ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ SpiceJet, Nippon, DOMS, Varun Bev

[ad_1]

Stock Market Today, 20 December 2023: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు నిన్న (మంగళవారం) రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ చూశాయి. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల వల్ల ముడి చమురు బ్యారెల్‌కు 80 డాలర్లకు పెరిగినప్పటికీ, ప్రపంచ మార్కెట్లలో బలం కనిపిస్తోంది. ఈ రోజు మన మార్కెట్‌ కూడా హైయ్యర్‌ సైడ్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

బ్యాంక్ ఆఫ్ జపాన్ తన పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. నికాయ్‌ 1.6 శాతం జంప్‌ చేసింది. హాంగ్ సెంగ్, కోస్పి కూడా 1 శాతం చొప్పున పెరిగాయి. ఆస్ట్రేలియా S&P/ASX 200 0.5 శాతం గెయిన్స్‌లో ఉంది.

ఓవర్‌ నైట్‌లో, యూఎస్‌లో డౌ జోన్స్‌,  S&P 500, నాస్‌డాక్ కాంపోజిట్ 0.68 వరకు లాభపడ్డాయి.

ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 02 పాయింట్లు లేదా 0.01% రెడ్‌ కలర్‌లో 21,615 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

డోమ్స్ ఇండస్ట్రీస్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్: ఈ రెండు కంపెనీల షేర్లు ఈ రోజు మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి, కాబట్టి ఇవి మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

IT స్టాక్స్: ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌, రెండో త్రైమాసిక ఆదాయాల అంచనాల్లో నిరాశపరిచింది. LSEG పోల్ ఎనలిస్ట్‌లు  $16.20 బిలియన్లు అంచనా వేస్తే, యాక్సెంచర్‌ $15.40-16 బిలియన్ల పరిధిలో Q2 రాబడిని ఆశిస్తోంది.

స్పైస్‌జెట్: నిధుల సేకరణ నేపథ్యంలో, ముంబై వ్యాపారవేత్త హరిహర మహాపాత్ర, అతని భార్య ప్రీతి స్పైస్‌జెట్‌లో 19 శాతం వాటా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందు కోసం 1,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టొచ్చు. వారెంట్ల మార్పిడి తర్వాత ఏరీస్ ఆపర్చునిటీస్ ఫండ్ 3 శాతం, ఎలారా క్యాపిటల్ 8 శాతం కలిగి ఉంటుంది.

వరుణ్ బెవరేజెస్: ఆఫ్రికాలో వ్యాపారాన్ని పెంచుకునే ప్లాన్స్‌లో భాగంగా, దక్షిణాఫ్రికాకు చెందిన ది బెవరేజ్ కంపెనీ లిమిటెడ్‌ను (బెవ్‌కో) రూ. 1,320 కోట్లకు వరుణ్‌ బేవరేజెస్‌ కొనుగోలు చేయబోతోంది. 

నిప్పాన్ AMC: ఇండస్‌ఇండ్ బ్యాంక్ బ్లాక్ డీల్ ద్వారా నిప్పాన్ AMCలో 1.79 కోట్ల షేర్లు లేదా 2.86 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది. ఆఫర్ సైజ్‌ రూ. 762 కోట్లు. బ్లాక్ డీల్ కోసం ఫ్లోర్‌ ప్రైస్‌ను రూ. 426.60గా నిర్ణయించారు.

ఎంబసీ ఆఫీస్ పార్క్స్ REIT: బ్లాక్‌స్టోన్, తన మొత్తం 23.6 శాతం వాటాను 833 మిలియన్‌ డాలర్ల మెగా బ్లాక్ డీల్ ద్వారా విక్రయించి, ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ నుంచి ఎగ్జిట్‌ కావాలని యోచిస్తోంది. 

ఆస్ట్రల్: ఈ కంపెనీ ప్రమోటర్ బ్లాక్ డీల్ ద్వారా 2-3 శాతం వాటాను విక్రయించాలని చూస్తున్నారు. ఆస్ట్రల్‌లో ప్రమోటర్‌కు 55.85 శాతం వాటా ఉంది.

BPCL: రూ. 5,044 కోట్ల వ్యయంతో కొచ్చి రిఫైనరీలో పాలీప్రొఫైలిన్ (PP) యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఈ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. 

HCL టెక్: ఈ కంపెనీ ప్రాజెక్ట్‌ల్లో ఒకదానిలోకి రాన్సమ్‌వేర్‌ (వైరస్‌) ప్రవేశించింది. అయితే, దీనివల్ల కంపెనీ నెట్‌వర్క్‌పై ఎటువంటి ప్రభావం కనిపించలేదని హెచ్‌సీఎల్‌ టెక్‌ ప్రకటించింది. దీనిపై విచారణ జరుగుతోంది.

BSE: మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్‌లో (MWPL), టాప్-10 క్లయింట్లకు 20 శాతం కంటే ఎక్కువ వాటా ఉన్న సెక్యూరిటీలపై, ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్‌లో అదనంగా 15 శాతం ఎక్స్‌పోజర్ మార్జిన్‌ను విధిస్తుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఎల్‌ఐసీ కొత్త పాలసీ – జీవితాంతం ఆదాయంతో పాటు ఎక్కువ వడ్డీ పొందే ఆప్షన్‌

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *