[ad_1]
New Rules from 1 September 2023: క్యాలెండర్‌లో కొత్త నెల ప్రారంభం కాగానే, దేశంలోనూ కొన్ని రూల్స్ మారుతుంటాయి. ఈ నెలలో కూడా కొన్ని విషయాలు మారాయి. ఆ మార్పులు మీ సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, బెనిఫిట్స్ మీద ప్రభావం చూపొచ్చు. ఆధార్ అప్‌డేషన్, డీమ్యాట్ అకౌంట్ నుంచి క్రెడిట్ కార్డ్ వరకు, సెప్టెంబర్‌లో జరిగే మార్పుల గురించిన ఇన్ఫర్మేషన్ ఇది. వీటి గురించి ముందే తెలుసుకుంటే, మీ జేబు మీద పడే అదనపు భారం నుంచి తెలివిగా తప్పించుకోవచ్చు.
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్:
కేవలం మూడు రోజుల్లోనే IPO లిస్టింగ్
స్టాక్ మార్కెట్‌లో ఏదైనా IPO సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత, గతంలో, ఆ కంపెనీ లిస్టింగ్‌కు 6 రోజులు పట్టేది. ఇప్పుడు ఆ గడువును కేవలం మూడు రోజులకు తగ్గించారు. IPO ముగిసిన మూడు రోజుల్లోనే సంబంధిత కంపెనీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతుంది. ఈ కొత్త రూల్ నేటి (సెప్టెంబర్ 1, 2023) నుంచి అమలులోకి వచ్చింది.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్‌లోని డైరెక్ట్ స్కీమ్‌ల్లో ఎగ్జిక్యూషన్ ప్లాట్‌ఫామ్‌ల కోసం SEBI రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టింది. ఎగ్జిక్యూషన్ ప్లాట్‌ఫామ్‌లతో (EOPలు) పాటు సరైన ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ మెకానిజమ్‌ల ద్వారా పెట్టుబడిదార్లు పెట్టుబడి పెట్టేలా కొత్త నిబంధనలు సౌకర్యాన్ని కల్పిస్తాయి. దీంతో ట్రేడ్ చేయడం సులభంగా మారుతుంది. ఈ నిబంధన సెప్టెంబర్ 1 నుంచి వర్తిస్తుంది.
క్రెడిట్ కార్డ్ రూల్స్
మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వాడుతున్న యూజర్లకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్. యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, మాగ్నస్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు కొన్ని లావాదేవీలపై డిస్కౌంట్ రాదు. అలాగే, ఆ కార్డుహోల్డర్లు ఈ రోజు (సెప్టెంబర్ 1, 2023) నుంచి ఛార్జీలు చెల్లించక తప్పదు.
ఎక్కువ జీతం
ఆదాయపు పన్ను విభాగం, సెప్టెంబరు 1 నుంచి ‘రెంట్-ఫ్రీ అకామడేషన్’ రూల్స్ మార్చింది. యజమాన్యం నుంచి వచ్చే అద్దెతో జీవిస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు ఎక్కువ డబ్బు మిగులుతుంది. ఈ రూల్ ప్రకారం, జీతంలో పన్ను మినహాయింపు తక్కువగా ఉంటుంది, ఉద్యోగులు ఎక్కువ ‘టేక్ హోమ్ శాలరీ’ పొందుతారు.
ATF ధర
ఈ రోజు నుంచి జెట్ ఇంధనం (ATF) ధర మారింది. జెట్ ఇంధనం న్యూదిల్లీలో కిలోలీటర్‌కు రూ.1,12,419.33 కు చేరింది, గతంలో కిలోలీటర్‌కు రూ.98,508.26 గా ఉంది. అంటే, కిలో లీటరు రేటు రూ.13,911.07 పెరిగింది.
ఈ నెలలో పూర్తి చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులు:
ఉచితంగా ఆధార్ కార్డ్ అప్‌డేట్
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి గడువు ఈ నెల 14వ తేదీ వరకే ఉంది. మీరు My Aadhaar పోర్టల్‌లో ఉచితంగా మీ ఆధార్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. గడువు తర్వాత అప్‌డేట్ చేయాలంటే రూ.50 ఛార్జీ చెల్లించాలి.
రూ.2000 నోటు మార్చుకునే గడువు
మీ దగ్గర 2 వేల రూపాయల నోట్లు ఉంటే, మీరు ఈ నెలలోనే వాటిని మార్చుకోవాలి. రూ.2000 నోటును ఉపసంహరించుకున్న ఆర్బీఐ, ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు సెప్టెంబర్ 30, 2023 వరకు గడువు ఇచ్చింది.
నామినీ పేరు యాడ్ చేయండి
డీమ్యాట్ ఖాతాలో నామినేషన్ కోసం సెబీ గతంలోనే గడువును పొడిగించింది. సెప్టెంబరు 30లోగా ఇది పూర్తి కావాలి. లేకపోతే మీ డీమ్యాట్ ఖాతా నుంచి ట్రేడింగ్ చేయలేరు, లావాదేవీలు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: ఈసారి వంతు కమర్షియల్ సిలిండర్లది – రేటు భారీగా తగ్గింపు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply