[ad_1]
Stocks to watch today, 17 March 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 101 పాయింట్లు లేదా 0.59 శాతం గ్రీన్ కలర్‌లో 17,123 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
TCS: టీసీఎస్ MD & CEO పదవి నుంచి రాజేష్ గోపీనాథన్ సెప్టెంబర్ 15 నుంచి వైదొలగనున్నారు. దలాల్ స్ట్రీట్ చూసిన ప్రధాన నిష్క్రమణల్లో ఇది ఒకటి. కంపెనీ కొత్త సీఈవోగా కృతివాసన్‌ను నియమించింది.
సంవర్ధన్ మదర్సన్: జపనీస్ ప్రమోటర్ కంపెనీ సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్ (Sumitomo Wiring Systems), సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో దాదాపు 5% వాటాను గురువారం బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది.
గ్లెన్‌మార్క్ లైఫ్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం, ఒక్కో ఈక్విటీ షేర్‌పై రూ. 21 మధ్యంతర డివిడెండ్ (Glenmark Life dividend) ప్రకటించింది.
NTPC: భారతదేశంలోని అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తిదారు అయిన NTPCకి చెందిన గ్రీన్ ఎనర్జీ విభాగంలో 20% వాటాను కొనుగోలు చేయడానికి మలేషియాకు చెందిన పెట్రోనాస్ ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ. 3,800 కోట్లు (460 మిలియన్ డాలర్లు) ఆఫర్ చేసింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇలాంటి డీల్ ఇదే మొదటిదని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.
బజాజ్ ఫైనాన్స్: కంపెనీకి 5 సంవత్సరాల పాటు ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా అరిందమ్ భట్టాచార్య (Arindam Bhattacharya) నియామకం జరిగింది. ఈయనతో పాటు.. అనూప్ సాహా, రాకేష్ భట్ 5 సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు.
రైల్ వికాస్ నిగమ్: రూ. 111.85 కోట్ల విలువైన 11 KV లైన్ ప్రాజెక్ట్ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.
గ్లెన్‌మార్క్ ఫార్మా: గ్లెన్‌మార్క్ ఫార్మా అనుబంధ సంస్థ, తన పరిశోధనాత్మక కొత్త డ్రగ్ అప్లికేషన్‌పై ఫస్ట్-ఇన్-హ్యూమన్ క్లినికల్ అధ్యయనాన్ని కొనసాగించడానికి US FDA నుంచి అనుమతి పొందింది. ముదిరిపోయిన ఘన కణితులు (advanced solid tumors), లింఫోమస్ ఉన్న రోగుల చికిత్స కోసం ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు.
లెమన్ ట్రీ: రాజస్థాన్‌లోని గంగానగర్‌లో 60 గదులున్న ఒక హోటల్‌ను లెమన్ ట్రీ హోటల్స్ బ్రాండ్ కింద తీసుకోవడానికి లైసెన్స్ అగ్రిమెంట్ మీద ఒప్పందంపై సంతకం చేసింది. జులై 2026 నాటికి ఈ హోటల్‌లో వ్యాపారం మొదలవుతుందని భావిస్తున్నారు.
సెయిల్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 కోసం ఒక్కో ఈక్విటీ షేరుకు ఒక రూపాయి చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను సెయిల్ బోర్డు ప్రకటించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply