ఇండస్‌ఇండ్‌ కొత్త ప్రయోగం! నేరుగా రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలతోనే హోమ్‌లోన్‌ భాగస్వామ్యం!!

[ad_1]

IndusInd Bank:

గృహరుణాల్లో వృద్ధి కోసం ప్రైవేటు సెక్టార్‌ బ్యాంక్‌ ఇండస్‌ఇండ్‌ (IndusInd Bank) సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇంటి రుణాల పోర్టుఫోలియోను పెంచుకొనేందుకు నేరుగా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లతోనే భాగస్వామ్యాలు కుదుర్చుకుంటోంది. జూన్‌ త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన తర్వాత బ్యాంకు ఎండీ, సీఈవో సుమంత్‌ కట్‌పలియా ఈ వివరాలను మీడియాకు తెలిపారు. ‘మేం నిర్మాణదారులు, స్థిరాస్తి కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే వారితో చర్చలు కొనసాగిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఇండస్‌ఇండ్‌ బ్యాంకు గృహ రుణాల పోర్టుఫోలియో (Home Loan) స్వల్పంగా ఉంది. దీనిని మరింత విస్తరించాలని బ్యాంకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. రూ.675 కోట్లుగా ఉన్న హోమ్‌లోన్‌ బుక్‌ను రాబోయే మూడేళ్లలో రూ.15,000 కోట్లకు పెంచుకోవాలని భావిస్తోంది.

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) తాజా నివేదిక ప్రకారం 2023, మే చివరి నాటికి గృహ నిర్మాణ రంగానికి ఇచ్చిన  రుణాల విలువ రూ.19.56 లక్షల కోట్లుగా ఉంది. 2022, మే నాటి రూ.17.07 లక్షల కోట్లతో పోలిస్తే 14.6 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ఈ విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ లీడర్‌గా ఉంది. వారి హోమ్‌లోన్ బుక్‌ విలువ ఏకంగా రూ.7.3 లక్షల కోట్లుగా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకోవడంతో అతిపెద్ద రుణదాతగా ఆవిర్భవించింది.

హెచ్‌డీఎఫ్‌సీ తర్వాత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిలిచింది. వారి గృహరుణాల విలువ రూ.6.4 లక్షల కోట్లుగా ఉంది. రూ.3.46 లక్షల కోట్లతో ఐసీఐసీఐ బ్యాంకు, రూ.1.57 లక్షల కోట్లతో యాక్సిస్‌ బ్యాంకు, రూ.81,863 కోట్లతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  2022, ఆగస్టులో ఎస్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత దేశ గృహరుణాల మార్కెట్‌ విలువ 2027 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. ‘కొవిడ్‌ తర్వాత ఇంటి నుంచి పని చేసే విధానం బాగా పెరిగింది. భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగనుంది. గృహ రుణాల డిమాండ్‌కు కీలకంగా ఇది మారింది’ అని బ్యాంకు వివరించింది.

ఇండస్‌ ఇండ్‌ గృహరుణాల వృద్ధి బాల్య దశలోనే ఉందని, మార్కెట్‌ పరిస్థితులను కూలంకషంగా పరిశీలిస్తున్నామని బ్యాంకు ఎండీ, సీఈవో సుమంత్‌ కట్‌పలియా అన్నారు. ‘మేమిప్పుడు పైలట్‌ స్టేజ్‌లో ఉన్నాం. మా గృహ రుణాల విలువ రూ.650-675 కోట్లుగా ఉంది. రాబోయే 3-6 ఆరు నెలల్లో వడ్డీరేట్లు, మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉంటాయో క్షుణ్ణంగా పరిశీలిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు నికర లాభం రూ.2,124 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలోని రూ.1631 కోట్లతో పోలిస్తే 33 శాతం వృద్ధి సాధించింది. నికర వడ్డీ ఆదాయం (NII) రూ.5,863 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలోని రూ.4,125 కోట్లతో పోలిస్తే 18 శాతం వృద్ధి నమోదు చేసింది. స్థూల నిరర్థక ఆస్తులు 1.94 శాతం ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే 2.35 శాతం తగ్గాయి. ఇక నికర నిరర్థక ఆస్తులు 0.67 నుంచి 0.58 శాతానికి తగ్గాయి. బ్యాంకు ఫలితాలు మెరుగ్గా ఉండటంతో మోతీలాల్‌ ఓస్వాల్‌.. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు షేరుకు బయ్‌ రేటింగ్‌ ఇచ్చింది. టార్గెట్‌ను రూ.1600కు పెంచింది. 

Also Read: టాక్స్ పేయర్స్ చైతన్యం! 7 రోజులు ముందుగానే 3 కోట్ల ఐటీఆర్‌లు ఫైలింగ్‌!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *