ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – అదానీ స్టాక్స్‌తో జాగ్రత్త

[ad_1]

Stocks to watch today, 10 February 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 94 పాయింట్లు లేదా 0.53 శాతం రెడ్‌ కలర్‌లో 17,836 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

జొమాటో: 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో, ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో నికర నష్టం రూ. 347 కోట్లకు పెరిగింది. ఏడాది క్రితం నష్టం రూ. 63 కోట్లుగా నమోదైంది. ఏకీకృత కార్యకలాపాల ఆదాయం ఏడాదికి 75% పెరిగి రూ. 1,948 కోట్లకు చేరుకుంది.

LIC: 2022 డిసెంబర్ త్రైమాసికంలో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రూ. 8,334 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది, లాభ వృద్ధిని అనేక రెట్లు పెంచుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కేవలం రూ. 211 కోట్లు ఆర్జించింది.

అదానీ టోటల్ గ్యాస్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో అదానీ టోటల్ గ్యాస్ ఏకీకృత నికర లాభంలో 17% వృద్ధితో రూ. 150 కోట్లకు చేరుకుంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 27% పెరిగి రూ. 1,185 కోట్లకు చేరుకుంది.

HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ డిసెంబర్ త్రైమాసికానికి రూ. 1,155 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 933 కోట్లుగా ఉంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ. 5,666 కోట్ల ఆదాయం వచ్చింది.

అదానీ గ్రూప్ స్టాక్స్: ఇండెక్స్ ప్రొవైడర్ MSCI, కొన్ని అదానీ సెక్యూరిటీలను ఇకపై ఫ్రీ ఫ్లోట్‌గా పేర్కొనకూడదని నిర్ణయించింది. MSCI గ్లోబల్ ఇన్వెస్టెబుల్ మార్కెట్ ఇండెక్స్‌ల్లో అదానీ సెక్యూరిటీలకు సంబంధించిన మార్పులు గురువారం రాత్రి జరిగాయి.

HPCL: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మూడో త్రైమాసికంలో రూ. 172 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలోని రూ. 869 కోట్ల లాభంతో పోలిస్తే ఇప్పుడు ఆర్జించింది చాలా తక్కువ. ఏప్రిల్-డిసెంబర్ కాలానికి, సగటు స్థూల రిఫైనింగ్ మార్జిన్‌ బిబిఎల్‌కి $11.40 గా లెక్క తేలింది.

ఓల్టాస్: డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ ఏకీకృత ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12% పెరిగి రూ. 2,036 కోట్లుగా నమోదైంది. మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 110 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

సూల వైన్‌యార్డ్స్‌: డిసెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 15% పెరిగి రూ. 39 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 14% పెరిగి రూ. 209 కోట్లకు చేరుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *