[ad_1]
HDFC Twins: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం (05 మే 2023) భారీ పతనంతో ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్ 6 శాతం వరకు నష్టపోయాయి. NSE నిఫ్టీ 187 పాయింట్లు తగ్గి 18,069 పాయింట్ల వద్ద; BSE సెన్సెక్స్ 695 పాయింట్లు తగ్గి 61,054 వద్ద ముగిశాయి. ఈ రెండూ 1% పైగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ ఏకంగా చివరికి 1024 పాయింట్లు లేదా 2.34% పతనమై 42,661 వద్ద క్లోజైంది.
గురువారం అలా – శుక్రవారం ఇలా..
నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ పతనంలో HDFC, HDFC బ్యాంక్ షేర్లు అతి పెద్ద పాత్ర పోషించాయి. బెంచ్‌మార్క్ ఇండీస్‌లో ఇవి రెండూు హెవీవెయిట్‌లు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్‌లో భారీ పతనం కారణంగా, బ్యాంక్ నిఫ్టీ ఒకే సెషన్‌లో 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. ఒక్కరోజు ముందు, గురువారం నాడు రికార్డు స్థాయిలో ముగిసిన షేర్లు మరుసటి రోజే ఇంత పెద్ద ట్విస్ట్ ఇవ్వడానికి కారణం ఏమిటన్నది ఇన్వెస్టర్లలో ఉన్న సందేహం.
తగ్గనున్న వెయిటేజీ – ఔట్‌ఫ్లోస్
HDFC, HDFC బ్యాంక్ విలీన ప్రక్రియ (HDFC – HDFC Bank merger) వేగంగా సాగుతోంది. ఈ రెండు ఆర్థిక సంస్థల విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కలిసిపోతుంది. విలీనం తర్వాత కొత్త గణాంకాలతో అవతరించే HDFC బ్యాంక్‌ను 0.5 శాతం సర్దుబాటు కారకంతో MSCI గ్లోబల్ స్టాండర్డ్స్ ఇండెక్స్ లార్జ్ క్యాప్ విభాగంలోకి మారుస్తారన్న వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్‌ను విక్రయాలు ముంచెత్తవచ్చు, దాదాపు 150 నుంచి 200 మిలియన్ డాలర్ల పెట్టుబడుల బయటకు వెళ్లిపోవచ్చు.
వాస్తవానికి, విలీన అనంతరం HDFC బ్యాంక్‌ను 1 శాతం సర్దుబాటు కారకంతో ఇండెక్స్‌లో చేర్చుస్తారని మార్కెట్ భావించింది. ఇది జరిగి ఉంటే, HDFC బ్యాంక్ స్టాక్‌లోకి 3 బిలియన్ డాలర్ల వరకు కొత్త పెట్టుబడులు వచ్చేవి. దీనికి రివర్స్‌లో జరగడంతో మార్కెట్ నెగెటివ్‌గా రియాక్ట్ అయింది.
ప్రస్తుతం MSCI ఇండియా ఇండెక్స్‌లో HDFCకి 6.74 శాతం వెయిటేజీ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆ ఇండెక్స్‌లో బరువు 6.5 శాతానికి తగ్గుతుంది. MSCI గ్లోబల్ స్టాండర్డ్స్ ఇండెక్స్‌లో ఒక కంపెనీ వెయిటేజీ ఆధారంగా విదేశీ పెట్టుబడిదార్లు ఆ స్టాక్‌లో పెట్టుబడి పెడతారు. వెయిటేజీ పెరిగితే విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి, వెయిటేజీ తగ్గితే విదేశీ పెట్టుబడులు తగ్గుతాయి.
షేర్లలో భారీ పతనం తర్వాత, శుక్రవారం, హెచ్‌డీఎఫ్‌సీ స్టాక్ 5.63 శాతం క్షీణించి రూ. 2701 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ 5.90 శాతం క్షీణించి రూ. 1625 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్ నిన్ననే రూ. 1734 వద్ద జీవిత కాల గరిష్టాన్ని తాకింది. శుక్రవారం పతనం తర్వాత దీని మార్కెట్ విలువ రూ. 9.07 లక్షల కోట్లకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ క్యాప్ రూ. 4.95 లక్షల కోట్లకు తగ్గింది.
హెచ్‌డీఎఫ్‌సీ కవలల విలీనం తర్వాత, HDFC బ్యాంక్ దేశంలో రెండో అతి పెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply