ఈ నూనెలతో.. థైరాయిడ్‌ లక్షణాలు తగ్గుతాయి..!

[ad_1]

Oil For Thyroid Health: శరీరంలోని మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారాన్ని పోలి ఉండే గ్రంధి థైరాయిడ్. దీని నుంచి విడుదలయ్యే హార్మోన్లు శరీరంలోని అనేక విధులకు సహాయపడుతుంది. శరీరం శక్తిని వినియోగించుకునేందుకు, వెచ్చగా ఉండేందుకు, మెదడు, గుండె, కండరాలు, ఇతర అవయవాలు సక్రమంగా పని చేసేందుకు అవసరమైన హార్మోన్లను ఈ గ్రంధి ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పని చేయకపోతే.. శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అయోడిన్ లోపం, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, జన్యుపరమైన లోపాలు, మధుమేహం వంటి వ్యాధుల వల్ల థైరాయిడ్‌లో అసమతుల్యత ఏర్పడుతుంది. NCBI నివేదిక ప్రకారం, భారతదేశంలో 42 మిలియన్ల మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. పురుషుల కంటే.. స్త్రీలలో థైరాయిడ్‌ వచ్చే ప్రమాదం 10 రెట్లు ఎక్కువ. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, థైరాయిడ్ వ్యాధిలో అనేక రకాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, థైరాయిడిటిస్, హషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్నాయి. థైరాయిడ్‌ను కంట్రోల్‌ చేయడానికి.. కొన్ని నూనెలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు ఉంటాయి..

  • ఆందోళన, చిరాకు, అలసట
  • బరువు తగ్గడం (హైపర్ థైరాయిడిజం)
  • బరువు పెరుగటం (హైపోథైరాయిడిజం,
  • కండరాల బలహీనత
  • నెలసరి క్రమం తప్పడం
  • కంటి చికాకు
  • విషయాలు మర్చిపోతారు
  • పొడి, ముతక జుట్టు

నిమ్మగడ్డి నూనె..

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. నిమ్మగడ్డిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌లను నిరోధిస్తుంది. థైరాయిడ్ హార్మన్‌ అసమతుల్యతతో సంబంధం ఉన్న.. అలెర్జీ, ఇన్ఫ్లమేటరీ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. థైరాయిడ్‌ గ్రంధి వాపు, పెరిగినట్లు అనిపిస్తే.. లెమన్‌ గ్రాస్‌ ఆయిల్‌ను మెడపై అప్లై చేయండి.

లావెండర్‌ నూనె..

లావెండర్ నూనెలో అనాల్జేసిక్ (నొప్పిని తగ్గించే లక్షణాలు), యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. లావెండర్ ఆయిల్ ఆందోళనకు తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు.. ఆందోళనకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. లావెండర్‌ ఆయిల్ డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.

గంధం నూనె..

NCBI ప్రకారం, గంధం నూనెలో యాంటి యాంగ్జయిటీ లక్షణాలు ఉన్నాయి. మీరు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నట్లయితే.. గంధం నూనె మీకు సహాయపడుతుంది. హైపోథైరాయిడిజం.. జుట్టు రాలడాన్ని కంట్రోల్‌ చేస్తుంది.

పెప్పర్‌మింట్‌ ఆయిల్‌..

పిప్పరమింట్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. థైరాయిడ్‌ కారణంగా.. పేలవమైన జీర్ణక్రియ, బలహీనమైన జీవక్రియ, మానసిక కల్లోలం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేడి నీటిలో పిప్పర్‌మింట్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టినా, నాభిపై రాసినా.. ఈ లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మిరియాల నూనె..

బ్లాక్ పెప్పర్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అటువంటి పరిస్థితిలో, హైపోథైరాయిడిజం వల్ల కలిగే అలసటను నివారించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. థైరాయిడ్‌ కారణంగా వచ్చే.. ఇన్ఫ్లమేషన్‌, ఆందోళన, నిరాశ, టాక్సిన్స్‌తో పోరాడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *