ఈ ఏడాది ఈక్విటీ ఫండ్స్‌లో సగం తుస్‌, బెంచ్‌మార్క్‌ల కన్నా తక్కువ రాబడి

[ad_1]

Equity Mutual Funds Performance in 2023: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఒక రకం. ఈ ఫండ్‌ మేనేజర్లు ఈక్విటీల్లో మాత్రమే పెట్టుబడులు పెడతారు, బాండ్స్‌ & గోల్డ్‌ వంటి అసెట్‌ క్లాస్‌లను పట్టించుకోరు. అంటే, పెట్టుబడిదార్లు ఈ రకం ఫండ్స్‌లో జమ చేసే డబ్బు మొత్తం షేర్లలోకే వెళ్తుంది. 

ఈక్విటీ ఫండ్స్‌లో రకాలు (Types of Equity Funds):

ఈక్విటీ ఫండ్స్‌లోనూ… స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌, లార్జ్‌ & మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌, మల్టీ క్యాప్‌ ఫండ్స్‌, వాల్యూ ఫండ్స్‌, ఫోకస్డ్‌ ఫండ్స్‌, ELSS ఫండ్స్‌, ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్స్‌, కాంట్రా ఫండ్స్‌ వంటి రకాలు ఉన్నాయి.

మొత్తం పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉన్నా, పెట్టుబడి నిష్పత్తిని బట్టి ఫండ్‌ టైప్‌ మారిపోతుంది. ఉదాహరణకు… స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లో మొత్తం (100%) డబ్బును ‍‌స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ కొనడానికే వినియోగిస్తారు. మిడ్‌ & లార్జ్‌ క్యాప్‌ షేర్ల జోలికి వెళ్లరు.

ఈక్విటీల్లో మాత్రమే పెట్టుబడులు ఉంటాయి కాబట్టి, ఇతర ఫండ్స్‌తో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్‌ మీద మార్కెట్‌ ఒడిదొడుకుల ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. 

ఈ ఏడాది, దాదాపు 50% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు రాణించాయి, వాటి బెంచ్‌మార్క్‌ల (స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌) కంటే మంచి రాబడులు రాబట్టాయి. మిగిలిన 50% ఫండ్స్‌ బెంచ్‌మార్క్‌ల కంటే తక్కువ రిటర్న్స్‌ ఇచ్చాయని దీనర్ధం. 

ప్రస్తుతం, మార్కెట్‌లో దాదాపు 243 ఈక్విటీ ఫండ్ స్కీమ్స్ రన్నింగ్‌లో ఉన్నాయి. 2023లో, వీటిలో 122 పథకాలు వాటి బెంచ్‌మార్క్‌ సూచీలను దాటి రిటర్న్స్‌ ఇవ్వడంలో ఫెయిల్‌ అయ్యాయి. అంటే అండర్‌పెర్ఫార్మ్‌ చేశాయి.

అండర్‌పెర్ఫార్మర్స్‌లో… స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్పేస్‌ నుంచే ఎక్కువ పథకాలు ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లోనూ దాదాపు 83% పథకాలు తక్కువ పనితీరు కనబరిచాయి. 

2023లో అండర్‌పెర్ఫార్మ్‌ చేసిన ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌:

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో 24 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 20 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి. అంటే, 83% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.
మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో 29 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 24 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి. అంటే, 83% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.
లార్జ్‌ & మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో 26 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 16 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి. అంటే, 62% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.
మల్టీ క్యాప్‌ ఫండ్స్‌లో 16 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 8 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి. అంటే, 50% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.
ఫోకస్డ్‌ ఫండ్స్‌లో 26 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 12 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి. అంటే, 46% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.
ELSS ఫండ్స్‌లో 38 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 15 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి. అంటే, 39% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.
ఫ్లెక్సి క్యాప్‌ ఫండ్స్‌లో 32 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 11 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి. అంటే, 34% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.
కాంట్రా ఫండ్స్‌లో 3 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 1 పథకం అండర్‌ పెర్ఫార్మ్‌ చేసింది. అంటే, 33% వెనుకబాటు. 
లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో 30 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 10 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి. అంటే, 33% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.
వాల్యూ ఫండ్స్‌లో 19 స్కీమ్స్‌ ఉన్నాయి. వీటిలో 5 పథకాలు అండర్‌ పెర్ఫార్మ్‌ చేశాయి అంటే, 26% స్కీమ్స్‌ వెనుకబడ్డాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది డబుల్‌ సెంచురీ కొట్టిన మల్టీబ్యాగర్లు, ‘అచ్చే దిన్‌’ చూసిన ఇన్వెస్టర్లు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *