ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ RIL, HUL, REC, Paytm

[ad_1]

Stock Market Today, 19 January 2024: గురువారం నాటి నష్టాలను నుంచి ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు‍ (శుక్రవారం) కోలుకునే అవకాశం ఉంది. బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ ఈ రోజంతా సైడ్‌లైన్స్‌లోనే ట్రేడ్‌ కావచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, పేటీఎం Q3 ఆదాయాలు ఈ రోజు మార్కెట్‌ దృష్టిలో ఉంటాయి.

ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 25 పాయింట్లు లేదా 0.11% గ్రీన్‌ కలర్‌లో 21,573 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

గ్లోబల్ మార్కెట్లు
గురువారం, యుఎస్‌లో IT స్టాక్స్‌ పుంజుకున్నాయి, నాస్‌డాక్ 1.35 శాతం లాభంతో ముగిసింది. డౌ జోన్స్‌, S&P 500 వరుసగా 0.54, 0.88 శాతం పెరిగాయి. ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే.. నికాయ్‌ 1.5 శాతం ఎగబాకడంతో ఆసియా మార్కెట్లు కూడా ఈ ఉదయం నష్టాలకు స్వస్థి పలికాయి. కోస్పి, ASX 200 1 శాతం వరకు పెరిగాయి. హాంగ్ సెంగ్ 0.5 శాతం పెరిగింది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్థాన్ జింక్, సుప్రీం ఇండస్ట్రీస్, వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం), సెంట్రల్ బ్యాంక్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్, RBL బ్యాంక్, తేజస్ నెట్‌వర్క్స్, అతుల్, వెండ్ట్ (ఇండియా), CESC, అవాంటెల్.

ఇండస్‌ఇండ్ బ్యాంక్: డిసెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం సంవత్సరానికి (YoY) 17 శాతం పెరిగి రూ. 2,297.9 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (NII) 17.8 శాతం YoY వృద్ధితో రూ.5,295.7 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) 1.92 శాతంగా ఉన్నాయి, QoQలో అతి స్వల్పంగా పెరిగాయి. NNPAs 0.57 శాతం వద్ద ఫ్లాట్‌గా ఉంది.

జెట్ ఎయిర్‌వేస్: 2024 జనవరి 31లోగా రూ.150 కోట్లు డిపాజిట్ చేయాలని జలాన్ కల్రాక్ కన్సార్టియంను సుప్రీంకోర్టు ఆదేశించింది.

టాటా స్టీల్: UKలోని వేల్స్‌లో, పోర్ట్ టాల్బోట్ స్టీల్‌వర్క్స్‌లో బ్లాస్ట్ ఫర్నేస్‌లను ఆపరేట్ చేయాలన్న ట్రేడ్ యూనియన్ ప్రతిపాదనను టాటా స్టీల్ తిరస్కరించింది.

బంధన్ బ్యాంక్: రాజిందర్ కుమార్ బబ్బర్‌ను మూడు సంవత్సరాలకు బ్యాంక్ ఫుల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా నియమించడానికి బంధన్‌ బ్యాంక్‌ ఆమోదం తెలిపింది. బబ్బర్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తారు. 

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: రాజస్థాన్, గుజరాత్‌లోని పునరుత్పాదక విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ పంపిణీ చేసే ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఈ కంపెనీ రెండు SPVలను నెలకొల్పింది. KPS III HVDC ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, బార్మర్ I ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ పేరిట వాటిని ఏర్పాటు చేసింది.

REC: న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ, రూఫ్‌టాప్ సోలార్ (RTS) ప్రోగ్రామ్ కోసం ఓవరాల్‌ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీగా REC లిమిటెడ్‌ను నియమించింది.

సుప్రీం పెట్రోకెమ్: డిసెంబర్‌ త్రైమాసికంలో రూ.1,183.32 కోట్ల నికర విక్రయాలు చేసింది. ఏడాది క్రితం రూ.1,177.39 కోట్లుగా ఉంది. కంపెనీ నికరలాభం రూ.67.66 కోట్లుగా లెక్క తేలింది, గత ఏడాది ఇదే కాలంలోని లాభం రూ.89.85 కోట్లతో పోలిస్తే 25 శాతం తగ్గింది.

మాగ్నమ్ వెంచర్స్: రూ.48.92 కోట్ల విలువైన రైట్స్ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. రికార్డు తేదీని జనవరి 25, 2024గా నిర్ణయించింది.

ఫినోలెక్స్ ఇండస్ట్రీస్: డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 8.5 శాతం తగ్గి రూ. 1,054.81 కోట్లకు చేరగా, నికర లాభం 20 శాతం పెరిగి రూ.95.40 కోట్లకు చేరుకుంది.

మెట్రో బ్రాండ్స్‌: FY24 కోసం రూ.2.75 మధ్యంతర డివిడెండ్‌ చెల్లింపునకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి రికార్డ్ తేదీ జనవరి 31, 2024. కంపెనీ నికర లాభం YoYలో 12.6 శాతం తగ్గి రూ. 97.81 కోట్లకు పరిమితమైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఆకాశం నుంచి దిగొచ్చిన గోల్డ్‌ – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *