ఏడు సీటర్ల ఎస్‌యూవీలు కొనాలనుకుంటున్నారా – ప్రస్తుతం మనదేశంలో ఎక్కువ డిమాండ్ వీటికే!

[ad_1]

Best Selling SUVs of 2023: భారతదేశంలో SUV కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి, దీనికి అతిపెద్ద కారణం వాటి లుక్స్, ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, అద్భుతమైన పనితీరు. గత నెలలో కూడా ఈ కార్లు మంచి సంఖ్యలో అమ్ముడయ్యాయి.

మహీంద్రా బొలెరో
2023 ఫిబ్రవరిలో మహీంద్రా తన బొలెరోకి సంబంధించింది 9,782 యూనిట్లను విక్రయించింది. 2022 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 11,045 యూనిట్లుగా ఉంది. బొలెరో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందనుంది. ఇది 75 bhp శక్తిని, 210Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో బొలెరో నియో ఇంజన్ 100 bhp శక్తిని, 240 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌ను పొందుతుంది. బొలెరో ఎక్స్-షోరూమ్ ధర రూ.9.78 లక్షల నుంచి రూ. 10.79 లక్షల మధ్య ఉండగా, బొలెరో నియో సెవెన్ సీటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.63 లక్షల నుంచి రూ. 12.14 లక్షల మధ్య ఉంది.

మహీంద్రా స్కార్పియో
మహీంద్రా స్కార్పియో 2023 ఫిబ్రవరిలో మొత్తం 6,950 యూనిట్లు అమ్ముడు పోయింది. గత ఏడాది ఇదే నెలలో 2,610 యూనిట్లు విక్రయించింది. స్కార్పియో ఎన్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2L టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను పొందుతుంది. ఇవి వరుసగా 132 bhp/300 Nm, 175bhp/370 Nm (MT)/400 Nm (AT), 203bhp, 370Nm (MT) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. మరోవైపు స్కార్పియో క్లాసిక్ 2.2 లీటర్ జెన్ 2 ఎంహాక్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 132 bhp, 300 Nm అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.74 లక్షల నుంచి రూ. 24.05 లక్షల మధ్య ఉండగా, స్కార్పియో క్లాసిక్ ధర రూ. 12.64 లక్షల నుంచి రూ. 16.14 లక్షల మధ్య ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700
2023 ఫిబ్రవరిలో మహీంద్రా తన ఎక్స్‌యూవీ 700 మోడల్‌కు సంబంధించి 4,505 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 4,138 యూనిట్లు విక్రయించింది. ఎక్స్‌యూవీ 700 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజన్ ఎంపికను పొందుతుంది. ఇవి వరుసగా 380 Nm / 200 bhp, 360 Nm / 185 bhp అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.45 లక్షల నుంచి రూ. 25.48 లక్షల మధ్యలో ఉంది.

టయోటా ఫార్చ్యూనర్
టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ గత నెలలో 3,426 యూనిట్లు అమ్ముడుపోయింది. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,848 యూనిట్లుగా ఉంది. సెవెన్ సీటర్ ఎస్‌యూవీ 2.7 లీటర్ పెట్రోల్ (166 bhp / 245 Nm), 2.8 లీటర్ డీజిల్ (204 bhp / 420 Nm) ఇంజన్ ఆప్షన్లను పొందుతుంది. ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 32.59 లక్షల నుంచి రూ. 50.34 లక్షల మధ్య ఉంది.

హ్యుందాయ్ అల్కజార్
2023 ఫిబ్రవరిలో హ్యుందాయ్ తన ఆల్కజార్‌కు సంబంధించి 1,559 యూనిట్లను విక్రయించింది. 2022 ఫిబ్రవరిలో ఈ కారు 2516 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.71 లక్షల నుంచి రూ. 21.10 లక్షల మధ్యలో ఉంది. ఇది 2.0 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 159 bhp, 192 Nm అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాని 1.5 లీటర్, 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ 115 bhp శక్తిని, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *