ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Zomato, ZEE, Sula Vineyard

[ad_1]

Stock Market Today, 31 August 2023: NSE నిఫ్టీ నిన్న (బుధవారం) 19,347 వద్ద క్లోజ్‌ అయింది. గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (గురువారం) ఉదయం 8.00 గంటల సమయానికి 8 పాయింట్లు లేదా 0.04 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,486 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

జొమాటో: ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే ఇంటికి ఫుడ్‌ డెలివెరీ చేసే జొమాటోలో బల్క్‌ డీల్స్‌ పర్వం కొనసాగుతోంది. పాత ఇన్వెస్టర్లు షేర్లను అమ్ముతుంటే, సుప్రసిద్ధ ఇన్వెస్టర్లు వాటిని కొంటున్నారు. బుధవారం జరిగిన బల్క్‌ డీల్స్‌లో మోర్గాన్ స్టాన్లీ, నోమురా, కోటక్ మహీంద్ర ఎంఎఫ్‌ సహా కొందరు మార్క్యూ ఇన్వెస్టర్లు జొమాటోలో వాటాను తీసుకున్నారు. అమ్మకాలు వెల్లువెత్తుతున్నా, డిమాండ్‌ అంతకంటే ఎక్కువగా ఉండడంతో షేర్‌ ప్రైస్‌ పెరుగుతోంది. జొమాటో షేర్‌ ప్రైస్‌ బుధవారం రూ.99.70 వద్ద ముగిసింది.

జీ ఎంటర్‌టైన్‌మెంట్: క్వాంట్ మ్యూచువల్ ఫండ్ బుధవారం నాడు బల్క్ డీల్స్ ద్వారా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో 48.1 లక్షల షేర్లను విక్రయించింది. జీ షేర్‌ బుధవారం రూ. 266.15 వద్ద ముగిసింది.

సూల వైన్‌యార్డ్స్‌: నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, ఇవాళ (గురువారం) బ్లాక్ డీల్స్ ద్వారా సూల వైన్‌యార్డ్స్‌లో 12.5% వాటాను ఆఫ్‌లోడ్ చేయాలని వెర్లిన్వెస్ట్‌ ఆసియా ప్లాన్‌ చేసింది. బుధవారం ఈ కంపెనీ షేర్‌ ధర రూ.509.80 వద్ద ముగిసింది.

మహీంద్ర లాజిస్టిక్స్: రేపటి (సెప్టెంబర్ 1, 2023‌) నుంచి అమల్లోకి వచ్చేలా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ & కీ మేనేజర్ పర్సనల్‌గా సౌరభ్ తనేజా నియామకాన్ని మహీంద్ర లాజిస్టిక్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. బుధవారం ఈ షేర్‌ ధర రూ.389.90 దగ్గర క్లోజ్‌ అయింది.

నాట్కో ఫార్మా: తెగుళ్ల నియంత్రణ కోసం డెలావేర్‌కు చెందిన ISCAలో నాట్కో ఫార్మా 2 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. నాట్కో ఫార్మా షేర్‌ ధర బుధవారం రూ.901.10 వద్ద ఆగింది.

BHEL: సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ స్టేజ్-II కింద ఛత్తీస్‌గఢ్‌లోని లారాలో రెండు 800 మెగావాట్ల ఏర్పాటు కోసం ఎన్‌టీపీసీ నుంచి BHEL ఆర్డర్‌ దక్కించుకుంది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా ఈ ఆర్డర్‌ సాధించింది. బుధవారం ఈ కౌంటర్‌ రూ.118 వద్ద క్లోజ్‌ అయింది. 

ఫోర్టిస్ హెల్త్‌కేర్: హరియాణాలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రూ. 225 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ఈ కంపెనీ షేర్‌ ధర రూ.332.50 వద్ద ముగిసింది.

NTPC: 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ ప్రాజెక్టు కోసం రూ.15,530 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎన్‌టీపీసీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. నిన్న ఈ స్టాక్‌ రూ.220.50 దగ్గర ఆగింది.

ఇది కూడా చదవండి: రాఖీ కట్టిన సోదరికి డబ్బును గిఫ్ట్‌ ఇస్తే, దానిపై ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాలా?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *