కొలువుల కోసం వెళ్లి..

క్రిప్టో కరెన్సీ పేరుతో హైదరాబాద్ కూకట్ పల్లిలో జనానికి కుచ్చుటోపీ పెట్టిందో సంస్థ. 90 రోజుల్లోనే లక్షను 4 లక్షలు చేస్తామంటూ XCSPL అనే కంపెనీ కోట్లాది రూపాయలు సమీకరించింది. డెరైక్టుగా అడిగితే జనాలు పెట్టుబడి పెడతారో లేదోనని.. మొదట ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. వారి ద్వారా ప్రజలను మభ్యపెట్టింది. కొలువులు పోతాయనే భయంతో, పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయన్న ఆశతో వారు మరింత మందికి ఈ కంపెనీని పరిచయం చేశారు. కానీ చివరికీ అందరం నట్టేట మునిగామని ఆ ఉద్యోగులే వాపోతున్నారు.

అందుకే భారీగా పన్ను విధించిందట:

అందుకే భారీగా పన్ను విధించిందట:

సాంప్రదాయ సేవింగ్స్ పథకాలైన FD, పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో అంతగా వడ్డీ రావడం లేదని భావించినట్లు బాధితులు చెబుతున్నారు. మూడు నెలల్లోనే నాలుగు రెట్లు లాభాలు ఇస్తామనడంతో నమ్మి మోసపోయామన్నారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ లో భారీ లాభాలు వస్తున్నాయని, అందుకే కేంద్ర ప్రభుత్వం సైతం పెద్ద మొత్తంలో వాటిపై పన్ను విధించిందంటూ మాయచేశారని ఆరోపించారు. అప్పులు తెచ్చి, క్రెడిట్ కార్డులు వినియోగించి పెట్టిన పెట్టుబడి గంగపాలైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 తప్పించుకోవడానికి ఎత్తుగడ:

తప్పించుకోవడానికి ఎత్తుగడ:

రోజులు గడుస్తున్నా, లాభాల గురించి కంపెనీ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో అనుమానం మొదలైనట్లు బాధితులు తెలిపారు. రేపు, మాపు అని జరుపుతూ ఉండటంతో అనుమానం వచ్చి నిలదీసినట్లు వెల్లడించారు. మంజీరా మాల్‌ లోని ఆఫీసు ఎదుట ఆందోళన చేయగా.. కేసు నమోదైందని, అది తేలే వరకు ఏమీ మాట్లాడమంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు చెప్పారు. నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మీడియాను, పోలీసులను ఆశ్రయించామన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *