PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – Auto షేర్స్‌ రయ్‌ రయ్‌

[ad_1]

Stocks to watch today, 03 April 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 37 పాయింట్లు లేదా 0.21 శాతం రెడ్‌ కలర్‌లో 17,454 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

కర్ణాటక బ్యాంక్‌: 2023 మార్చి త్రైమాసికంలో ‍‌(జనవరి-మార్చి) డిపాజిట్లలో 9% వృద్ధితో రూ. 87,362 కోట్లను నమోదు చేయగా, అడ్వాన్స్‌లు 6% పెరిగి రూ. 61,326 కోట్లకు చేరుకున్నాయి.

ఆటో స్టాక్స్: మార్చి నెల విక్రయాల నేపథ్యంలో ఆటో కంపెనీల స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ దృష్టిలో ఉంటాయి. మారుతీ సుజుకి, టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక డిస్పాచ్‌లను నివేదించాయి. దీంతో, దేశీయ ప్యాసింజర్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో అత్యుత్తమ పనితీరును నమోదయింది.

అరబిందో ఫార్మా: కంపెనీ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన అపిటోరియా ఫార్మాకు, యాంటీబయాటిక్ API విభాగం ఉన్న యూనిట్లను బదిలీ చేయడానికి అరబిందో ఫార్మా డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. వ్యాపార బదిలీ ఒప్పందం ద్వారా స్లంప్ సేల్ మార్గంలో ఇది జరుగుతుంది.

అల్ట్రాటెక్ సిమెంట్: 2022-23 ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ మెట్రిక్ టన్నుల అమ్మకాల పరిమాణాన్ని అల్ట్రాటెక్ సిమెంట్ సాధించింది. నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి), భారతదేశ విక్రయాల పరిమాణం 30.5 మిలియన్ టన్నులుగా ఈ కంపెనీ నివేదించింది.

GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: రూ. 1,248 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లెటర్ ఆఫ్ అవార్డును (LoA) ఈ కంపెనీ దక్కించుకుంది.

NCC: వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రూ. 1,900 కోట్లకు పైగా విలువైన ఐదు కొత్త ఆర్డర్‌లను అందుకున్నట్లు ఈ కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు నివేదించింది.

గోద్రెజ్ ప్రాపర్టీస్: పుణెలో కట్టబోయే లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కోసం భూమిని కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబోతోంది. దీని ద్వారా రూ. 1,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది.

వీల్స్ ఇండియా:  మే 01, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా, మరో ఐదేళ్ల కాలానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీవత్స్ రామ్‌ను కొనసాగించేందుకు వీల్స్ ఇండియా డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

కరూర్ వైశ్యా బ్యాంక్: కరూర్ వైశ్యా బ్యాంక్, SBI లైఫ్ ఇన్సూరెన్స్‌ ఒక ఒప్పందం చేసుకున్నాయి. SBI లైఫ్ ఇన్సూరెన్స్‌ బీమా పథకాలను కరూర్ వైశ్యా బ్యాంక్ శాఖల ద్వారా మార్కెట్ చేయడానికి ఈ ఒప్పందం కుదిరింది.

NDTV: సంజయ్ పుగాలియా, సెంథిల్ సిన్నయ్య చెంగల్వరాయన్‌ను కంపెనీ పూర్తి కాల (Whole-time) డైరెక్టర్లుగా, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కంపెనీ నియమించింది.

బాటా ఇండియా: ప్రభుత్వ రంగ బీమా సంస్థ LIC, బాటా ఇండియాలో తన వాటాను 4.47% నుంచి 5% కు పెంచుకుంది.

HAL: 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 26,500 కోట్ల రికార్డ్ స్థాయి ఆదాయాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సాధించింది.

IDBI బ్యాంక్: ఈక్విటీ షేర్ క్యాపిటల్ తగ్గింపు కోసం దాఖలైన పిటిషన్‌ను NCLT ఆమోదించింది.

అదానీ పోర్ట్స్: కారైకల్ పోర్ట్ అదానీ గ్రూప్‌లోకి వచ్చింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) ఈ కొనుగోలును పూర్తి చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *