[ad_1]
Salaries of Startup Founders in 2023: కొన్నేళ్లుగా స్టార్టప్ సెక్టార్‌లో కొనసాగుతున్న బూమ్ 2023లోనూ కంటిన్యూ అయింది. దీనివల్ల అంకుర సంస్థలు (start-ups) ఈ ఏడాది కూడా కొత్త రికార్డులు సృష్టించాయి. ఆ కంపెనీలే కాదు, కోట్ల కొద్దీ సంపాదనతో వాటి వ్యవస్థాపకులు (startup founders) కూడా వార్తల్లోకి ఎక్కారు.
ప్రస్తుతం 2023 సంవత్సరం చివరిలో ఉన్నాం. ఈ సందర్బంగా, వివిధ కంపెనీలు తమ ఆర్థిక నివేదికలను విడుదల చేశాయి. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న అంకుర సంస్థల ఆర్థిక స్థితి ఎంత బలంగా ఉందో ఆ రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. అంతేకాదు, వాటి ఫౌండర్ల జీతాలను కూడా ఆ రిపోర్ట్స్‌లో వెల్లడించారు. ఈ సంవత్సరం అత్యధికంగా సంపాదిస్తున్న అంకుర సంస్థల వ్యవస్థాపకుల లిస్ట్‌లో కామత్ బ్రదర్స్ నుంచి ఫల్గుణి నాయర్ వరకు ఉన్నారు.
భారీగా ఆర్జించిన స్టార్టప్ ఫౌండర్ (Highest paid startup founder)
చాలా స్టార్టప్‌ల వ్యవస్థాపకులు భారీగా జీతాలు తీసుకుంటున్నారని వివిధ కంపెనీల రిపోర్ట్స్‌ను బట్టి తెలుస్తోంది. జీరోధ (Zerodha) ఫౌండర్లు నితిన్ కామత్ & నిఖిల్ కామత్ (Nitin Kamat & Nikhil Kamat) కలిసి ఈ సంవత్సరం 200 కోట్ల రూపాయలను ఇంటికి తీసుకువెళ్లారు. ఇందులో, ఈ సోదరులిద్దరి జీతం తలో రూ.72 కోట్లు. ఇదే కంపెనీ CEOగా ఉన్న నితిన్ కామత్ భార్య సీమా పాటిల్ వార్షిక వేతనం రూ. 36 కోట్లు.
విశేషం ఏంటంటే, ఎక్కువగా ఆర్జిస్తున్న స్టార్టప్ ఫౌండర్లలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న కామత్ బ్రదర్స్‌కు, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న వ్యక్తులకు.. ఆర్జనలో నక్కకు-నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.
హైయెస్ట్ పెయిడ్ స్టార్టప్ ఫౌండర్స్ లిస్ట్‌లో ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (OYO Founder Ritesh Agarwal) రెండో స్థానంలో నిలిచారు. అతని జీతం ఏడాదికి రూ.12 కోట్లు.
నైకాను స్థాపించిన ఫల్గుణి నాయర్ (Nykaa Founder Falguni Nair) ఈ ఏడాది కేవలం 2 కోట్ల రూపాయల జీతం తీసుకున్నారు. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఆమె కూడా ఒకరు.
ఈ ఏడాది అత్యధిక జీతం తీసుకుంటున్న స్టార్టప్ వ్యవస్థాపకులు (Highest paid startup founders in 2023)
నిఖిల్ కామత్ & నితిన్ కామత్ (Zerodha) – తలో రూ.72 కోట్లు
రితేష్ అగర్వాల్ – (OYO) రూ. 12 కోట్లు
దీపక్ సింగ్ అహ్లావత్ (Gamecraft) – రూ. 10.1 కోట్లు
మనీష్ తనేజా, రాహుల్ డాష్ (Purplle) – రూ. 6.75 కోట్లు
విజయ్ శంకర్ శర్మ (Paytm) – రూ. 4 కోట్లు
సాహిల్ బారువా & కపిల్ భారతి (RateGain) – రూ. 3.1 కోట్లు
గౌరవ్ సింగ్ కుష్వాహ (BlueStone) – రూ. 3 కోట్లు
మిథున్ సచేతి (CaratLane) – రూ. 2.62 కోట్లు
అమన్ గుప్తా & సమీర్ మెహతా (boAt) – రూ. 2.5 కోట్లు
విపరీతమైన నిధులు ఉన్నా 29 వేల మందికి పింక్ స్లిప్
పై లిస్ట్‌లో ఉన్న వాళ్లు మాత్రమే కాకుండా… హెల్దీఫైమి (HealthifyMe), లెన్స్‌కార్ట్ (Lenskart), నాయిస్ (Noise), మామాఎర్త్ (Mamaearth) వ్యవస్థాపకులు & CEOలు కూడా ఈ సంవత్సరం మంచి వేతనాలను అందుకున్నారు. Inc42 రిపోర్ట్ ప్రకారం, ఈ సంవత్సరం 42 స్టార్టప్‌ల ఫౌండర్లు కలిసి సుమారు రూ.228 కోట్ల జీతం డ్రా చేశారు. అంతేకాదు, ఆయా అంకుర సంస్థలకు విపరీతమైన ఫండ్స్ కూడా వచ్చాయి. కానీ, ఈ కంపెనీలు ఇప్పటికే దాదాపు 29 వేల మంది ఉద్యోగులను తొలగించాయి.
మరో ఆసక్తికర కథనం: షాక్ మీద షాక్ ఇస్తున్న గోల్డ్ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
[ad_2]
Source link
Leave a Reply