[ad_1]
Stocks to watch today, 22 February 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 68 పాయింట్లు లేదా 0.38 శాతం రెడ్ కలర్లో 17,878 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
BEL: అత్యుధునిక మధ్య స్థాయి యుద్ధ విమానాల (AMCA) తయారీ కోసం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), DRDOతో కలిసి MOU మీద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంతకం చేసింది. ఏరో ఇండియా 2023లో జరిగిన “బంధన్” కార్యక్రమం సందర్భంగా ఈ అవగాహన ఒప్పందాన్ని ప్రకటించారు.
హిందుస్థాన్ జింక్: కంపెనీ, వాటాదార్ల మధ్య ఒక అమలయ్యే ప్రతిపాదిత పథకం విషయంలో NCLT ఆదేశానికి అనుగుణంగా వచ్చే నెల 29వ తేదీన ఈక్విటీ వాటాదార్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్లు హిందుస్థాన్ జింక్ తెలిపింది.
లుపిన్: అమెరికన్ మార్కెట్లో లురాసిడోన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్లను విడుదల చేస్తున్నట్లు లుపిన్ ప్రకటించింది. వివిధ మోతాదుల్లో విడుదల చేసే ఈ టాబ్లెట్ల ద్వారా USలో 4.2 బిలియన్ డాలర్ల వార్షిక విక్రయాలను ఈ కంపెనీ అంచనా వేసింది.
సైయెంట్: తయారీ సంస్థల సామర్థ్యం పెంచేందుకు, వ్యయాలు తగ్గించేందుకు థింగ్ట్రాక్స్తో (Thingtrax) సైయెంట్ ఒక ఒప్పందం చేసుకుంది. గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు AI-ఆధారిత డేటా ద్వారా తయారీ కార్యక్రమాల్లో అధిక పనితీరు కనబరచడానికి ఈ భాగస్వామ్యం వీలు కల్పిస్తుంది.
కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్: ముంబైలోని ఇండియన్ ఆయిల్ నగర్లో నివాస భవనాల నిర్మాణం కోసం ఇండియన్ ఆయిల్ నుంచి రూ. 181 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు కెపాసైట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ (Capacit’e Infraprojects) తెలిపింది.
PTC ఇండస్ట్రీస్: ఈ కంపెనీ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన ఏరోలాయ్ టెక్నాలజీస్, గ్లోబల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో ప్రముఖ సంస్థ అయిన డసాల్ట్ ఏవియేషన్‌తో అవగాహన ఒప్పందంపై (MOU) సంతకం చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: సంవత్సరానికి 8.20% కూపన్ రేట్‌తో నాన్ కన్వర్టబుల్, టాక్సబుల్, పెర్పెచ్యువల్, అన్ సెక్యూర్డ్, ఫుల్లీ పెయిడ్ బాసెల్ III కంప్లైంట్ AT-1 బాండ్ల విడుదల ద్వారా ఈ బ్యాంక్ రూ. 4,544 కోట్లను సమీకరించింది.
IRCTC: మూడో త్రైమాసిక ఫలితాల సమయంలో ఈ కంపెనీ ఒక్కో షేరుకు ప్రకటించిన రూ. 3.5 డివిడెండ్‌కు సంబంధించి, IRCTC షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్ అవుతాయి. ఒక్కో షేరు ధర ఆ మేరకు తగ్గిపోతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply