ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ RIL, Adani Green, UltraTech

[ad_1]

Stock Market Today, 30 October 2023: ఆరోగ్యకరమైన US GDP డేటాను ఫాలో అయిన దేశీయ ఈక్విటీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అయితే గత వారం మొత్తంగా చూస్తే, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు & వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో నష్టపోయింది.

US స్టాక్స్ మిశ్రమం
US స్టాక్స్‌ శుక్రవారం లోయర్‌ సైడ్‌లో ముగిశాయి. పెట్టుబడిదార్లు మిశ్రమ ఆదాయాలను డైజెస్ట్‌ చేసుకోవడం, “ఎక్కువ కాలం” కొనసాగే అధిక వడ్డీ రేట్ల సినారియోకు మద్దతు ఇచ్చే ఆర్థిక డేటా ఇందుకు కారణం.

ఆసియా షేర్లు పతనం
గాజాలోకి ఇజ్రాయెల్ భూమార్గ దాడులు చేయడం, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, జపాన్‌లో సెంట్రల్ బ్యాంక్ సమావేశాలు ఉండడంతో ఆసియా షేర్లు సోమవారం పడిపోయాయి. జపాన్‌ వడ్డీ రేట్ల విధానం కఠినతరం కావచ్చు.

ఈ రోజు ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 66 పాయింట్లు లేదా 0.34 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,093 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: అదానీ గ్రీన్, DLF, TVS మోటార్, మారికో. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

రిలయన్స్‌: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), 2023-24 రెండో త్రైమాసికంలో నివేదించిన ఆర్థిక ఫలితాలు చాలా వరకు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. RIL నికర లాభంలో 27% వృద్ధి, ఆదాయం స్వల్పంగా పెరిగింది.

IDFC ఫస్ట్ బ్యాంక్: సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో IDFC ఫస్ట్ బ్యాంక్ రూ. 747 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది, ఇది సంవత్సరానికి (YoY) 32% పెరిగింది.

NTPC: ప్రభుత్వరంగ NTPC, సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఏకీకృత నికర లాభంలో సంవత్సరానికి 38% జంప్ చేసి రూ. 4,726 కోట్లను ప్రకటించింది.

IRB ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌: IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసోసియేట్ కంపెనీ, NHAI నుంచి 4,428 కోట్ల రూపాయలకు లెటర్ ఆఫ్ అవార్డ్‌ (LoA) పొందింది.

అల్ట్రాటెక్: బ్రౌన్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ మిశ్రమంతో ప్రొడక్షన్‌ కెపాసిటీని పెంచే దిశగా ఈ కంపెనీ బోర్డు క్యాపెక్స్‌ను ఆమోదించింది. ఇందుకోసం 13,000 కోట్ల పెట్టుబడి అవసరం.

ఫైజర్: సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఫైజర్ నికర లాభం రూ. 311 కోట్లుగా ఉంది. కంపెనీకి రూ. 575 కోట్ల ఆదాయం వచ్చింది.

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సెప్టెంబర్ త్రైమాసికంలో AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు రూ.402 కోట్ల నికర లాభం వచ్చింది. ఇదే కాలంలో NII రూ.1,249 కోట్లుగా ఉంది.

BEL: Q2 FY24లో రూ. 812 కోట్ల నెట్‌ ప్రాఫిట్‌ను BEL ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ.3993 కోట్ల ఆదాయం ఆర్జించింది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3,511 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే కాలంలో NII రూ.9,126 కోట్లుగా ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు – దీపావళి, ఛత్‌ పూజ సహా చాలా పండుగలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *