ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Patanjali, Adani Ports, Biocon

[ad_1]

Stock Market Today, 09 November 2023: మిక్స్‌డ్‌ గ్లోబల్ ఇండికేషన్స్‌ మధ్య బుధవారం దేశీయ ఈక్విటీలు రేంజ్ బౌండ్‌లో ట్రేడ్‌ అయ్యాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపు ఎలా ఉంటుందో అంచనా వేయడానికి, ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలను ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. 

మిశ్రమంగా US స్టాక్స్
వడ్డీ రేట్ల పెంపుపై సంకేతాలు, ట్రెజరీ ఈల్డ్స్‌ ట్రెండ్‌ కోసం ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలపై పెట్టుబడిదార్లు ఫోకస్‌ పెట్టడంతో, S&P 500 & నాస్‌డాక్ బుధవారం స్వల్పంగా లాభపడ్డాయి.

లాభాల్లో ఆసియా మార్కెట్లు 
US ఈక్విటీలు రెండు సంవత్సరాల గరిష్ట స్థాయి లాభాలకు చేరడంతో ఆసియాలో స్టాక్స్‌ అప్‌ట్రెండ్‌లో ఉన్నాయి. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇక పెరగవని మార్కెట్లు ఆశలు పెట్టుకున్నాయి. 

ఈ రోజు ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 29 పాయింట్లు లేదా 0.15 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,530 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్, సంవర్ధన మదర్సన్, ZEE. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

పతంజలి ఫుడ్స్: 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ నికర లాభం రెండింతలు పెరిగి రూ. 255 కోట్లకు చేరుకుంది.

మజగాన్ డాక్‌: జులై-సెప్టెంబర్‌ కాలంలో మజగాన్ డాక్ కన్సాలిడేటెడ్‌ నెట్‌ ప్రాఫిట్‌ 56% జంప్‌తో, రూ. 333 కోట్లుగా నమోదైంది.

టాటా పవర్: Q2 FY24లో టాటా పవర్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 7% పెరిగింది, రూ. 876 కోట్లుగా లెక్క తేలింది.

యునైటెడ్ స్పిరిట్స్: సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో యునైటెడ్ స్పిరిట్స్ రూ.2,865 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. అదే కాలానికి ఎబిటా రూ. 470 కోట్లుగా ఉంది.

పిడిలైట్ ఇండస్ట్రీస్: జూలై-సెప్టెంబర్ కాలంలో పిడిలైట్ ఇండస్ట్రీస్ రూ. 458 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ. 3,076 కోట్ల ఆదాయం వచ్చింది.

బాటా: సెప్టెంబర్ క్వార్టర్‌లో బాటా రూ. 34 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. కార్యకలాపాల ద్వారా రూ. 819 కోట్ల ఆదాయం ఆర్జించింది.

బయోకాన్: బయోకాన్ అనుబంధ సంస్థ అయిన బయోకాన్ బయోలాజిక్స్, భారతదేశంలో డెర్మటాలజీ, నెఫ్రాలజీ బ్రాండెడ్ ఫార్ములేషన్స్ బిజనెస్‌ యూనిట్లలో వాటాను అమ్ముతోంది. దీని కోసం ఎరిస్ లైఫ్‌సైన్సెస్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.

BHEL: 2023-24 రెండో త్రైమాసికంలో బీహెచ్ఈఎల్ రూ. 238 కోట్ల నికర నష్టాన్ని భరిస్తోంది. కార్యకలాపాల ద్వారా రూ. 5,125 కోట్ల ఆదాయం వచ్చింది.

నజారా టెక్: రెండో త్రైమాసికంలో నజారా టెక్నాలజీస్‌ నికర లాభం 53% పెరిగి రూ. 24 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13% పెరిగి రూ. 297 కోట్లుగా నమోదైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ‘సిప్‌’ పెట్టుబడిని మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు, ఈ 4 టైప్స్‌లో ఒకదాన్ని ఫాలో కావచ్చు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *