీమా తీసుకునే సమయంలోనే అన్ని షరతులను జాగ్రత్తగా చదవండి. కొన్నిసార్లు, పాలసీని అంటగట్టడానికి ఏజెంట్లు కొన్ని విషయాలు దాచి పెడతారు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్‌తో మాట్లాడండి, వెంటనే నివృతి చేసుకోండి.

మరో ఆసక్తికర కథనం: యూపీఐ నుంచి డాలర్లలోనూ డబ్బులు పంపొచ్చు, అతి త్వరలో బ్లాక్‌బస్టర్‌ అప్‌డేట్‌

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *