PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఏపీలో జగన్ ముందస్తు వ్యూహంలో ఉన్నారా? మరోసారి సారు కారు గేర్ మార్చాల్సిందేనా?

[ad_1]

Top 10 Headlines Today:

ముందస్తు ఖాయమా?

తెలంగాణతో పాటు ముందస్తు ఎన్నికలు ఏపీకి కూడా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. దానికి తగ్గట్లుగానే సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అక్టోబర్‌లో షెడ్యూల్ .. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ ఉండే అవకాశం ఉంది. ఏపీ కూడా కలిస్తే ఆరో రాష్ట్రం అవుతుంది. లేకపోతే పార్లమెంట్ ఎన్నికలతో పాటు మార్చిల మార్చిలో ఎన్నికలు జరుగుతాయి. సీఎం జగన్ పార్లమెంట్ తో పాటు ఎన్నికలు జరగితే తన పథకాల అజెండాగా ఓట్లు అడగలేమని.. అప్పుటు టాపిక్ మారిపోతుందన్న ఉద్దేశంలో ఉన్నారని చెబుతున్నారు. అందుకే అసెంబ్లీకి ప్రత్యేకంగా ఎన్నికలు జరగాలని.. అందు కోసం ఐదారు నెలల ముందు అయినా  పర్వాలేదనుకుంటున్నారని  చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

గేర్ మారుస్తారా?

మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల తర్వాత..  ఏం జరిగిందో కానీ..  కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా వరకూ సైలెంట్ అయ్యాయి. తెలంగాణలో పెద్దగా సోదాలు చేయలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల జోలికి వెళ్లలేదు. నిజానికి మల్లారెడ్డి ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో చాలా అక్రమాలు బయటపడ్డాయని.. మనీలాండరింగ్ జరిగిందని ఐటీ శాఖ ఈడీకి కూడా లేఖ రాసింది. కానీ ఈడీ ఇప్పటి వరకూ స్పందించలేదు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజీ కుదిరిందని అందుకే సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా ఇప్పుడు మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణలో విరుచుకుపడుతున్నాయి. దీంతో మళ్లీ కేసీఆర్ యుద్ధం ప్రకటించే సమయం వచ్చిందా అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రారంభమయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

త్వరలోనే సభ 

ఖమ్మంలో త్వరలోనే బహిరంగసభ పెడతామని కార్యకర్తలు ఎవరూ నిరాశపడవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.  గురువారం ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశామని మీడియాకు తెలిపారు.  గుజరాత్, మహారాష్ట్రలో భారీ ఎత్తున వర్షాలు వస్తుండటంతో బహిరంగ సభను వాయిదా వేశామన్నారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా 24 గంటలపాటు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున అనివార్య కారణాల వల్ల బహిరంగ సభకు రాలేకపోతున్నారని తెలిపారు.  ఎన్డీఆర్ఎఫ్ దళాలను ఇప్పటికే తుఫాన్ బాధిత ప్రాంతాలకు పంపారని.. రైళ్లన్నీ రద్దు చేశారు. దాదాపు 50 వేల మందిని ఆ ప్రాంతాల నుండి తరలించారన్నారు.  దీనిని దృష్టిలో  ఉంచుకుని రేపటి పరిస్థితిని అంచనా వేశామన్నారు.  ఈ విపత్కర సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సముచితం కాదనే నిర్ణయానికి వచ్చామని బండి సంజయ్ తెలిపారు. ఇప్పటికే  బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని..  పార్టీ సీనియర్ నేతలంతా అక్కడే మకాం వేశారు. పెద్ద ఎత్తున జనం వచ్చేందుకు సిద్ధమని కూడా తెలిపారు. అయినా అనివార్య కారణాలతో సభ రద్దు అయిందన్నారు.  అతి త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించడం ఖాయం. కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దని కార్యకర్తలకు సూచించారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఆపేదెవరు?

వచ్చే ఎన్నికల తర్వాత తాను అసెంబ్లీలో ఎలా అడుగు పెట్టనో చూద్దామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సవాలు విసిరారు. కచ్చితంగా జనసేన పాదముద్ర అసెంబ్లీలో పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తే కక్ష కట్టి, తనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వొద్దనే ఉద్దేశంతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో లక్ష ఓట్లు ఉంటే, మొత్తం లక్షా 8 వేల ఓట్లు పోలయ్యాయని అన్నారు. జనసేన పార్టీ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్రలో భాగంగా తొలి బహిరంగ సభను కాకినాడ జిల్లా కత్తిపూడి (Kattipudi) లో నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార వైఎస్ఆర్ సీపీపై విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

సీబీఐకి తమిళనాడులోకి నో ఎంట్రీ  

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు తమ సాధారణ అనుమతిని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇస్తేనే సీబీఐ రాష్ట్రంలోకి రావాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దాంతో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్‌ రాష్ట్రాల బాటలో తమిళనాడు నడుస్తున్నట్లు అయింది. తమిళనాడు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఏదైనా దర్యాప్తు చేయడానికి ముందు సీబీఐ ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఒత్తిడి లేకుండా చదివా

పోటీ పరీక్షలు అంటేనే విద్యార్థులతో పాటు అభ్యర్థులలో విపరీతమైన ఒత్తిడి. ర్యాంక్ ల కోసం గంటల తరబడి చదివేస్తుంటారు. కానీ అలా ఒత్తిడికి దూరంగా చదివితే ఊహించని స్థాయిలో మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు బొర్రా వరుణ్ చక్రవర్తి. తాజాగా విడుదలైన NEET ఫలితాల్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొర్రా వరుణ్ చక్రవర్తి. నీట్ పరిక్షల కోసం ప్రెపరేషన్ ఎలా జరిగింది. ఎంత సమయం కేటాయించారు. తోటి విద్యార్దులకు ఏం చెప్పబోతున్నారంటూ వరుణ్ ని పలకరించింది ABP దేశం. ఈ సందర్బంగా ఏబీపీ దేశంతో మాట్లడుతూ అందరూ తాను రోజుకు ఎన్నిగంటలు చదివానంటూ అడుగుతున్నారని, అలా గంటల తరబడి తాను చదవలేదని ,చదివిన సమయం మాత్రం ఏకాగ్రతతో చదివానని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బిపర్‌జోయ్‌ ముప్పు

ప్రస్తుతం దేశంలోని పశ్చిమ తీర ప్రాంతాల్లో ‘బిపర్‌ జోయ్’ తుపానుపై హెచ్చరిక కొనసాగుతోంది. తుపాను సమయంలో బలమైన గాలులు వీయడం, వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. ముంబయి, గోవా, పోర్‌ బందర్‌, కరాచీ సహా పరిసర ప్రాంతాలపై తుపాను ప్రభావం చూపవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాను ఇదేనని వాతావరణ శాఖ చెబుతోంది. సముద్రంలో ఏం జరుగుతుందో, అటువంటి భీకర తుఫానులు తరచుగా ఎందుకు ఏర్పడతాయి, ఆపై భూమిపైకి వచ్చి ఎందుకు విధ్వంసం సృష్టిస్తాయి? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఏపీలో స్పెషల్ షోలు

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైతలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ మరికొన్ని గంటల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో మొట్టమొదటిసారి ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించగా, కృతి సీత పాత్రలో కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఓంరౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా యూనిట్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం

ఇండోనేసియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లారు. తెలుగుతేజం పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, ప్రియాన్షు రాజావత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్ అదరగొట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అమ్మో హైదరాబాద్‌ ఇల్లే!

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దిల్లీ, పుణె, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి నగరాల్లో 2023 తొలి మూడు నెలల్లో ఎనిమిది శాతం పెరిగాయి. టాప్‌ డెవలపర్లు కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టినప్పటికీ డిమాండ్‌ బాగుందని క్రెడాయి, కొలియెర్స్‌, లియాసెస్‌ ఫోరాస్‌ జాయింట్‌ రిపోర్టు నివేదించింది. వార్షిక ప్రాతిపదికన దిల్లీ-నోయిడా ప్రాంతంలో రెసిడెన్షియల్‌ ఇళ్ల ధరలు 16 శాతం పెరిగాయి. కోల్‌కతా (15%), బెంగళూరు (14%) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *