ఎలక్ట్రిక్ బైక్‌ల వల్ల కలిగే ఈ ఐదు లాభాలు తెలుసా – తెలిశాక కొనకుండా ఉండలేరు మరి!

[ad_1]

Benefits of Electric Bike: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ చాలా వేగంగా పెరిగింది. పెరుగుతున్న కాలుష్యం, పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలదే ఫ్యూచర్ అని అందరూ అంటున్నారు. దీంతో పాటు మెట్రో నగరాల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించడానికి, గ్రీన్ ఎనర్జీ ద్వారా నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఈ వాహనాల కొనుగోలుపై వినియోగదారులకు అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్ కొంటే ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసా!

ఎలక్ట్రిక్ బైక్‌లు సైలెంట్‌గా పని చేస్తాయి
సాధారణ బైక్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ బైక్ చాలా తక్కువ శబ్దం చేస్తుంది. ఎందుకంటే వీటిలో ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజిన్ ఉండదు. దీని కారణంగా ఎటువంటి శబ్దం లేదా వైబ్రేషన్ ఉండదు. అందుకే అందులో ఎగ్జాస్ట్ కూడా లేదు. దీన్ని నడపడానికి కేవలం ఎలక్ట్రిక్ మోటారు మాత్రమే ఉపయోగిస్తారు.

గొప్ప ఫీచర్లను పొందండి
చాలా ఎలక్ట్రిక్ బైక్‌లు సాధారణ బైక్‌ల కంటే అధునాతన ఫీచర్‌లతో కూడిన ఫ్యూచరిస్టిక్ డ్యాష్‌బోర్డ్‌ను పొందుతాయి. అలాగే ఈ బైక్ వినియోగదారుల స్మార్ట్‌ఫోన్‌తో కూడా కనెక్ట్ అవుతుంది. తద్వారా దానిలోని అనేక ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఇందులో కనిపించే GPS ద్వారా మీరు మీ బైక్‌ను భారీ గుంపులో కూడా సులభంగా కనుగొనవచ్చు.

తక్కువ మెయింటెయిన్స్ ఖర్చు
చాలా మోడళ్లలో గేర్లు లేనందున ఎలక్ట్రిక్ బైక్‌లు నడపడం సులభం. ఇది రైడర్‌కు థ్రోటిల్‌ను సులభతరం చేస్తుంది. ఇందులో ఫ్యూయెల్ ఇంజన్ లేనందున మెయింటెనెన్స్ అవసరం లేదు. సాధారణ బైక్‌లో ఇంజిన్ ఆయిల్ మార్పు, స్పార్క్ ప్లగ్, మోటార్, క్లచ్ లేదా గేర్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటిలో మీరు బ్యాటరీ, టైర్ మెయింటెయిన్స్‌ను  ఉంచాలి.

భారీ పన్ను మినహాయింపు పొందండి
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపును అందిస్తుంది. ఎలక్ట్రిక్ బైక్‌లు కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ, వాటికి 12 శాతంకి బదులుగా ఐదు శాతం మాత్రమే పన్నును విధించనున్నారు. సెక్షన్ 80EEB కింద కూడా మీరు EV లోన్‌పై రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలకు బీమా అవసరం లేదు
250W పవర్‌లోపు, గరిష్ట వేగం 25 kmph కంటే తక్కువ ఉన్న ఈ-బైక్‌ మోడల్స్ కోసం, మీరు ఎటువంటి ద్విచక్ర వాహన బీమా తీసుకోవలసిన అవసరం లేదు. ప్రస్తుతం చాలా ఈ-బైక్‌ల గరిష్ట వేగం గంటకు 25-45 కిలోమీటర్ల మధ్యలో ఉంది. దీని కోసం థర్డ్ పార్టీ టూ వీలర్ ఇన్సూరెన్స్ కూడా సరిపోతుందని భావిస్తున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ కారును కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ కారు గురించిన స్పెసిఫికేషన్లను ఓలా రివీల్ చేయలేదు. భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగిన ఈవెంట్‌లో ఈ కారును కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. మనదేశంలో రూపొందిన స్పోర్టియస్ట్ కారు ఇదే అని సీఈవో భవీష్ అగర్వాల్ అన్నారు. 2024లో ఈ కారు లాంచ్ కానుంది.

ఈ కారు గురించి కేవలం రెండు వివరాలు మాత్రమే రివీల్ అయ్యాయి. దీని రేంజ్ 500 కిలోమీటర్లు, 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం నాలుగు సెకన్లలోనే అందుకోనుంది. పోటీగా ఉన్న కార్లను చూస్తే టాటా నెక్సాన్ ఈవీ 437 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 9.4 సెకన్లలో అందుకోనుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *