ఎక్కువ ట్రేడింగ్ ఖాతాలను ఒకే డీమ్యాట్ అకౌంట్‌తో లింక్ చేయొచ్చా?

[ad_1]

Demat Account: గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) స్టాక్‌ మార్కెట్‌ అద్భుతమైన లాభాలు ఇచ్చింది. ఆ ఏడాది కాలంలో సెన్సెక్స్ 25 శాతానికి పైగా లాభపడగా, నిఫ్టీ 28 శాతానికి పైగా పెరిగింది. స్టాక్ మార్కెట్‌లోని ఈ సూపర్‌ ర్యాలీ కొత్త ఇన్వెస్టర్లను అమితంగా ఆకర్షిస్తోంది. 

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలంటే డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతా అవసరం. ఇవి లేకుండా పెట్టుబడి పెట్టలేరు, ట్రేడ్‌ చేయలేరు. డీమ్యాట్ ఖాతా ద్వారా… ఫైనాన్షియల్‌ సెక్యూరిటీలను ప్రామాణిక ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో దాచుకోవచ్చు. డీమ్యాట్ ఖాతా లేకుండా స్టాక్స్‌, బాండ్లు, డెరివేటివ్స్‌, కరెన్సీ, కమోడిటీ వంటి విభాగాల్లో ట్రేడ్‌ చేయలేరు. IPO ద్వారా షేర్లు పొందాలన్నా డీమ్యాట్ ఖాతా ఉండాలి.

డీమ్యాట్ ఖాతా కాకుండా మరొక ఖాతా ఉంది, దాని పేరు ట్రేడింగ్ అకౌంట్‌. ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడ్‌ రెండూ ఒకేలా కనిపించినా, కొంత తేడా ఉంది. ట్రేడింగ్ అంటే.. తక్కువ వ్యవధి కోసం షేర్లను కొనుగోలు చేసి విక్రయించే పద్ధతి. తక్షణ లాభాల కోసం చేసే పని ఇది. ఇలా కాకుండా, షేర్లను కొనుగోలు చేసి ఎక్కువ కాలం వాటిని హోల్డ్‌ చేస్తే, దానిని పెట్టుబడి అంటారు. మార్కెట్‌లో ట్రేడ్‌ చేయడానికి ట్రేడింగ్ అకౌంట్‌ అవసరం. 

నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (CDSL) ద్వారా డీమ్యాట్ ఖాతా ఓపెన్‌ చేయవచ్చు. 

ఎక్కువ ట్రేడింగ్ ఖాతాలను ఒకే డీమ్యాట్ అకౌంట్‌తో లింక్ చేయొచ్చా?
ఒక ట్రేడర్‌కు ఒకటి కంటే ఎక్కువ ట్రేడింగ్ ఖాతాలు ఉంటే, అతను ఆ ఖాతాను తన సింగిల్ డీమ్యాట్ ఖాతాకు లింక్ చేయవచ్చు. కాకపోతే ఈ కేస్‌లో కొన్ని పరిమితులు ఉంటాయి. మీ డీమ్యాట్ ఖాతాను బ్యాంక్‌ ద్వారా ఓపెన్‌ చేసి, డిస్కౌంట్ ఆధారంగా స్టాక్ బ్రోకర్‌ని ఎంచుకున్నట్లయితే, ఇలాంటి పరిస్థితిలో ఆ రెండు ఖాతాలను లింక్ చేయడం సాధ్యం కాదు. అయితే.. ఆ డీమ్యాట్ ఖాతాను లింక్ చేయడానికి మీ స్టాక్ బ్రోకర్ అనుమతిస్తే, మీరు ఆ పనిని పూర్తి చేయవచ్చు. చాలా మంది స్టాక్ బ్రోకింగ్‌ కంపెనీలు ఎక్కువ ట్రేడింగ్ ఖాతాలను డీమ్యాట్ ఖాతాతో లింక్ చేయడానికి అనుమతిస్తున్నాయి. అయితే ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను లింక్ చేసే ప్రక్రియ సుదీర్ఘంగా, కాస్త గజిబిజిగా ఉంటుంది.

ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలు ఉండొచ్చా?
ఏ పెట్టుబడిదారైనా తన అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలు కలిగి ఉండొచ్చు. సెబీ నిబంధనల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలను తెరవొచ్చు. ప్రతి ఖాతాలో KYC ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి.

గత ఆర్థిక సంవత్సరంలో కోట్లాది కొత్త డీమ్యాట్ ఖాతాలు
2023-24 ఆర్థిక సంవత్సరంలో, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ రెండింటిలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 15.14 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఈ సంఖ్య 11.45 కోట్లుగా ఉంది. అంటే, గత ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం దాదాపు 3.7 కోట్ల కొత్త డీమ్యాట్ ఖాతాలు ఓపెన్‌ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.9 శాతం వృద్ధి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: రూ.5,000 కోట్ల ఐపీవో, సెబీ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌, గేట్లు ఎత్తడమే ఇక మిగిలింది!

మరిన్ని చూడండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *