[ad_1]
కీళ్లు కండరాల నొప్పులతో వృద్ధులే కాకుండా పిల్లలు, యువకులు కూడా బాధపడుతున్నారని డాక్టర్ కపిల్ త్యాగి అన్నారు. లైఫ్‌స్టైల్ మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమలేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, పాత గాయం, వాతావరణ మార్పుల కారణంగా ఈ సమస్యలు ఎదురువుతాని అన్నారు. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడానికి ఆయుర్వేదంలో కొన్ని నూనెలు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నువ్వుల నూనె..
కీళ్ల నొప్పులను తగ్గించడానికి మార్కెట్‌లో లభించే బామ్‌లు, నూనెలు, మందులు చాలా ఖరీదు ఉంటాయని, వాటిని ఎక్కువగా వాడితే సైడ్‌ఎఫెక్ట్స్ ఎదుర్కోవలసి ఉంటుందని డాక్టర్ కపిల్ త్యాగి అన్నారు. మీరు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతుంటే.. నువ్వుల నూనె అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. నువ్వుల నూనెను వేడి చేసి.. గురవెచ్చగా అయిన తర్వాత.. రోజుకు రెండు సార్లు నొప్పిగా ఉన్న ప్రాంతంలో ఈ నూనెను రాయండి. రాత్రి నిద్రపోయేముందు.. ఈ నూనె రాసుకున్నా మీకు నొప్పుల నుంచి ఉపశమనం పొందండి.
నారాయణ్ ఆయిల్..
నారాయణ్ ఆయిల్ కీళ్ల , కండరాల నొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. మీరు నొప్పి నుంచి చౌకగా ఉపశమనం పొందాలనుకుంటే, ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది. నారాయణ్ తైలం, బాలా తైలం సమపాళ్లలో తీసుకుని కొంచెం వేడి చేయండి. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నూనెను నొప్పిగా ఉన్న చోట.. ఈ నూనెను మసాజ్ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: ఇవి తీసుకుంటే.. కీళ్ల నొప్పులు వెంటనే తగ్గుతాయ్..!
ఆముదం..
ఆముదాన్ని ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. మీరు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, 14 మి.లీ ఆముదంలో ఒక గ్రాము రావి వేరు వేసి చిన్న మంట మీద పెట్టండి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
అల్లం, వెల్లుల్లి వేసిన నూనె..
నువ్వుల నూనె ఎలాంటి నొప్పినైనా మాయం చేసే గొప్ప ఔషధం. నూవ్వుల నూనెలో శొంఠి, వెల్లుల్లి వేసి బాగా మరిగించాలి. వీటి సారం నూనెలోకి దిగిన తర్వాత మంట ఆఫ్ చేయండి. రాత్రి నిద్రపోయేముందు గోరువెచ్చని నూనెను నొప్పిగా ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. మీకు కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: సింపుల్ టిప్స్‌తో.. కీళ్ల నొప్పులు మాయం..!
ఆముదం ఆకులు..
ఆముదం నూనె వలె.. ఆముదం ఆకు కూడా పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. మీకు కీళ్ల నొప్పు వేధిస్తుంటే.. ఆకుకు ఆముదం నూనె రాసి.. చిన్న మంటపై వేడి చేసి నొప్పి ఉన్న పాంతంలో కట్టండి. ఆ తర్వాత కొంత సమయం నడవండి. ఉదయానికి మీ నొప్పి మాయం అవుతుంది. (image source – pixabay)
కొబ్బరి నూనె..
కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే.. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, దానిలో కొద్దిగా కర్పూరం పొడి, శొంఠి పొడి వేయండి. ఈ నూనెను మోకాళ్లకు పట్టించి మసాజ్ చేస్తే.. నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply