ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Jio Fin, Vedanta, Info Edge, Asian Paints

[ad_1]

Stock Market Today, 04 March 2024: ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (సోమవారం) నిరుత్సాహ ధోరణిలో ప్రారంభం కావచ్చు. ఈ మంగళవారం చైనా 2024 వృద్ధి అంచనాలు వెలువడతాయి. ఈ వారం చివరిలో యూఎస్‌ కాంగ్రెస్‌లో ఫెడ్‌ చైర్ జెరోమ్ పావెల్ ప్రసంగం ఉంటుంది. ఈ రెండు సంఘటనలు మార్కెట్‌ను ఏదోక వైపు నడిపిస్తాయి.

ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 05 పాయింట్లు లేదా 0.02 శాతం రెడ్‌ కలర్‌లో 22,506 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. నికాయ్‌ 1 శాతం జంప్‌తో 40,000 మార్క్‌ను అధిగమించి, రికార్డ్ బ్రేకింగ్ రన్నింగ్‌ను కొనసాగిస్తోంది. CSI 300, హాంగ్‌కాంగ్ హ్యాంగ్ సెంగ్ 0.2 శాతం పడిపోయాయి. దక్షిణ కొరియా కోస్పి 1.43 శాతం పెరిగింది. 

శుక్రవారం, యూఎస్‌ మార్కెట్లలో నాస్‌డాక్ 1.14 శాతం, S&P 500 0.80 శాతం, డౌ జోన్స్ 0.23 శాతం లాభపడ్డాయి, అప్‌వర్డ్ ట్రెండ్‌ను కొనసాగించాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించిన ప్రకారం, S&P BSE లార్జ్ క్యాప్‌ సూచీలోకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటర్‌ అయింది.

వేదాంత: వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ అయిన వేదాంత రిసోర్సెస్ రాబోయే మూడేళ్లలో 3 బిలియన్‌ డాలర్ల వరకు రుణాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు వార్తా సంస్థ PTI రిపోర్ట్‌  చేసింది.

ఇన్ఫో ఎడ్జ్ ఇండియా: ఈ ఇంటర్నెట్ కంపెనీ, తన మొబైల్ అప్లికేషన్స్‌ అయిన నౌక్రీ జాబ్‌సీకర్, నౌక్రిగల్ఫ్ జాబ్ సెర్చ్ యాప్, 99 ఏకర్స్‌ యాప్‌ మళ్లీ గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది.

NTPC: రూ. 17,195.31 కోట్ల అంచనా వ్యయంతో సింగ్రౌలీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-III (2×800 మెగావాట్లు) కోసం డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని ఆదివారం ఎక్స్ఛేంజీల్లో రిపోర్ట్‌ చేసింది.

SJVN: ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థ SJVN విభాగమైన SJVN గ్రీన్ ఎనర్జీ, 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ కాంట్రాక్టును దక్కించుకుంది. రూ. 1,100 కోట్ల తాత్కాలిక వ్యయంతో SJVN గ్రీన్ ఎనర్జీ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తుంది. 

వన్ 97 కమ్యూనికేషన్స్: మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 నిబంధనలు ఉల్లంఘించినందుకు భారత ఆర్థిక ఇంటెలిజెన్స్ యూనిట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కి రూ.5.49 కోట్ల జరిమానా విధించింది.

ఏషియన్ పెయింట్స్: మధ్యప్రదేశ్‌లో 4 లక్షల KL వార్షిక సామర్థ్యంతో కొత్త నీటి ఆధారిత పెయింట్ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఈ ఫ్లాంట్‌ పెట్టుబడి అంచనా రూ.2,000 కోట్లు.

స్వాన్ ఎనర్జీ: అనుబంధ సంస్థ అయిన స్వాన్ ఎల్‌ఎన్‌జీ, తన బ్యాంకుల కన్సార్టియంకు వడ్డీతో సహా రూ.2,206 కోట్ల రుణాన్ని పూర్తిగా చెల్లించింది. సెప్టెంబర్‌లో రూ.4,128 కోట్లుగా ఉన్న గ్రూప్‌ బాహ్య రుణం ఇప్పుడు రూ.1,675 కోట్లకు తగ్గింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: రెండు నెలల గరిష్టంలో గోల్డ్‌ – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *