[ad_1]
పొగాకు తగ్గించడం..
ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి పొగ త్రాగడం ప్రధాన కారణం. ఇది మొత్తం కేసుల్లో 90 శాతానికి కారణమవుతుంది. సిగరెట్స్‌తో పాటు సిగార్లు, పైపులు, హుక్కా, ఎలక్ట్రానిక్ సిగరెట్స్, ఇతర పొగాకు వస్తువులు ఏవైనా అంతే ప్రమాదకరం.
Also Read : Tips for small Waist : నడుము సైజ్ త్వరగా తగ్గాలంటే ఇలా చేయండి..
ఎక్కువగా వీరికే..
పొగత్రాగని వారితో పోలిస్తే, పొగత్రాగేవారికి 20 శాతం ఎక్కువ లంగ్ క్యాన్సర్ వస్తుంది. పొగత్రాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రోజుకి సిగరెట్స్ తాగే సంఖ్య, ఎన్ని సంవత్సరాల పాటు తాగడం అనే విధంగా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read : Beauty Products Facts : సన్‌స్క్రీన్ లోషన్, ఫౌండేషన్ కలిపి అప్లై చేస్తున్నారా..
పొగకు దూరంగా..
లంగ్ క్యాన్సర్ తగ్గించడానికి, లంగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం పొగత్రాడం వెంటనే మానేయడం, పొగత్రాగకుండా ఉండడం మంచిది. ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. అధ్యయనాల ప్రకారం, పొగత్రాగడం మానేసిన వారికి లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80 నుంచి 90 శాతం తక్కువగా ఉంటుంది. మీరు పూర్తిగా వదిలేయకపోయినా, సిగరెట్ల సంఖ్యను తగ్గించుకోవడం వల్ల కూడా సమస్య నుంచి కొద్దిగా తప్పించుకున్నవారవుతాం.
సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్‌పోజర్..
సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే.. మన చుట్టూ ఉన్నవారు పొగత్రాగడం.. ఆ ప్రొగను మనం పీల్చడాన్ని కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఇలాంటి పొగను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల కణాలు దెబ్బతింటాయి. దీని వల్ల మీరు నివసించే, చుట్టుపక్కల వారు పొగత్రాగితే ఆపేయమని చెప్పండి. బార్, ఇంటి లోపల పొగత్రాగేవారికి మీరు దూరంగా ఉండండి.
రేడియేషన్, రసాయనాలకు దూరంగా..
రేడియేషన్‌కి గురికావడాన్ని తగ్గించండి. ఉదాహారణకి రాడాన్ కెమికల్ విడుదల ఉన్న ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు అంటే, ఎక్కువగా యురేనియం వంటివి లంగ్ క్యాన్సర్‌కి కారణమవుతాయి. మీరు అలాంటి ప్రాంతాల్లో అంటే ఆర్సెనిక్, బొగ్గు, నికెల్, సిలికా వంటి కెమికల్స్ ప్రాంతాలకి దూరంగా ఉండడం మంచిది.
Also Read : Glaucoma : గ్లాకోమా ఉన్నవారు ఈ ఆసనాలు చేస్తే మొదటికే మోసం..
మంచి ఫుడ్..
వివిధ రకాల పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ వంటి ఫుడ్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోండి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స తీసుకుంటే మెడిసిన్ వేసుకునే అవకాశం రాదు. ఇవి కూడా ఆరోగ్య సమస్యల్ని పెంచుతాయని గుర్తుపెట్టుకోండి.
బీటా కెరోటిన్ సప్లిమెంట్స్ తీసుకున్నవారిలో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని తేలింది. కాబట్టి.. ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకోకుండా ఆరోగ్యకరమైన ఫుడ్స్‌తో క్యాన్సర్ ప్రమాదాన్ని దూరం చేసుకోండి.
రెగ్యులర్‌గా వర్కౌట్..
రెగ్యులర్ వర్కౌట్ చేయడం వల్ల లంగ్, ఇతర క్యాన్సర్స్ దూరమవుతాయి. దీనివల్ల, గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ వంటి అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల సమస్య కూడా దూరమవుతుంది.
టెస్ట్..
లంగ్ క్యాన్సర్ పూర్తిగా తగ్గేందుకు ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేదు కానీ, ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్య నుంచి దూరమవ్వొచ్చు. స్క్రీనింగ్ ద్వారా సమస్యని ముందుగానే కనుక్కుని త్వరగా ట్రీట్‌మెంట్ చేయించుకుని ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
ఈ సమస్య గురించి తెలుసుకునేందుకు సిటి స్కాన్ చేయించుకోవచ్చు. అది ఎప్పుడు చేయించుకోవాలంటే..
మీ వయస్సు 50 నుండి 80 సంవత్సరాలు ఉన్నా
మీరు 20 సంవత్సరాలుగా రోజుకి ఓ ప్యాకెట్ సిగరెట్స్ తాగినా
మీరు ఇప్పటికీ పొగత్రాగినా,, గత 15 ఏళ్ళక్రితం పొగత్రాగడానికి దూరంగా ఉన్నా కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి.
మొత్తానికీ..
లంగ్ క్యాన్సర్ గురించి తెలుసుకుని ముందునుంచి జాగ్రత్తగా ఉండడం, డాక్టర్స్‌ని సంప్రదించి సలహాలు తీసుకోవడం, మంచి లైఫ్‌స్టైల్ పాటించడం వల్ల ఈ సమస్య నుంచి దూరంగా ఉండొచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply