ఐటీఆర్‌-1 నుంచి ఐటీఆర్‌-7 వరకు ఉన్నాయి, సరైన ఫామ్‌ ఎంచుకోండి

[ad_1]

Income Tax Return Filing 2024: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 లేదా మదింపు సంవత్సరం 2024-25లో… 2024 ఏప్రిల్‌ 01 నుంచే ఆదాయ పన్ను పత్రాలు (ITR) సమర్పించవచ్చు. ఇందుకోసం, ITR-2, ITR-3, ITR-5 ఫామ్స్‌ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఫిబ్రవరి 02న నోటిఫై చేసింది. దీనికి ముందే, ITR-1, ITR-4, ITR-6 ఫామ్స్‌ను కూడా నోటిఫై చేసింది. దీంతో, టాక్స్‌పేయర్ల కోసం ITR-1 నుంచి ITR-6 వరకు పత్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. IT రిటర్న్‌ ఎంత త్వరగా సమర్పిస్తే, TDS రూపంలో అదనంగా చెల్లించిన ఆదాయ పన్ను అంత త్వరగా మీ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది.

నిర్దేశిత ఆదాయం కంటే ఎక్కువ సంపాదిస్తున్న ప్రతి వ్యక్తి ఆదాయ పన్ను కట్టడం తప్పనిసరి. ఆదాయ పన్ను విభాగం ఇప్పటి వరకు ITR 1, ITR 2, ITR 3, ITR 4, ITR 5, ITR 6, ITR 7 ఫారాలను ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తి ఆదాయ వనరులు, గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తం, పెట్టుబడులు, విభాగం వంటి అంశాల ఆధారంగా సరైన ఫారాన్ని టాక్స్‌పేయర్‌ సమర్పించాలి. 

ఏ ఐటీఆర్‌ ఫారాన్ని ఎంచుకోవాలి?

ITR-1 లేదా సహజ్: భారతదేశంలో సాధారణ నివాసితుడైన వ్యకి (Individual‌) మొత్తం ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలు దాటకపోతే ITR 1 ఫామ్ సమర్పించాలి. ఆ వ్యక్తి తీసుకున్న జీతం, ఒక నివాస గృహం ఆదాయం, ఇతర ఆదాయాలు అంటే రూ. 5,000 వరకు వ్యవసాయ ఆదాయం, వేరొక వ్యక్తి ఆదాయం (జీవిత భాగస్వామి లేదా సంతానం) పన్ను చెల్లింపుదారు ఆదాయంలో కలిసి ఉండడం వంటివి ITR 1 కిందకు వస్తాయి.

ITR-2: ఒక వ్యకి లేదా హిందు అవిభాజ్య కుటుంబానికి (HUF) వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు ఆర్జించని పక్షంలో ఈ ఫామ్‌ ఉపయోగించాలి. నాన్ రెసిడెంట్లకు, సాధారణ నివాసితులకు, సాధారణ నివాసితులు కాని వారికి ఇది వర్తిస్తుంది. మొత్తం రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు, కంపెనీల డైరెక్టర్లు, లిస్ట్‌ కాని కంపెనీల్లో పెట్టుబడి పెట్టేవాళ్లతో పాటు, జీతాలు, ఒకటి కంటే ఎక్కువ నివాస గృహాల నుంచి ఆదాయం, మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు ఈ ఫామ్‌ ఎంచుకోవాలి. భారతదేశం వెలుపల ఉన్న ఆస్తులు లేదా సంపాదన ఉన్న వ్యక్తులకు కూడా ఇదే వర్తిస్తుంది.

ITR-3: వ్యాపారం లేదా వృత్తి నుంచి లాభాలు, ఆదాయం కలిగిన వ్యక్తి లేదా HUF ఈ ఫామ్‌ను ఎంచుకోవాలి.

ITR-4 సుగమ్‌: వ్యక్తి, HUF, సంస్థ (LLP మినహాయించి) మొత్తం ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉండి; వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం ఆదాయ పన్ను సెక్షన్లు 44AD, 44ADA లేదా 44AE ప్రకారం లెక్కించే సందర్భంలో ITR-4 ఎంచుకోవాలి. 

ITR-5: ఒక వ్యక్తి, HUF, కంపెనీ కాకుండా, ITR-7ను దాఖలు చేసే వారికి ఇది వర్తిస్తుంది.

ITR-6: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 11 కింద మినహాయింపును క్లెయిమ్ చేయని సంస్థలు ఈ ఫామ్‌ను ఉపయోగించాలి.

ITR-7: ఆదాయపు పన్ను చట్టంలోని 139(4A), 139(4B), 139(4C), లేదా 139(4D) సెక్షన్ల కింద రిటర్న్‌లు ఫైల్ చేసే సంస్థలు ITR-7 ఎంచుకోవాలి. ధార్మిక లేదా మతపరమైన ట్రస్ట్‌, రాజకీయ పార్టీ, శాస్త్రీయ పరిశోధన సంఘం, వార్తా సంస్థ, ఆసుపత్రి, ట్రేడ్ యూనియన్‌, విశ్వవిద్యాలయం, కళాశాల, ఏదైనా NGO వంటివి ఈ పరిధిలోకి వస్తాయి.

మరో ఆసక్తికర కథనం: రిటర్న్‌ ఫైలింగ్‌లో పాత పద్ధతి బెటరా, కొత్త పద్ధతి బెటరా? సింపుల్‌గా డిసైడ్‌ చేయొచ్చు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *