[ad_1]
Adani Group: అదానీ గ్రూప్‌పై దర్యాప్తు ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. భారతదేశ అకౌంటింగ్ రెగ్యులేటర్ అయిన ‘నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ’ (NFRA) కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసినట్లు సమాచారం. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో ప్రారంభమైన విచారణలు, దర్యాప్తులతో అదానీ గ్రూప్ తల ఇప్పటికే బొప్పి కట్టింది. ఇప్పటికీ ఆ గ్రూప్ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పుడు NFRA కూడా రంగంలోకి దిగడంతో విషయం మళ్లీ సీరియస్‌గా మారింది.
అదానీ గ్రూప్ కంపెనీలకు ఏళ్ల తరబడి ఆడిటర్‌గా ఉన్న EY (Ernst & Young) India సభ్య సంస్థల్లో ఒకటైన ఎస్.ఆర్.బాట్లిబోయ్‌పై (S.R.Batliboi) NFRA ఫోకస్ పెట్టిందని, అదానీ వ్యాపారాల లెక్కలను ఆడిటింగ్ చేసిన తీరుపై దర్యాప్తు ప్రారంభించిందని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసింది. కొన్ని వారాల క్రితమే ఇది స్టార్టయిందని తెలుస్తోంది. గౌతమ్ అదానీ నియంత్రణలో ఉన్న కొన్ని కంపెనీలకు సంబంధించి 2014 నుంచి ఉన్న ఫైళ్లు, వివిధ వర్గాలతో జరిపిన సంప్రదింపుల వివరాలను NFRA సేకరింస్తోందని మార్కెట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
NFRA విచారణ ఎంత కాలం సాగుతుంది, ఆడిటర్/అదానీ కంపెనీలు ఎలాంటి ఎఫెక్ట్స్ ఎదుర్కొంటాయి అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
కీలక కంపెనీలకు ఆడిటర్
అదానీ గ్రూప్ మొత్తం ఆదాయంలో సగభాగాన్ని తీసుకొచ్చే ఐదు లిస్టెడ్ అదానీ కంపెనీలకు ఎస్.ఆర్.బాట్లిబోయ్ ప్రస్తుతం చట్టబద్ధమైన ఆడిటర్‌గా పని చేస్తోంది. అదానీ పవర్ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ విల్మార్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్, ACC సిమెంట్స్ పద్దు పుస్తకాలను ఈ సంస్థ చూసుకుంటోంది. గత సంవత్సరం, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ పుస్తకాలపైనా సంతకం చేసింది.
ఎస్.ఆర్.బాట్లిబోయ్ మీద ‘నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ’ ఫోకస్ పెట్టడంతో అదానీ గ్రూప్ దర్యాప్తు విషయంలో ఏదో జరుగుతోందన్న ఉత్కంఠ మళ్లీ మార్కెట్‌లో కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దాడిని ఎదుర్కొన్న ఈ గ్రూప్, అకౌంటింగ్ & డిస్‌క్లోజర్స్‌పై తలెత్తిన ప్రశ్నలకు మరోమారు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ ఏడాది జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బ్లాస్టింగ్ రిపోర్ట్ తర్వాత, అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా 150 బిలియన్ డాలర్లు తగ్గింది. జనవరి 29న, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌ను గ్రూప్ ఖంచించింది. గుర్తింపు, అర్హత ఉన్న నిపుణులతోనే కంపెనీ పుస్తకాలను ఆడిట్ చేయిస్తామని, తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని ప్రకటించింది. కానీ నెలల తర్వాత గ్రూప్ వైఖరిలో మార్పులు వచ్చాయి. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, మే 2న, తన కొత్త చట్టబద్ధమైన ఆడిటర్‌గా వాకర్ చండియోక్ & కో LLPని నియమించింది. అదానీ కంపెనీల దీర్ఘకాల ఆడిటర్ అయిన షా ధంధారియా & కో స్థానంలో ఇది వచ్చింది. మరో నెల తర్వాత, డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ LLP ఆగస్టులో రాజీనామా చేసింది, అదానీ పోర్ట్స్ లావాదేవీల గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుతానికి NFRA దర్యాప్తు రహస్యంగా సాగుతున్నట్లు తెలుస్తోంది, ఇప్పటికీ అధికారికంగా బయటకు ఏ విషయం రావడం లేదు.
మరో ఆసక్తికర కథనం: స్థిరంగా గోల్డ్ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply