ఓ చేత్తో డబ్బు తెస్తున్నారు, మరో చేత్తో ఖాతా ఖాళీ చేస్తున్నారు – ఇదేందయ్యా ఇదీ!

[ad_1]

SIP Accounts: స్టాక్ మార్కెట్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం, మార్కెట్‌లో మంచి బూమ్‌ నడుస్తోంది. దీనివల్ల, గత నెలలో (2023 మే నెల) సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. మే నెలలో, కొత్త SIP రిజిస్ట్రేషన్‌ల సంఖ్య 24.7 లక్షలుగా తేలాయి. అంతకుముందు నెల ఏప్రిల్‌లో ఓపెన్‌ అయిన కొత్త అకౌంట్స్‌ 19.56 లక్షలు. అంటే, ఏప్రిల్‌ కంటే మే నెలలో అదనంగా 5 లక్షల కంటే ఎక్కువ మంది సిప్ ఖాతాలు తెరిచారు.

ఖాతా ఖాళీ చేస్తున్న ఇన్వెస్టర్లు
అయితే, సిప్ అకౌంట్స్‌ను క్లోజ్‌ చేసిన వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. మే నెలలో 14.19 లక్షల ఖాతాలను ఇన్వెస్టర్లు క్లోజ్‌ చేశారని ఆంఫీ (Association of Mutual Funds in India – AMFI) కొత్త డేటాను బట్టి అర్ధం అవుతోంది. అంతకుముందు నెల, ఏప్రిల్‌లో మూసేసిన 13.21 లక్షల అకౌంట్స్‌తో పోలిస్తే, అకౌంట్‌ క్లోజర్స్‌ మే నెలలో 7.4 శాతం పెరిగాయి. మూసేసిన ఖాతాల ద్వారా, మే నెలలో, రూ. 31,100 కోట్లను ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్స్‌ నుంచి వెనక్కు తీసుకున్నారు. ఇది, ఏప్రిల్‌ నెల కంటే 36.6 శాతం ఎక్కువ.

SBI మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ MD డీపీ సింగ్ చెబుతున్న ప్రకారం… ఆన్‌లైన్ మోడ్‌ ద్వారా అకౌంట్‌ క్లోజ్‌ చేయడం సులభంగా మారడం కూడా ఖాతాల మూసివేతకు ఒక కారణం. అయితే, ఖాతాల మూసివేత సంఖ్య కంటే కొత్త రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ మీద పెట్టుబడిదారుల్లో ఉన్న విశ్వాసాన్ని చూపుతోంది.

సిప్‌లో పెరుగుతున్న టికెట్‌ సైజ్‌
ఓవైపు అకౌంట్స్‌ క్లోజ్‌ అవుతున్నా, కొత్త అకౌంట్స్‌ ద్వారా రికార్డ్‌ స్థాయి ఇన్‌ఫ్లోస్‌ సిప్స్‌లోకి వస్తున్నాయి. SIP సబ్‌స్క్రప్షన్స్‌ మే నెలలో కొత్త గరిష్ట స్థాయి రూ. 14,749 కోట్లకు చేరాయి. ఏప్రిల్‌లో రూ. 13,728 కోట్లుగా, మార్చి రూ. 14,276 కోట్లుగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఖాతాలు మూసేస్తున్నా… కొత్తగా వస్తున్న వాళ్లు, ఇప్పటికే ఉన్నవాళ్లు పెట్టుబడుల సైజ్‌ను భారీగా పెంచడం వల్ల పెట్టుబడులు ఎప్పటికప్పుడు పీక్‌ స్టేజ్‌కు చేరుతున్నాయి.

పెట్టుబడుల వరదతో, SIP నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) ఏప్రిల్‌లోని రూ. 7.17 లక్షల కోట్ల నుంచి మే నెలలో రూ. 7.53 లక్షల కోట్లకు, 5 శాతం పెరిగాయి. మొత్తంగా చూస్తే, మ్యూచువల్ ఫండ్స్ AUM మే నెలలో, 3.8 శాతం వృద్ధితో రూ. 43.2 లక్షల కోట్లకు చేరుకుంది. 

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ AUM మే నెలలో 4.5 శాతం జంప్‌తో రూ. 16.56 లక్షల కోట్లకు చేరుకుంది. ఏప్రిల్‌లో ఇది రూ. 15.84 లక్షల కోట్ల దగ్గర ఉంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీలో 2.6 శాతం జంప్ కారణంగా, AUMలో ఈ పెరుగుదల కనిపించింది.

మరో ఆసక్తికర కథనం: టాక్స్‌ ఫైలింగ్‌ టైమ్‌లో రిపీట్‌ అవుతున్న 7 తప్పులు, వీటి విషయంలో జాగ్రత్త 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *