[ad_1]
India Manufacturing PMI:
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత తయారీ రంగం పురోగతి మెరుగ్గానే ఉంది. వరుసగా రెండో నెలా మెరుగైన వృద్ధిరేటు కనబరిచింది. ఉత్పత్తి పెరుగుదల, కొత్త ఆర్డర్లు రావడం, ఆరోగ్యకరమైన విస్తరణ ఇందుకు కారణాలని ఓ ప్రైవేటు సర్వే మంగళవారం వెల్లడించింది.
ఎస్అండ్పీ గ్లోబల్ రూపొందించిన మానుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ (PMI) జులై నెలలో 57.7 శాతంగా నమోదైంది. జూన్లో ఇది 57.8 శాతంగా ఉంది. అయితే రాయిటర్స్ అంచనా వేసిన 57తో పోలిస్తే కొంత ఎక్కువే కావడం గమనార్హం. పీఎంఐ వృద్ధిరేటు వరుసగా రెండేళ్ల నుంచి 50 శాతం మీదే ఉండటం ప్రత్యేకం.
‘అంతర్జాతీయ దేశాలతో పోలిస్తే భారత తయారీ రంగం తన స్థానం మరింత పదిలం చేసుకుంటోంది. ఇతర దేశాల్లో మాదిరిగా డిమాండ్ వీక్నెస్ ట్రెండ్ కనిపించడం లేదు’ అని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనామిక్స్ డైరెక్టర్ ఆండ్రూ హార్కర్ అన్నారు. భారత తయారీ రంగం వృద్ధిరేటు తగ్గుతున్న సూచనలు అత్యంత స్వల్పంగా కనిపిస్తున్నాయి. జులైలో ఉత్పత్తి పెరుగుదల, వాహనాల ఉత్పత్తి, కొత్త ఆర్డర్లు ఉండటమే ఇందుకు కారణాలు’ అని ఆయన పేర్కొన్నారు.
జులై నెలలో విపరీతంగా ఆర్డర్లు లభించాయి. ఉత్పత్తి వృద్ధిరేటు ఇప్పటికీ బలంగానే ఉన్నా మూడు నెలల కనిష్ఠానికి తగ్గింది. గతేడాది అక్టోబర్ నుంచి ముడి వనరుల ధరలు విపరీతంగా పెరగడంతో ఔట్పుట్ ధరలూ ఎగిశాయి. గత నెలతో పోలిస్తే వేగం కాస్త తగ్గింది. ద్రవ్యోల్బణం పరిస్థితులపై అనిశ్చితి నెలకొనడమే ఇందుకు కారణం. జూన్లో ఇన్ఫ్లేషన్ 4.81 శాతానికి పెరిగింది. రాబోయే నెలల్లో ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు పెంచక తప్పదు.
కందిపప్పు సహా ఇతర పప్పు దినుసుల రేట్లు భారీగా పెరగడమే జూన్ నెలలో ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది మే నెలలో 6.56 శాతంగా ఉన్న పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం, జూన్లో భారీగా పెరిగి 10.53 శాతానికి ఎగబాకింది. ఆకుకూరలు & కూరగాయల రేట్లు కూడా ద్రవ్యోల్బణం మంటకు ఆజ్యం పోశాయి. ఆకుకూరలు & కూరగాయల ద్రవ్యోల్బణం ఈ ఏడాది మే నెలలో -8.18 శాతంగా ఉంటే, జూన్లో -0.93 శాతానికి చేరింది.
మసాల దినుసుల ద్రవ్యోల్బణం మే నెలలోని 17.90 శాతం నుంచి జూన్లో 19.19 శాతానికి పెరిగింది. మే నెలలో 8.91 శాతంగా ఉన్న పాలు & అనుబంధ ఉత్పత్తుల ధరలు ఇప్పటికీ 8.56 శాతంగా ఉన్నాయి. ఆహార ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మే నెలలో 12.65 శాతంగా ఉంటే, జూన్లో 12.71 శాతం నమోదైంది. అయితే, ఆయిల్ & ఫ్యాట్స్ ఇన్ఫ్లేషన్ మేలో -16.01 శాతం నుంచి జూన్లో -18.12 శాతానికి తగ్గింది. చక్కెర ఇన్ఫ్లేషన్ రేటు 3 శాతంగా ఉంది, ఇది గత నెలలో 2.51 శాతంగా ఉంది.
[ad_2]
Source link
Leave a Reply