[ad_1]
Top Headlines Today:
అవినాష్ ముందస్తు బెయిల్‌పై నేడు తీర్పు
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది.వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాాయి. బుధవారం వరకు ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర తీర్పు వెల్లడించింది. తుది తీర్పు బుధవారం చెప్పబోతున్నట్టు తెలిపింది.
ఈడీ ముందు కాంగ్రెస్ లీడర్
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన యంగ్ ఇండియా లిమిటెడ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్‌ను ఈడీ విచారించనుంది. గత నవంబర్ ఆయన్ని ఈడీ మూడు గంటల పాటు విచారించింది. రేవంత్ రెడ్డి సూచనతో ఆ సంస్థకు విరాళం ఇచ్చానని అంజన్ కుమార్ చెప్పారు. దీంతతో విచారణ చేస్తోంది ఈడీ.
ఏపీలో మాన్యువల్‌గానే ల్యాండ్ రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో రోజూ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరో రెండ్రోజుల్లో భూముల విలువ పెరుగుతూ వుండటంతో .. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. చలానాల ధర పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని భావించి సామాన్యులు తమ భూముల క్రయ విక్రయాలు త్వరగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సర్వర్లు మొరాయించడంతో సోమవారం ఉదయం నుంచి భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. 2010కి ముందు రాష్ట్రంలో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేవి.
నేడు కరీంనగర్‌లో శ్రీవారి ఆలయానికి శంకుస్థాపన
కరీంనగర్‌లోని పద్మానగర్‌లో నిర్మించబోయే శ్రీవారి ఆలయానికి నేడు భూమి పూజ జరగనుంది. టీటీడీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. టీటీడీ ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో పూజా, కల్యాణోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కమాలకర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఇతర బీఆర్‌ఎస్ లీడర్లు, వేంకటేశ్వర స్వామి భక్తులు పాల్గోంటారు.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ పోర్ట్స్: 2023 మార్చి త్రైమాసికంలో, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 5% పెరిగి రూ. 1,159 కోట్లకు చేరుకుంది. ఆదాయం ఏడాదికి 40% పెరిగి రూ. 5,797 కోట్లకు చేరుకుంది.
మ్యాన్‌కైండ్ ఫార్మా: జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ ఫార్మా కంపెనీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 50% వృద్ధితో రూ. 285 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 19% పెరిగి రూ. 2,053 కోట్లకు చేరుకుంది.
పతంజలి ఫుడ్స్: మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో, పతంజలి ఫుడ్స్ తన స్వతంత్ర నికర లాభంలో 13% వృద్ధిని నమోదు చేసి రూ. 264 కోట్లను ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం 18% పెరిగి రూ. 7,873 కోట్లుగా నమోదైంది.
అపోలో హాస్పిటల్స్: ప్రముఖ హాస్పిటల్ చైన్, నాలుగో త్రైమాసికంలో రూ. 146 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 97 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి 50% పెరిగింది. ఆదాయం కూడా 21% పెరిగి రూ. 4,302 కోట్లకు చేరుకుంది.
HDFC లైఫ్: UKకి చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ Abrdn, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో తన మొత్తం వాటాను బ్లాక్ డీల్ ద్వారా అమ్మేసే అవకాశం ఉంది, బహుశా ఇది రేపు జరుగుతుంది.
సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్: కంపెనీ ప్రమోటర్ ఆరియస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవాళ, బ్లాక్ డీల్ ద్వారా సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్‌లో 3.25% వాటాను విక్రయించాలని యోచిస్తోంది.
SBI: ఎస్‌బీఐ షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్ ట్రేడ్ చేస్తాయి కాబట్టి మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
మాక్రోటెక్ డెవలపర్స్: ఈ కంపెనీ షేర్లు ఎక్స్-బోనస్ ట్రేడ్ చేస్తాయి కాబట్టి మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 468 కోట్ల నికర లాభాన్ని ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,632 కోట్లుగా ఉంది.
లెమన్ ట్రీ హోటల్స్: జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 44 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆ త్రైమాసికంలో ఆదాయం రూ. 253 కోట్లకు చేరింది.
కోల్ ఇండియా: నేటి నుంచి, నాన్-కోకింగ్ కోల్ ధరలను 8% పెంచింది. ధరల పెంపుతో ఈ కంపెనీ అదనంగా రూ. 2,700 కోట్ల ఆదాయం పొందుతుంది.
ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్: జనవరి-మార్చి కాలానికి రూ. 376 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో రూ. 108 కోట్ల ఆదాయం వచ్చింది.
వెల్‌స్పన్ కార్పొరేషన్: నాలుగో త్రైమాసికంలో రూ. 236 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4,070 కోట్లుగా ఉంది.
టోరెంట్ ఫార్మా: మార్చి త్రైమాసికంలో టొరెంట్ ఫార్మా రూ. 287 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం 17% పెరిగి రూ. 2,491 కోట్లకు చేరుకుంది.
[ad_2]
Source link
Leave a Reply