[ad_1]
Stock Market News Today in Telugu: గ్లోబల్ సిగ్నల్స్ బలహీనంగా ఉండడంతో భారత స్టాక్ మార్కెట్లు ఈ రోజు (బుధవారం, 10 జనవరి 2024) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కీలక స్థాయుల దగ్గర పట్టు నిలబెట్టుకోవడానికి సెన్సెక్స్ & నిఫ్టీ పోరాడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్ల వరకు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ మరీ ఎక్కువగా పడిపోకుండా ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ నుంచి మద్దతు లభించింది. ఈ రోజు కూడా IT స్టాక్స్ పైపైకి పాకుతున్నాయి. BSE టాప్ గెయినర్స్‌లో టెక్నాలజీ స్టాక్స్ ఉన్నాయి.
రేపటి నుంచి Q3 FY24 ఫలితాల సీజన్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు అస్థిరంగా కదులుతున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (మంగళవారం) 71,386 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 3 పాయింట్ల నామమాత్రపు క్షీణతతో 71,383 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. నిన్న 21,545 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 15.55 పాయింట్లు పతనమై 21,529 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
బ్రాడర్ ఇండెక్స్‌లు ఈ రోజు ఎరుపు రంగులోకి జారిపోయాయి. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం తగ్గింది.
ప్రి-ఓపెనింగ్ సెషన్
మార్కెట్ ప్రి-ఓపెనింగ్ సెషన్‌లో, సెన్సెక్స్ 24 పాయింట్లు పడిపోయి 71,362 స్థాయి వద్ద; నిఫ్టీ 18.15 పాయింట్లు క్షీణించి 21,526 వద్ద ట్రేడయ్యాయి.
మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో… BSEలో 2,942 షేర్లు ట్రేడ్ అవుతుండగా, వీటిలో 1,711 షేర్లు బుల్లిష్ మార్క్‌తో ట్రేడవుతున్నాయి. 1,127 స్టాక్స్ క్షీణించాయి.
సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్30 ప్యాక్‌లోని 13 స్టాక్స్ లాభపడగా, 17 నష్టాలను ఎదుర్కొంటున్నాయి. HCL టెక్ 1 శాతం, టైటన్ 0.61 శాతం, నెస్లే 0.56 శాతం, ICICI బ్యాంక్ 0.42 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.34 శాతం, TCS 0.27 శాతం చొప్పున లాభపడ్డాయి. ఫ్లిప్ సైడ్‌లో.. NTPC, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ నష్టపోయాయి.
ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 49.14 పాయింట్లు లేదా 0.06% తగ్గి 71,337.07 దగ్గర; NSE నిఫ్టీ 30.25 పాయింట్లు లేదా 0.14% తగ్గి 21,514.60 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
మార్చిలో ఫెడ్ రేటు తగ్గింపు ఆశలు సన్నగిల్లడంతో నిన్న US మార్కెట్లు తగ్గాయి. గురువారం యూఎస్ డిసెంబర్ నెల ద్రవ్యోల్బణం డేటా కూడా వెలువడుతుంది. గత కొన్ని రోజుల నుంచి, బెంచ్‌మార్క్ 10-ఇయర్స్ బాండ్ ఈల్డ్ 4 శాతం మార్కు చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదార్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం, యూఎస్ మార్కెట్లలో… డౌ జోన్స్, S&P 500 వరుసగా 0.42 శాతం & 0.15 శాతం పడిపోయాయి, నాస్‌డాక్ కాంపోజిట్ 0.09 శాతం లాభపడింది.
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నికాయ్ 1.7 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా కోప్సీ 0.6 శాతం వరకు డౌన్ అయ్యాయి. హ్యాంగ్ సెంగ్ కోలుకుని 0.3 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: : తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి
[ad_2]
Source link
Leave a Reply