ఈ షేర్లు వచ్చే దీపావళి నాటికి మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి!, మోతీలాల్ ఓస్వాల్ రికమెండేషన్స్‌

[ad_1]

Stock Market News In Telugu: గత ఏడాది దీపావళి(Diwali 2023) నుంచి సంవత్ 2079 ప్రారంభమైంది, ఈ ఏడాది దీపావళితో అది ముగుస్తుంది. ఈ సంవత్సరం దీపావళి నుంచి సంవత్‌ 2080 ప్రారంభం అవుతుంది. 2022 దీపావళి – 2023 దీపావళి మధ్య, ఈ సంవత్సర కాలంలో స్టాక్ మార్కెట్ టైమ్‌ అద్భుతంగా ఉంది. సంవత్ 2079లో, నిఫ్టీ 20,000 మార్క్‌ను దాటింది, సెన్సెక్స్ 68,000 స్థాయిని టచ్‌ చేసింది. ఈ ఏడాది కాలంలో నిఫ్టీ 10 శాతం రాబడిని ఇవ్వగా, సెన్సెక్స్ కూడా దాదాపు 13.50 శాతం పెరిగింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో వరుసగా 30 శాతం, 36 శాతం జంప్ కనిపించింది.

స్టాక్ బ్రోకింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, స్టాక్ మార్కెట్ ఔట్‌లుక్‌ను, ఈ దీపావళి కోసం కొనదగిన స్టాక్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం, సంవత్ 2080 (2023 దీపావళి-2024 దీపావళి మధ్య కాలం) స్టాక్ మార్కెట్‌కు చాలా అనుకూలంగా ఉంటుందని బ్రోకరేజ్‌ భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సంవత్‌ 2080లో ఉన్నాయి. వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, ప్రపంచ దేశాల్లో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కూడా మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి. ప్రపంచ స్థాయి అనిశ్చితులు ఉన్నప్పటికీ, భారతదేశం ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ చెబుతోంది. 2022-23, 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో నిఫ్టీ కంపెనీల ఆదాయాల్లో 18 శాతం పెరుగుదల కనిపించవచ్చని అంచనా వేసింది. 

ప్రతి సంవత్సరం లాగానే, ఈ దీపావళికి కూడా మోతీలాల్ ఓస్వాల్ టాప్-10 స్టాక్‌ పిక్స్‌ను ప్రకటించింది. ఈ సంవత్సరం దీపావళి నాటికి వాటిని కొంటే, వచ్చే ఏడాది దీపావళి నాటికి మంచి రిటర్న్స్‌ ఇస్తాయని బ్రోకింగ్‌ కంపెనీ గట్టిగా నమ్ముతోంది. SBI, టైటన్, మహీంద్ర & మహీంద్ర, సిప్లా, ఇండియన్ హోటల్స్, దాల్మియా భారత్ వంటి స్టాక్స్‌ ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

మోతీలాల్ ఓస్వాల్ టాప్-10 స్టాక్‌ పిక్స్‌:

మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రకారం, దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI షేర్లు సంవత్ 2080లో రూ. 700 వరకు వెళ్లవచ్చు. ఈ ప్రకారం ఈ షేర్లు 22 శాతం రాబడిని ఇవ్వగలవు.

టైటన్‌కు సంవత్ 2079 అద్భుతంగా ఉంది, సంవత్ 2080లోనూ టైమ్‌ బాగుంటుందని భావిస్తున్నారు. ఈ స్టాక్ రూ.3900 వరకు వెళ్లవచ్చు, రానున్న రోజుల్లో ఈ స్టాక్ 19 శాతం రాబడి ఇచ్చే అవకాశం ఉంది.

ఆటోమొబైల్ రంగం నుంచి మోతీలాల్‌ ఓస్వాల్‌ సెలెక్ట్‌ చేసిన స్టాక్‌ మహీంద్ర & మహీంద్ర (M&M). ఈ స్టాక్ 19 శాతం జంప్‌తో రూ.1770 వరకు పెరగవచ్చని అంచనా వేసింది.

ఫార్మా రంగానికి చెందిన సిప్లా షేర్లను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు బ్రోకింగ్‌ హౌస్ సూచించింది. సిప్లా స్టాక్ రూ. 1450 వరకు వెళ్లవచ్చని చెబుతోంది. అంటే సంవత్ 2080లో ఈ షేర్లు తన పెట్టుబడిదార్లకు 21 శాతం రాబడిని ఇవ్వగలవు.

టాటా గ్రూప్ కంపెనీ అయిన ఇండియన్ హోటల్స్‌పై మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్‌గా ఉంది. బ్రోకరేజ్ హౌస్ ప్రకారం, ఇండియన్ హోటల్స్ స్టాక్‌ను 22 శాతం రాబడి, రూ.480 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. 

సంవత్ 2080 కోసం దాల్మియా భారత్, రేమండ్ స్టాక్స్‌ను కూడా మోతీలాల్ ఓస్వాల్ ఎంచుకుంది. దాల్మియా భారత్ షేర్లకు ఇచ్చిన టార్గెట్ ధర రూ.2800, రాబడి 33 శాతం. రేమండ్ స్టాక్‌ ఇచ్చిన టార్గెట్‌ ధర రూ.2600, రాబడి 38 శాతం.

కేన్స్ టెక్నాలజీ (Kaynes Technology), స్పందన స్పూర్తి (Spandana Sphoorty), రెస్టారెంట్ బ్రాండ్స్ ఏసియా (Restaurant Brands Asia) షేర్లను కూడా కొనుగోలు చేయవచ్చని మోతీలాల్ ఓస్వాల్ సూచించింది. కేన్స్ టెక్నాలజీ స్టాక్ రూ.3100 వరకు వెళ్లొచ్చని, 26 శాతం రాబడిని ఇవ్వగలదని బ్రోకరేజ్‌ లెక్కగట్టింది. స్పందన స్ఫూర్తి 22 శాతం జంప్‌తో రూ. 1100కి చేరుకుంటుందని చెప్పింది. రెస్టారెంట్ బ్రాండ్స్‌ ఏసియా షేర్లు 16 శాతం ర్యాలీతో రూ.135కి చేరుకుంటాయని అంచనా వేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: కార్పొరేట్‌ చరిత్రలోనే తొలిసారి డేరింగ్‌ డెసిషన్‌, ఒక్క నిర్ణయంతో ₹20,000 కోట్లు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *