ఒత్తిడి పెంచిన గ్లోబల్‌ మార్కెట్లు – 72k మార్క్‌ కోల్పోయిన సెన్సెక్స్‌, 21,700 కింద నిఫ్టీ

[ad_1]

Stock Market News Today in Telugu: గ్లోబల్‌ ఒత్తిళ్ల మధ్య, కొత్త వారంలో ఇండియన్‌ మార్కెట్లు ఓపెన్‌ అయ్యాయి. మార్కెట్లు పాజిటివ్‌గానే ప్రారంభమైనా ఆ వెంటనే కిందకు జారిపోయాయి. 21,750 సమీపంలో ప్రారంభమైన నిఫ్టీ, 72,000 పైన స్టార్టయిన సెన్సెక్స్‌ ఆ పట్టును కోల్పోయాయి. ఓపెనింగ్ సెషన్‌లో.. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల్లో పెరుగదల కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే బ్యాంక్ నిఫ్టీ పతనమైనప్పటికీ, ఫార్మా షేర్లు బాగా పెరగడంతో మార్కెట్‌ నిలదొక్కుకుంది. FMCG షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (శుక్రవారం, 05 జనవరి 2024) 71,848 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 187.10 పాయింట్లు లేదా 0.12 శాతం పెరుగుదలతో 72,113 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 21,711 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 36.80 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 21,747 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

ఉదయం 9.45 గంటలకు పరిస్థితి
మార్కెట్ ప్రారంభమైన అరగంటలో, నిఫ్టీలో అడ్వాన్స్‌డ్‌ షేర్ల సంఖ్య తగ్గింది, డిక్లైనింగ్‌ షేర్ల సంఖ్య పెరిగింది. ఉదయం 9.45 గంటలకు నిఫ్టీ50 ప్యాక్‌లోని 21 స్టాక్స్‌ పెరిగితే, 29 స్టాక్స్‌ క్షీణించాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో BPCL 1.24 శాతం, హీరో మోటోకార్ప్ 1.12 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి. ONGC 0.67 శాతం, భారతి ఎయిర్‌టెల్ 0.66 శాతం, ఐషర్ మోటార్స్ 0.62 శాతం చొప్పున ఎగబాకాయి. 

సెన్సెక్స్‌లో… టైటన్ 2 శాతం లాభపడింది. టాటా మోటార్స్, HCL టెక్నాలజీస్, టాటా స్టీల్, L&T కూడా బలపడ్డాయి. మరోవైపు… HUL, ITC, HDFC బ్యాంక్‌ షేర్లు స్లిప్‌ అయ్యాయి.

బ్రాడర్‌ మార్కెట్‌లో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ స్థిరంగా ఉండే, స్మాల్‌ క్యాప్ 0.3 శాతం పెరిగింది.

2024 మొదటి వారంలో FIIలు రూ.3,290 కోట్ల విలువైన షేర్లను కొనుగోలుతో నెట్‌ బయ్యర్స్‌గా ఉన్నారు. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ దాదాపు రూ.7,900 కోట్లతో నెట్‌ సెల్లర్స్‌గా ఉన్నాయి.

ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 111.46 పాయింట్లు లేదా 0.15% పెరిగి 71,914.69 దగ్గర; NSE నిఫ్టీ 28.10 పాయింట్లు లేదా 0.13% తగ్గి 21,682.70 వద్ద ట్రేడవుతున్నాయి. 

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
గత వారాంతంలో, చైనా కంపెనీలపై ఆంక్షలు & తైవాన్‌కు ఆయుధ విక్రయాలకు ప్రతిస్పందనగా ఐదు US రక్షణ రంగ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. ఈ నెల 13న, డ్రాగన్‌ కంట్రీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. దక్షిణ కొరియా సముద్ర సరిహద్దు ప్రాంతం దగ్గర ఉత్తర కొరియా తీవ్ర స్థాయిలో కవ్వింపు చర్యలకు దిగింది.

ఈ ఉదయం ఆసియా మార్కెట్లు 0.8 శాతం వరకు పెరిగాయి. తైవాన్ 0.8 శాతం పెరిగింది. కోస్పి, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.5 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. గత శుక్రవారం, US మార్కెట్‌లో 10-వారాల విజయ పరంపర బ్రేక్‌ అయింది. అక్టోబర్ తర్వాత, S&P 500 చెత్త వీక్లీ పెర్ఫార్మెన్స్‌ చేసింది. ఈ రాత్రి యూఎస్‌ డిసెంబర్ నెల ద్రవ్యోల్బణం వెలువడుతుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవే

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *