[ad_1]
Stock Market Today, 24 January 2024: మంగళవారం అతి భారీగా, దాదాపు ఒకటిన్నర శాతం పతనమైన మార్కెట్లలో, ఈ రోజు (బుధవారం) పుల్‌బ్యాక్ ర్యాలీ కనిపించవచ్చు. ఓవర్‌నైట్‌లో, యూఎస్ మార్కెట్లలో కనిపించిన ర్యాలీ, ఈ రోజు ఇండియన్ మార్కెట్లను ఉత్సాహపరచవచ్చు.
మంగళవారం స్లైడ్ తర్వాత నిఫ్టీ 21,250 దిగువన ముగిసింది. టెక్నికల్‌గా, డైలీ చార్ట్స్‌లో లాంగ్ బేర్ క్యాండిల్ స్టిక్ కనిపిస్తోంది. మార్కెట్ ఇంకా దిగువకు పడితే, 21,000 స్థాయి దగ్గర మద్దతు దొరుకుతుంది. ఇక్కడ కూడా నిలదొక్కుకోలేకపోతే 20,850 దగ్గర మరో సపోర్ట్ ఉంది. నిఫ్టీ 21,250ని దాటి పైకి వెళితే, 21,400-21,500 స్థాయిలో రెసిస్టెన్స్ కనిపిస్తోందని ఎనలిస్ట్‌లు చెబుతున్నారు.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 01 పాయింట్ల లాభంతో, ఫ్లాట్‌గా 21,262 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
నిన్న, యూఎస్ మార్కెట్లలో, S&P 500 0.29 శాతం లాభపడి 4,864.60 వద్ద ఫ్రెష్‌గా ఆల్-టైమ్ గరిష్టాన్ని క్రియేట్ చేసింది. టెక్ స్టాక్స్‌తో కూడిన నాస్డాక్ కాంపోజిట్ 0.43 శాతం పెరిగింది. మరోవైపు, మూడు రోజుల ర్యాలీ తర్వాత డౌ జోన్స్ 0.25 శాతం పతనమైంది.
ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న సూచనలు మిశ్రమంగా ఉన్నాయి. కోస్పీ 0.5 శాతం, నికాయ్ 0.3 శాతం, ASX200 0.2 శాతం క్షీణించాయి. హ్యాంగ్ సెంగ్ మాత్రం 1.7 శాతం పెరిగింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: బజాజ్ ఆటో, భారత్ డైనమిక్స్, బ్లూ డార్ట్, కెనరా బ్యాంక్, సియట్, DCB బ్యాంక్, DLF, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, లారస్ ల్యాబ్స్, PNB హౌసింగ్, రైల్ టెల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, TVS మోటార్, UCO బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.
HDFC బ్యాంక్: మన దేశంలో 20 మిలియన్ క్రెడిట్ కార్డ్‌లను జారీ చేసిన తొలి బ్యాంక్‌గా HDFC బ్యాంక్ నిలిచింది. 2001లో క్రెడిట్ కార్డ్ వ్యాపారంలోకి ప్రవేశించి రుణదాత, 2017లో 10 మిలియన్ల మార్కును తాకింది.
యాక్సిస్ బ్యాంక్: Q3FY24లో, ఈ ప్రైవేట్ రంగ రుణదాత నికర లాభం సంవత్సరానికి (YoY) 4 శాతం పెరిగి రూ. 6,071 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (NII) 9 శాతం పెరిగి రూ.12,532 కోట్లకు చేరుకుంది.
L&T ఫైనాన్స్ హోల్డింగ్స్: మూడో త్రైమాసికంలో, LTFH కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 41 శాతం పెరిగి రూ.640 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,833 కోట్లకు చేరుకుంది.
భారతి ఎయిర్టెల్: 2015 వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌కు సంబంధించి, సర్దుబాటు చేసిన అప్పు మీద టెలికాం శాఖకు రూ.8,325 కోట్లను ముందస్తుగా చెల్లించింది.
హీరో మోటోకార్ప్: 2024లో ‘మీడియం’, ‘అఫర్డబుల్’, ‘బిజినెస్-టు-బిజినెస్ (B2B)’ విభాగాల్లో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని యోచిస్తోంది.
మహానగర్ గ్యాస్: Q3లో ఏకీకృత నికర లాభం 84.3 శాతం YoY పెరిగి రూ.317 కోట్లకు చేరుకుంది. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 6.1 శాతం తగ్గి రూ.1,569 కోట్లకు పరిమితమైంది.
యునైటెడ్ స్పిరిట్స్: డిసెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం YoY 63.5 శాతం పెరిగి రూ.350 కోట్లుగా నమోదైంది. ఆదాయం 8 శాతం పెరిగి రూ.3,002 కోట్లుగా లెక్క తేలింది.
టాటా ఎల్‌స్కీ: డిసెంబర్ క్వార్టర్లో, ఈ టాటా గ్రూప్ కంపెనీ నెట్ ప్రాఫిట్ 3.2 శాతం పెరిగింది, రూ.206 కోట్లు మిగిలింది. ఆదాయం 3.7 శాతం పెరిగి రూ.914 కోట్లకు చేరుకుంది.
REC: Q3FY24 లాభం గత సంవత్సరం కంటే 13 శాతం పెరిగి రూ.3,269 కోట్లకు చేరింది. ఆదాయం 21 శాతం పెరిగి రూ.4,350 కోట్లకు చేరింది.
JSW ఎనర్జీ: మూడో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.231 కోట్లుగా ఉంది, YoYలో ఇది 28.8 శాతం వృద్ధి. ఆదాయం రూ.2,543 కోట్లుగా ఉంది, YoYలో ఇది 13.1 శాతం పెరుగుదల.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: జనానికి అందనంత ఎత్తులో గోల్డ్ – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
[ad_2]
Source link
Leave a Reply