[ad_1]
బీట్‌రూట్ జ్యూస్..
బీట్‌రూట్‌లో ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, బీటైన్, విటమిన్ సితో సహా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్ జ్యూస్ లివర్ నుంచి విషాన్ని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను తీసుకోవడం మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో శరీరంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. వంద గ్రాముల బీట్‌రూట్‌లో 0.8mg ఐరన్ ఉంటుంది. బీట్‌రూట్‌లోని విటమిన్ సి ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది.
(image source – pixabay)
Tender Coconut: లేత కొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ప్రూన్ జ్యూస్..
ఎండిన ప్లమ్‌ను.. ప్రూన్ అని కూడా పిలుస్తారు. ప్రూన్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు ప్రూన్ జ్యూస్‌లో 2.8mg ఐరన్ ఉంటుంది. ఇది రోజువారీ అవసరంలో 17% శాతాన్ని అందిస్తుంది. దీనిలోని హై ఐరన్ కంటెంట్ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇది మలబద్ధకం వంటి జీర్ణసమస్యలను కూడా దూరం చేస్తుంది.
(image source – pixabay)
Vitamin C Deficiency: విటమిన్ సి లోపం ఉంటే.. ఈ అనారోగ్యాలు వస్తాయ్..!
పుదీనా జ్యూస్..
వంద గ్రాముల పుదీనా ఆకులలో 15.6 మి.గ్రా ఐరన్ ఉంటుంది. ప్రతిరోజూ 1 కప్పు తాజా పుదీనా జ్యూస్ తాగితే.. 4 mg ఐరన్ లభిస్తుంది. రిఫ్రెష్ ఐరన్ రిచ్ డ్రింక్ కోసం పుదీనా ఆకులను 1/2 కప్పు నీరు, ఒక టీస్పూన్ బెల్లం, కొంచెం నిమ్మరసం మిక్స్ చేసి బ్లెండర్‌లో వేసి జ్యూస్ రెడీ చేసేయండి.
(image source – pixabay)
Rare Heart Conditions: మీరు వినని అరుదైన గుండె సమస్యలు ఇవే..!
గ్రీన్ జ్యూస్..
ఐరన్ లోపాన్ని దూరం చేయడానికి గ్రీన్ జ్యూస్ సహాయపడుతుంది. గ్రీన్ జ్యూస్‌లో నిమ్మరసం, పార్స్లీ, పియర్, పాలకూర, సెలరీ వంటివి దీనిలో యాడ్ చేస్తారు. ఈ జ్యూస్ ఐరన్ లోపాన్ని దూరం చేయడానికి తోడ్పడుతుంది. ఈ జ్యూస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి శరీరం ఐరన్‌ను గ్రహించడానికి తోడ్పడుతుంది.
(image source – pixabay)
గుమ్మడికాయ జ్యూస్..
గుమ్మడికాయలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవారికి గుమ్మడికాయ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది. గుమ్మడికాయలో పాస్ఫరస్,ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అనిమియాతో బాధపడేవారు.. గుమ్మడికాయ జ్యూస్ తాగితే మేలు జరుగుతుంది.
(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply