ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Paytm, Voda, CMS Info, Andhra Cements

[ad_1]

Stock Market Today, 27 February 2024: ఈ గురువారం నాడు ప్రకటించబోయే Q3FY24 GDP గణాంకాలను బేస్‌ చేసుకుని స్టాక్స్‌ కదలవచ్చు. కాబట్టి, వ్యక్తిగత స్టాక్స్‌ ఆధారంగా బెంచ్‌మార్క్ సూచీల్లో డైరెక్షన్‌ కనిపించే అవకాశం ఉంది.

ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 107 పాయింట్లు లేదా 0.48 శాతం రెడ్‌ కలర్‌లో 22,183 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు నిస్తత్తువగా అడుగులు వేస్తున్నాయి. నికాయ్‌, తైవాన్ తలో 0.3 శాతం వరకు పెరిగాయి. హ్యాంగ్ సెంగ్, కోస్పి, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.5 శాతం వరకు పడిపోయాయి.

అమెరికాలో వడ్డీ రేటు తగ్గింపు సమయంపై ఒక అంచనాను తెలిపే ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారంలో వెలువడతాయి. అక్కడి ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్‌ డేటాపై దృష్టి పెట్టడంతో US మార్కెట్ లోయర్‌ సైడ్‌లో ముగిసింది.

10-సంవత్సరాల US ట్రెజరీ బాండ్ ఈల్డ్ దాదాపు 4.27 శాతంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు మళ్లీ 82 డాలర్లకు పెరిగింది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ప్రైమరీ (IPO) మార్కెట్‌లో… ఎక్సికామ్ టెలి సిస్టమ్స్, ప్లాటినం ఇండస్ట్రీస్ IPOల సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ కంపెనీలు వరుసగా రూ.135-142 & రూ.162-రూ.171 ప్రైస్‌ రేంజ్‌లో షేర్లను ఆఫర్‌ చేస్తున్నాయి.

పేటీఎం: విజయ్ శేఖర్ శర్మ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పార్ట్‌టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు, బ్యాంక్ డైరెక్టర్ల బోర్డను రీషఫుల్‌ చేశారు.

వొడాఫోన్ ఐడియా: వొడాఫోన్ గ్రూప్ పీఎల్‌సీ, ఆదిత్య బిర్లా గ్రూప్, భారత ప్రభుత్వం సహా ప్రస్తుత వాటాదార్లకు షేర్లను అమ్మి, నిధుల సమీకరించే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ టెలికాం కంపెనీ బోర్డు ఈ రోజు సమావేశం కానుంది.

కెనరా బ్యాంక్: 1:5 నిష్పత్తిలో స్టాక్ విభజనను డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ నిర్ణయం ప్రకారం.. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరును రూ.2 ముఖ విలువకు కుదించి, ఐదు షేర్లుగా విభజిస్తారు. ప్రస్తుతం ఉన్న స్టాక్‌ ధర కూడా ఐదో వంతుకు తగ్గిపోతుంది, షేర్ల సంఖ్య ఐదు రెట్లు పెరుగుతుంది.

CMS ఇన్ఫో సిస్టమ్స్: ప్రమోటర్ కంపెనీ సియోన్ ఇన్వెస్ట్‌మెంట్, ఈ రోజు, బ్లాక్ డీల్స్ ద్వారా CMS ఇన్ఫోలో తన మొత్తం 26.7 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది. ఫ్లోర్‌ ప్రైస్‌ను రూ.360గా నిర్ణయించారు.

ఆంధ్రా సిమెంట్స్: కంపెనీ ప్రమోటర్ సాగర్ సిమెంట్స్, ఈ కంపెనీలో 5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనుంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఓపెన్‌లో ఉంటుంది. ఈ షేర్‌ గత ముగింపు ధర రూ.111తో పోలిస్తే, OFSలో ఫ్లోర్ ధరను రూ.90గా నిర్ణయించారు.

TVS మోటార్: జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్ట్స్‌ & కాంపోనెంట్స్ స్టార్టప్ కిల్‌వాట్ GmbHలో, టీవీఎస్‌ మోటార్‌ సింగపూర్ అనుబంధ సంస్థ, తన వాటాను 39.28 శాతం నుంచి 49 శాతానికి పెంచుతోంది.

విప్రో: నోకియాతో ఒప్పందం చేసుకుని, కార్పొరేట్‌ కంపెనీలకు ప్రైవేట్ 5G వైర్‌లెస్ సొల్యూషన్స్‌ అందించబోతోంది. 

ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్: వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం క్యాష్‌ పెనాల్టీని విధించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఛైర్మన్‌ పదవికి విజయ్ శేఖర్ శర్మ రాజీనామా

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *