అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

[ad_1]

Hindenburg Research:

షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఈసారి అమెరికా కంపెనీనే టార్గెట్‌ చేసింది. ట్విటర్‌ కో ఫౌండర్‌ జాక్‌ డోర్సీ స్థాపించిన యూఎస్‌ మొబైల్‌ పేమెంట్స్‌ కంపెనీ బ్లాక్‌పై (Block payments App) విమర్శలతో కూడిన రిపోర్టును విడుదల చేసింది.

ప్రస్తుతం బ్లాక్‌ మార్కెట్‌ విలువ 44 బిలియన్‌ డాలర్లు. అంతకు ముందు స్క్వేర్‌ పేరుతో వ్యాపారం నిర్వహించేది. బ్యాంకింగ్‌ సేవలకు దూరమైన, బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోలేని వారికి తేలికైన, మ్యాజికల్‌ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ ద్వారా సాధికరత కల్పించడమే ధ్యేయంగా ప్రకటించింది.

వివిధ వయసుల్లోని యూజర్ల ద్వారా బ్లాక్‌ క్రమపద్ధతిలో ప్రయోజనం పొందిందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. కంపెనీ ప్రకటించిన మ్యాజికల్‌ టెక్నాలజీలో గొప్పేమీ లేదని, కస్టమర్లు, ప్రభుత్వాన్ని మోసగించడమే దీని లక్ష్యమని వివరించింది. నిబంధనలు పాటించదని పేర్కొంది. అధిక ఫీజులు, రుణాలు, తప్పుడు గణాంకాలతో ఇన్వెస్టర్లను మోసగించిందని తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత బ్లాక్‌ క్యాష్‌ యాప్‌ ఎదుగులను చూసి విశ్లేషకులు ఉత్సాహం చూపించారని వెల్లడించింది.  వాస్తవ యూజర్ల సంఖ్యను ఎక్కువ చెప్తోందని, కస్టమర్లను చేర్చుకొనేందుకు పెడుతున్న ఖర్చు తక్కువగా చూపిస్తోందని ఆరోపించింది.

‘తాము సమీక్షించిన ఖాతాల్లో 40-75 శాతం నకిలీవేనని మాజీ ఉద్యోగులు అంచనా వేశారు. ఇందులో మోసం ఉందన్నారు. లేదా ఒకే వ్యక్తికి ఎక్కువ అకౌంట్లు ఉండొచ్చన్నారు’ అని హిండెన్‌బర్గ్‌ తెలిపింది. కరోనా టైమ్‌లో పెరిగిన యూజర్ల సంఖ్య, ఆదాయంలో నకిలీ ఖాతాలు, చెల్లింపుల వాటాను చెప్పలేదంది. బ్లాక్‌స్టాక్‌ 18 నెలల్లో ఒక్కసారిగా 639 శాతం పెరిగిందని వెల్లడించింది. ఊహించని విధంగా ధరలు పెరగడంతో జాక్‌ డోర్సీ, సహ వ్యవస్థపకుడు మెక్‌కెల్వే కలిసి వందకోట్ల డాలర్ల విలువైన షేర్లను అమ్మేశారని ప్రకటించింది. సీఎఫ్‌వో అమృతా అహుజా, లీడ్‌ మేనేజర్‌ బ్రియాన్‌ గ్రాసడోనియా మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారని తెలిపింది.

బ్లాక్‌ కంపెనీ షేర్లను తాము షార్ట్‌ సెల్లింగ్‌ చేశామని హిండెన్‌ బర్గ్‌ ప్రకటించింది. దాంతో గురువారం మార్కెట్లు తెరవగానే షేర్లు 19 శాతం పతనమయ్యాయి. ఈ ఆరోపణలపై బ్లాక్‌ ఇంకా స్పందించలేదు. కాగా హిండెన్‌ బర్గ్‌ ఎలాంటి నివేదికలు విడుదల చేయరాదని గతంలోనే ఫెడరల్‌ కోర్టు ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా తమ లాభం కోసం నివేదికలు ఇస్తున్నారని తెలిపింది. కంపెనీపై కొన్ని కేసులూ నమోదయ్యాయి.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *